పైడితల్లి అమ్మవారి ఆలయం, విజయనగరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
===జాతర===
అమ్మవారి జాతర సందర్భంగా [[సిరిమానోత్సవం]] చాలా ప్రాముఖ్యమున్నది. '''[[సిరిమాను]]''' అనేది భక్తి పూర్వకంగా జరుపుకునే ఒక [[ఉత్సవం]]. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూచ్చుని గుడికి ప్రదక్షిణ చెయ్యడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం<ref>[http://www.eenadu.net/archives/archive-24-10-2007/district/districtshow1.asp?dis=vijayanagaram#1ఈనాడు పత్రిక విజయనగరం జిల్లా సంచికలో 2001 అక్టోబరు 24 వ తేదీ నాటి వార్త ఇది.] (ఈ లింకుకు మూడు నెలల్లో కాలదోషం పడుతుంది.)</ref>
 
అమ్మవారి జాతరలో [[సిరిమాను]] సంబరం కీలకమైన ఘట్టం. సిరిమానోత్సవం ఆద్యంతం వీనుల విందుగా సాగుతుంది. ఈ సిరిమాను ఉత్సవానికి అసంఖ్యాకమైన భక్తులు వస్తుంటారు. ప్రతీ భక్తుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. పేరుకి గ్రామ దేవతే అయినా ఆ తల్లి కీర్తి మండలాలు, పట్టణాలు జిల్లాలు దాటి విశ్వవ్యాప్తమైంది. విజయనగరం, పైడితల్లి మహిమ గురించి ఎక్కడెక్కడ వాళ్లో తెలుసుకుని మరీ సిరిమానను, సంబరం రోజున వ్యవప్రయాసల కోర్చి మరీ వస్తుంటటారు. ఆశేషమైన భక్తులను విశేషంగా ఆకట్టుకునే సిరిమాను ఉత్సవంలో మొదటి నుంచి చివరి వరకూ అన్నీ రసవత్తరమైన సన్నివేశాలే. సిరిమాను రథం ఊరేగింపులో ఎనిమిది ప్రధానమైన అంశాలుంటాయి. అన్నింటిలో కీలకమైందీ, విశేషమైందీ సిరిమాను సంబరం, సిరిమాను ఉపరితలంపై బిగించే ఇరుసు, దానిపై ప్రధాన పూజారి ఆసనం, ఆయన చేతిలో విసనకర్ర ప్రత్యేక ఆకర్షణలు, సిరిమాను తిరుగుతున్నంత సేపూ భక్తులు అరటిపళ్లు విసరడం ఆనవాయితీగా వస్తోంది. 33 మూరలు ఉండే సిరిమాను కోసం అంతటి మాను లభించడమే విశేషం. తల్లి మహిమను అదే పెద్ద తార్కాణం చూడముచ్చటగా, అత్యంత శోభాయమానంగా సువర్ణ వర్ణంతో కళకళలాడే సిరిమాను ప్రధాన ఆకర్షణ అయితే సిరిమాను ముందు సాగే బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం చేసేందుకు జనం ఎగబడుతుంటారు.
===బెస్తవారి వల===
పైడితల్లి అమ్మ చరిత్రలో జాలర్లకు విశేషమైన స్థానం ఉంది. లోక పావని, కలియుగంలో ప్రత్యక్ష దైవంగా అలరారుతున్న పైడితల్లి దర్శన భాగ్యాన్ని మనకు కలిగించడంలో జాలర్లకు కీలక పాత్రం పోషంచారు. రెండున్న శతాబ్ధాలకు మునుపు అమ్మతల్లి పెద్ద చెరువు గర్భంలో నిక్షిప్తమై ఉన్నప్పడు ఆ తల్ల మూల విరాట్టును బయటకు తీయడంలో స్థానిక యూత వీధికి చెందిన జాలర్ల కృషి అమోఘం. అమ్మను మొదటిసారి చూసే భాగ్యం బెస్తవారికే దక్కింది. అమ్మవారి సేవపూర్వ జన్మసుకృతంగా భావించిన జాలర్లు ప్రధాన పూజారి అప్పలనాయుడిని ఒక కోరిక అడిగారని చరిత్ర చెబుతోంది. ప్రతీ ఏటా జరిగే సిరిమాను సంబరంలో అమ్మవారి సిరిమానుశ్రీన ముందు తమకు చోటు కల్పించాలనే జాలర్ల కోరికను అప్పలనాయుడు మన్నించారు. ఈ కారణంగానే ఆనాటి నుంచి సిరిమాను సంబరంలో బెస్తవారి వలతో జాలర్లు ఉండటం ఆనవాయితీగా వస్తోంది. ===పాలధార===
జాలరి వల వెనుక ఈటెలతో వచ్చే జనం సాధారణ జనం కాదు. వీరిని పూర్వీకులు మహాశక్తి స్వరూపులుగా పరిగణించారు. పాలధారంగా పిలిచే ఈ జనధాన అమ్మవారి సైనిక శక్తిగా ప్రతిరూపంగా చెబుతుంటారు. వీరి చరిత్ర కూడా ఘనమైనదే. పూర్వం కోట వెనుక అడవిలో నివసించే ఆటవికులు కోటరక్షణగా ఉండేవారని కథనం. వారికి గుర్తుగానే సిరిమాను ఉత్సవంలో ఈటెలు ధరించి డప్పులు వాయిస్తూ సిరిమాను ఊరేగింపులో పాల్గొంటారు. వీరిని అమ్మవారి శక్తికి ప్రతిరూపాలుగా భక్తులు విశ్వసిస్తారు.
===తెల్ల ఏనుగు===
సిరిమాను జాతరలో తెల్ల ఏనుగు మరో విశిష్టమైన ఆరర్షణ, గజపతులు వారి ప్రాభవాన్ని ప్రతిబింబించే విధంగా పట్టపుటేనుగును అమ్మవారి సిరిమాను సంబరంలో ఉంచేవారు. అయితే కాలక్రమేణా సంస్థానాలు, రాజ్యలు పోవడంతో 1956వ సంవత్సరం నుంచి పట్టపుటేనుగును ప్రతిబింబించే విధంగా ఏనుగు ఆకారంలో ఒక బండిని రూపొందించి సిరిమాను ముందు నడిపిస్తున్నారు. ఈ బండి మీద ఏడుగురు స్త్రీ వేషధారులు, ఒక పురుషుడు ఉంటారు. ఈ ఏడుగురు స్త్రీలు పైడితల్లి అక్కచెల్లెళ్లు కాగా పరుషుడు అమ్మవారి ఏకైక సోదరుడు పోతురాజుగా చెబుతుంటారు. అపురూప దేవతలందర్నీ ఒకే వేదికపై మనకు సాక్షాత్కరింపే చేసే ఆ ఏనుగు నిజంగా ఐరావతమే.
===అంజలి రథం===
సిరిమాను సంబరంలో చివరిదైన చిత్రమైన అంశం అంజలి రథం. అమ్మవారి వైభోగానికి ఈ అంజలి రథం ప్రత్యేక నిదర్శనం. ఏలికా, పరిచారికమధ్య, అనుబంధానికి ఈ అంజలి రథం ప్రతీకగా నిలుస్తుంది. అంజలి రథంపై ఉండే ఐదుగురు స్త్రీలు అమ్మవారిని సేవించి ధరించిన పరిచారికలు. నాడు తల్లిపై వాళ్లు చూపించిన భక్తి ప్రవక్తులను నేటికీ గుర్తుకు తెచ్చేలా అంజలి రథంపై స్త్రీ వేషదారులు సిరిమాను ముందు అంజలి ఘటించి కనిపిస్తారు. తరతరాల సేవా నిరతికి భక్తి విశ్వాసాలకు మారుపేరే అంజలి రథం. బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ముందు నడవగా వేషదారులు భక్తి పారవశ్యంతో కదంతొక్కి పరిగెడుతుండగా లక్షలాది మంది భక్తులు అమ్మవారి వైభవాన్ని తనివితీరా చూసి భక్తి భావంతో మమేకమవుతుంటారు. అమ్మవారు తన గుడి నుంచి బయటకు వచ్చి ముక్తమనోహరంగా అలంకరించిన సిరిమానుపై పూజారి వేశంలో ఆశీనులై ఊరేగుతారు.
 
ఈ సిరిమానే నిదర్శనం సిరిమాను కోసం 33 మూరలు ఉండే వృక్షాన్ని కనిపెట్టడం సామాన్యులకు సాధ్యమయ్యే అంశం కాదు. ప్రతీ ఏటా సిరిమాను సంబరానికి సరిపడే వృక్షం లభించడం కూడా ఒక అద్భుతమైన ఘట్టం. <ref>[http://www.andhravoice.net/newsDetails.php?id=27057#sthash.Vpx1ewoi.dpuf చల్లంగా చూడమ్మా.. పైడితల్లమ్మా...]</ref>
 
==మూలాలు, బయటి లింకులు==