జాని: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
విస్త్రరణ
పంక్తి 25:
|imdb_id = 0316062 |
}}
'''జాని ''' పవన్ కళ్యాణ్ స్వీయ కథాకథనదర్శకత్వంలో రూపొందించబడ్డ తెలుగు చలన చిత్రం. 25 ఏప్రిల్ 2003న అట్టహాసంగా, ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య విడుదలైననూ, వాణిజ్యపరంగా విజయం సాధించలేకపోయినది. పవన్ కళ్యాణ్ నటజీవితంలోనే ఇది అతిపెద్ద వైఫల్యంగా ఈ చిత్రం పేరు తెచ్చుకొన్నది.
 
== కథ ==
చిన్ననాటనే తల్లిని కోల్పోయిన జానీ (పవన్ కళ్యాణ్) ను అతని తండ్రి (రఘువరన్) కూడా పెద్దగా పట్టించుకోడు. పైగా సిగరెట్లు ఎక్కువ కాలుస్తూ ఉండటం, మద్యం ఎక్కువ సేవిస్తున్న తండ్రిని భరించలేక జానీ ఇంటి నుండి పారిపోతాడు. పెరిగి పెద్దవాడైన జానీ మార్షల్ ఆర్ట్స్ కోచ్ అవుతాడు. జానీ ఒకరిని దేహశుద్ధి చేయటం చూచిన గీత (రేణు దేశాయ్) అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేస్తుంది. అది అపార్థమని తెలుసుకొన్న గీత అతనిని క్షమాపణలు కోరుతుంది. ఇరువురి మధ్య సఖ్యత నెలకొని ప్రేమ, పెళ్ళి ల వరకు దారితీస్తుంది. వివాహానంతరం గీతకు క్యాన్సర్ సోకుతుంది. స్నేహితుల వద్ద నుండి సేకరించిన కొంత మొత్తం డబ్బుతో జానీ గీత వైద్యం కొరకు ముంబై వెళతాడు.
 
ముంబయిలో ప్రతి రోజు బాక్సింగ్ ఫైట్ లు జరుగుతాయని, జానీకి తెలిసిననూ, తొలుత వద్దనుకొంటాడు. కానీ గీత పరిస్థితి నానాటికి విషమించి, ఒకే రోజులో రెండు లక్షల రూపాయలు అవసరం అవుతాయి. దీనితో జానీ ఒప్పుకొంటాడు. జానీ గీతను బ్రతికించుకొన్నాడా, లేదా అన్నదే తర్వాతి కథ.
 
==ప్రయోగాలు==
ఈ చిత్రం పై [[పవన్ కళ్యాణ్]] చేసినన్ని ప్రయోగాలు బహుశ: భారతదేశం లో ఏ దర్శకుడూ చేసి ఉండరు. మచ్చుకి కొన్ని.
"https://te.wikipedia.org/wiki/జాని" నుండి వెలికితీశారు