ఈతకోట: కూర్పుల మధ్య తేడాలు

చి అచ్చు తప్పులు
వ్వవసాయ పంటల వివరాలు చేర్చబడ్డాయి.
పంక్తి 92:
}}
'''ఈతకోట''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[రావులపాలెం]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.. పిన్ కోడ్: 533 238.
ఈ గ్రామము [[జాతీయ రహదారి]] సంఖ్య 5 కి చేర్చి,రావులపాలెం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడగన్నవరం మంచిమీదుగా రాజోలు, మరియు మిగతా కోనసీమ ప్రాంతాలకు ఈ ఊరు లో నుండి జిల్లా పరిషత్తు రోడ్డుపై వెళ్ళాలి. రావులపాలెం తరువాత ఈతకోట, కోనసీమకు రెండవ ముఖద్వారంగా ఉంది. ఈ గ్రామంలోమంచి గ్రంథాలయం, ఉన్నత పాఠశాల ఉన్నాయి. మండలంలో వరుసగా రెండుసార్లు నూరు శాతం ఫలితాలు సాధించిన ఘనత ఇక్కడి పాఠశాలకు ఉంది. ఈ గ్రామంలో సామాజికాభివృద్ధికై బెర్రాజు ఫొండేషన్, స్వగ్రామ సేవ సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రత్యేక పాఠశాలకు మాత్రం జరగవలసినది చాలా ఉన్నది.
ప్రధాన పంటగా వరితో బాటు అరటి, చెరకు, కొబ్బరి, పసుపు, కంద, నువ్వులు వంటి వాణిజ్య పంటలన్నీ ఇక్కడ పండుతాయి. ఇంకా కూరగాయలు, మినుములు, కందులు, పెసరలు వంటి పప్పుధాన్యాలు కూడా పండిస్తారు. క్రమేణా వస్తున్న మార్పుల కారణంగా వ్యవసాయ భూమి విస్తీర్ణం కొంచెం తగ్గుతూ ఉంది. పాడి పశువుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ గత దశాబ్దం నుండి కోళ్ళఫారాలు వృద్ధి చెందాయి.
ఈ గ్రామంలో ఒకప్పుడు పెద్ద కోట ఉండేదని, దాని ఛుట్టూ రక్షణగా నీటితో నిండిన కందకం ఉండేదని, కోటను చేరడానికి ఈదుకొని వెళ్ళాలని చెప్పుకుంటారు. అందుకే ఈ గ్రామానికి ఈతకోట అని పేరు వచ్చింది.
సాగు నీటి సౌకర్యపరంగా ఈతకోట కాటన్ దొర పుణ్యమా అని గోదావరి జలాలతో కళకళలాడుతోంది. సస్యశ్యామలమయిన వరి పొలాలతో, బారులు తీరిన కొబ్బరి చెట్లతో, అనేక వాణిజ్య పంటలతో అలరారుతూ ఉంటుంది. త్రాగు నీటి కోసం ఊరు మధ్యలొ రెండు చెరువులు ఉన్నాయి. కాని అవి ప్రస్తుతం త్రాగు నీరుకు అనుగుణంగా నిర్వహించడం లేదు. కుళాయిల ద్వారా, శుధ్ధిచేసిన చెరువు నీటిని పంపుల ద్వారా పంచాయితీ వారు అందచేస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఈతకోట" నుండి వెలికితీశారు