అంకితం వెంకట జగ్గారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
ఆయనకు కళలపై ఉన్న అభిరుచితో అనేక దేశాలను సందర్శించారు. ఆయన వద్ద పారిస్ వద్ద సేకరించిన అసలైన చిత్రాలు ఉండేవి.
 
ఆయన 1900లో ఇంగ్లాండ్ పర్యటించారు. అచట విక్టోరియా మహారాణి మరియు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ను కలిసారు. అక్కడ కొంతకాలం ఉన్న తదుపరి ఆయన రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ సభ్యునిగా ఎన్నికైనారు. రాయల్ మెటరాలాజికల్ సొసైటీ, రాయల్ కొలోనియల్ ఇనిస్టిట్యూట్ మరియు సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ లలొ సభ్యత్వాన్ని పొందారు. ఆయన అనేక నక్షత్రశాలను సందర్శించారు. ఆయన పారిస్, స్విడ్జర్లాండ్ మరియు ఇటలీ దేశాలకు పర్యటించారు. అచట అనేక అపురూపమైన చిత్రాలను సేకరించారు. ఆయన వద్ద 10000 వాల్యూమ్స్ గల అందమైన గ్రంథాలయం ఉండెడిది. అందులో విజ్ఞానశాస్త్రం, ఆంగ్ల సాహిత్యం మరియు భారతీయ విజ్ఞాన సర్వస్వాలు ఉండేవి.
 
ఆయన స్వంత ఖర్చుతో ఒక వైద్యశాలను కట్టించారు. విశాఖపట్నం ప్రజలకు ఆ కాలంలో వైద్య సహాయాన్ని అందిందుటకు ఈ వైద్యశాల ఉపయోగపడేది.
==పురస్కారాలు==
ఆయనకు ఇంగ్లాండ్ నుండి విక్టోరియా మహారాణి యొక్క కాంస్య విగ్రహం పురస్కారంగా వచ్చింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}