శ్రీకృష్ణసత్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
{{వేదిక|తెలుగు సినిమా}} |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 28:
'''శ్రీకృష్ణసత్య''' [[కె.వి.రెడ్డి]] దర్శకత్వం వహించగా, [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]], [[జయలలిత (నటి)|జయలలిత]], [[కాంతారావు]], [[ఎస్.వి.రంగారావు]] తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన 1971 నాటి పౌరాణిక చిత్రం. శ్రీ రామావతారానికి, శ్రీ కృష్ణావతారానికి సంధానం చేస్తూ నిర్మించిన పౌరాణిక చిత్రమిది. పౌరాణిక కథకు కల్పన జోడించి చిత్రకథను రూపొందించారు.
== చిత్రకథ ==
ద్వాపర యుగంలో శ్రీ కృష్ణావతర కాలంలో చంద్రసేన సత్యభామగా జన్మస్తుంది. శ్రీకృష్ణునిపై అకారణ ద్వేషం పెంచుకుంటుంది. సత్యభామకు పూర్వజన్న జ్ఞాపకం చేసి తనవశం చేసుకుంటాడు శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణుడు తనకే స్వంతమై ఉండాలని సత్యభామ పంతం. రుక్మిణి పుట్టిన రోజని శ్రీకృష్ణుడు ఆమె మందిరానికి వెళ్లినాడని సత్యభామ కినుక వహిస్తుంది. నారదుడు, శ్రీకృష్ణుని వశపరచుకొనుటకు పుణ్యక వ్రతమాచరించమని అందులో భాగముగా శ్రీ కృష్ణుని తనకు దానమిమ్మని సత్యభామకు సూచిస్తాడు. సత్యభామ అలకను శ్రీ కృష్ణుడు తీర్చువేళ నారదుని సూచించిన పుణ్యక వ్రత వృత్తాంతాన్ని చెబుతుంది. సత్యభామ ముచ్చట తీర్చడానికి శ్రీకృష్ణుడంగీకరిస్తాడు. వ్రత విధానమైన పిమ్మట శ్రీకృష్ణుని దానం పొందిన నారదుడు, శ్రీ కృష్ణుని తూచదగ్గ ధనధనేతరములు సత్యభామ వద్ద లేక పోవుటచే శ్రీకృష్ణుని అమ్మజూపుతాడు. రుక్మిణి తులసిదళంతో శ్రీకృష్ణుని తూచుటతో సత్యభామకు అహంకారం నశిస్తుంది. శ్రీ కృష్ణుడు హస్తినకు పాండవదూతగా వెళ్లి రాయబారం నెఱపుతాడు.పాండవులకు సూది మొన మోపిన భూమిని కూడా ఇయ్యనని దుర్యోధనుడు పట్టు దలగా ఉండాడు. రాయబారం విఫలమవుతుంది. పాండవ కౌరవుల యుధ్దమనివార్యమవుతుంది. కౌరవసేనను చూసి తల్లడిల్లిన అర్జునునకు గీతోపదేశం చేస్తాడు గోవిందుడు. గీతోపదేశంతో చిత్రం ముగుస్తుంది.
|