కొసరాజు (రచయిత): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''కొసరాజు'''గా ప్రసిద్ధి చెందిన ఈ, [[తెలుగు సినిమా]] పాటల రచయిత పూర్తిరచయితగా పేరుపేరుపొందిన '''కొసరాజు రాఘవయ్య చౌదరి''' ([[సెప్టెంబరు 3]], [[1905]] - [[అక్టోబరు 27]], [[1986]]) సుప్రసిద్ధ కవి మరియు రచయిత.
 
==జీవిత సంగ్రహం==
1905లో [[బాపట్ల]] తాలూకా [[కర్లపాలెం]] మండలం [[చింతాయపాలెం]] <nowiki/>లో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు.యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించారు.
 
తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేకపీఠం. ఆ రోజుల్లోని చాలా చిత్రాలు ''కొసరాజు ముద్ర''ని బాగా వాడుకున్నాయి. ''వ్యంగ్యం, హాస్యం మిళాయించిన పాట ఒకటి చిత్రంలో వుండాలి, అది రాఘవయ్య చౌదరిగారు రాయాలి'' - అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది. ఆ సూత్రానికి తగ్గట్టుగానే కొసరాజు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళభరితం చేశారు. జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి. ''ఏరువాక సాగాలోరన్నో…'' అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా ''రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ…'' అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు రాఘవయ్య చౌదరి. అంతే కాకుండా ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నాడు.
 
==బాల్యం==
"మా సొంత వూరు [[అప్పికట్ల (బాపట్ల)|అప్పికట్ల]]. అక్కడ ఒకే వీధిబడి వుండేది. ఆ బడిలో నాలుగోతరగతి తర్వాత ఇంక పై క్లాసులేదు. అంచేత, నేను నాలుగు చదివేసినా, ఊరికే కూచోక, మళ్ళీ నాలుగు చదివాను'' అని చెప్పాడు కొసరాజు ఒక ఇంటర్వ్యూలో . నాలుగోతరగతి తప్పితే మళ్లీ చదవడం వేరు, పాసై మళ్లీ చదవడం వేరు. అలా, ‘డబల్‌ ఎమ్‌.ఏ.’లాగా, ఆయన చిన్నతనంలోనే ‘డబల్‌ నాలుగు’ డిగ్రీ పొందారు. ఐతే, ఆయన ఊరుకోలేదు. తన తల్లి మేనమామ వెంకటప్పయ్యగారు గొప్ప పండితులు. వంశంలో వున్న ఆ సాహితీరక్తం - రాఘవయ్య లోనూ ప్రవహించి, ఉత్తేజపరిచింది. ఆ ఉత్సాహంతో వీధిబడిలో వుండగానే ఆయన బాలరామాయణం, [[ఆంధ్రనామసంగ్రహం]] వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. వరుసకు పెదనాన్న అయిన [[త్రిపురనేని రామస్వామి]] నుండి అచ్చ తెలుగు నుడికారము, తర్కవితర్కాలు, తెలుగు భాషా సౌందర్యము తెలుసుకున్నాడు.''
 
కొడముది నరసింహం పంతులుగారని, పండితుడూ, విమర్శకుడూ ఆ గ్రామంలోనే వుండేవారు. కొసరాజుకు కొండముది వారి ప్రోత్సాహం లభించింది. నరసింహంగారు భజనపద్ధతిలో రామాయణం రాసి, ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ బాల ప్రదర్శనలో పాల్గొన్న రాఘవయ్య రాముడి పాత్రధారి. అప్పటికే ఆయన కంఠం లౌడ్‌ స్పీకర్లా వుండేది. పాటా మాటా నేర్పిన నరసింహంగారే, పొలాల గట్లమీద కొసరాజును కూచోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పేవారు, సాహిత్య సభలకు తిప్పారు. అది ఎంత దూరం వెళ్లిందంటే, పన్నెండో ఏటికే కొసరాజు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించాడు! ''బాలకవి'' అని బిరుదు పొందాడు. సినిమాలకి వచ్చిన తర్వాత ‘కొసరాజు’ ఎంత పాప్యులరో, బాల్యదశలో ‘బాలకవి’ అంత పాప్యులర్‌. పత్రికల్లో కవితలు రాయడానికీ, ‘రైతుపత్రిక’లో సహాయ సంపాదకుడుగా పనిచెయ్యడానికీ స్కూలు, కాలేజీ చదువులు చదవకపోవడం - ఏ మాత్రం అడ్డురాలేదు.
 
[[హేతువాది]] .కొసరాజు రాఘవయ్య 1905లో [[గుంటూరు]] మండలములోని [[అప్పికట్ల]] గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించాడు. చిన్ననాటినుండే తెలుగు సాహిత్యము, పురాణాలు, కావ్యాలపై పట్టు సాధించి, వరుసకు పెదనాన్న [[త్రిపురనేని రామస్వామి]] నుండి అచ్చ తెలుగు నుడికారము, తర్కవితర్కాలు, తెలుగు భాషా సౌందర్యము తెలుసుకున్నాడు. తెలుగు పండితుడు ముదికొండ నరసింహం పంతులు సాంగత్యముతో తన భాషా పటిమకు మెరుగులు బెట్టాడు. అదే సమయములో రైతుబిడ్డగా పొలము పనులలో నిమగ్నమై జానపదుల తెలుగులోని సొగసులు, చమక్కులు తెలుసుకున్నాడు.
 
==తొలి రోజులు==
"https://te.wikipedia.org/wiki/కొసరాజు_(రచయిత)" నుండి వెలికితీశారు