మొహెంజో-దారో: కూర్పుల మధ్య తేడాలు

ప్రదేశం
→‎ప్రదేశం: చారిత్రక నేపథ్యం
పంక్తి 3:
== ప్రదేశం ==
సింధు నదికి పడమర దిశగా సింధ్ కు చెందిన లర్కానా జిల్లా లో మొహంజో-దారో కలదు. ఇది సింధు నదికి, ఘగ్గర్-హక్రా నదికి మధ్యలో ఉన్నది. లర్కానా నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఇది కలదు. నగరం చుట్టూ సింధు నది నుండి వచ్చే వరదనుండి రక్షించటానికి కోటగోడ కట్టబడినది. మొహంజో-దారో నాగరికతను బలహీనపరచిన చివరి వరద ఉధృతి కారణంగా ఈ కోటగోడ దెబ్బ తిన్నది. ఇప్పటికీ సింధు నది దీనికి తూర్పు దిశగా ప్రవహిస్తున్ననూ, పశ్చిమదిశలో ఉన్న ఘగ్గర్-హక్రా నది మాత్రం ఎండిపోయినది.
 
== చారిత్రక నేపథ్యం ==
మొహంజో-దారో క్రీ.పూ. 26వ శతాబ్దంలో నిర్మించబడినది. క్రీ.పూ. 3000 నుండి అభివృద్ధి చెందుతూ వచ్చిన ప్రాచీన సింధు లోయ నాగరికత (హరప్పా నాగరికత)లో నిర్మించబడిన అతిపెద్ద నగరాలలో ఇది కూడా ఒకటి. ఉచ్ఛదశలో ఉన్నపుడు ప్రస్తుత పశ్చిమాన [[పాకిస్థాన్]] నుండి ఇరాన్ సరిహద్దుల వరకు , ఉత్తరాన [[అఫ్ఘానిస్థాన్]] నుండి [[ఉత్తర భారతదేశము]] నుండి దక్షిణాన గుజరాత్ వరకు, విస్తరించి హరప్పా, మొహంజో-దారో, లోథల్, కాలిబంగన్, ఢోలవీర మరియు రాఖీఘరీ లు ప్రధాన పట్టణాలుగా విలసిల్లినది. అయితే వీటన్నింటిలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకొన్నది మాత్రం మొహంజో-దారోనే. ఇక్కడి నిర్మాణంలో శాస్త్రీయత, ఆవాస ప్రణాళికలు అత్యంత అభివృద్ధి చెందినవి కావటమే ఇందుకు మూలం. సింధు లోయ నాగరికత అంతరించగనే మొహంజో-దారో కళావిహీనం అయినది.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మొహెంజో-దారో" నుండి వెలికితీశారు