కస్తూరి శివరావు: కూర్పుల మధ్య తేడాలు

+{{విస్తరణ}}
చి Robot-assisted disambiguation: స్వర్గసీమ
పంక్తి 4:
ప్రేక్షకుల దగ్గర్నుంచి అమితమైన అభిమానం సంపాదించిన తొలి హస్యనటుడు కస్తూరి శివరావు. శివరావుకి సినిమాల్లో వేషాలు వెయ్యకముందే నలుగురులో మంచి పేరు వుండేది. అతను మూకీచిత్రాలకి వ్యాఖ్యానం చెప్పేవాడు. ఆ వ్యాఖ్యానం సరసోక్తులతో, చమత్కారాలతో, ఉత్సాహభరితంగా వుండేది. ‘వ్యాఖ్యాత శివరావు’ అని ప్రచారం ఇస్తే జనం పెరిగేవారు. సినిమా పూర్తయిన తర్వాతనో, మధ్య విరామంలోనో - వ్యాఖ్యానం చెబుతున్న శివరావు ఎలావుంటాడో చూడాలని జనం ఎగబడేవారు. ఐతే, అప్పటింకా ఆటోగ్రాఫులు అడగడాలు కరచాలనాలూ రాలేదు.
==సినీ జీవితం==
శివరావు నాటకాల్లో హాస్యపాత్రలు ధరించాడు. పద్యాలూ, పాటలూ బాగా పాడేవాడు. హాస్యం మార్కుతో వున్న పాటలు గ్రామ ఫోన్‌ రికార్డులుగా ఇచ్చాడు. [[వరవిక్రయం]] (1939) సినిమాలో చిన్న వేషం వేసాడు శివరావు. [[చూడామణి]] (1941) సినిమాలో అతడు వేసిన మంగలిశాస్త్రి అనే వేషం జనం దృష్టిలో బాగాపడి, ‘శివరావు’ తెలిసాడు. తర్వాత తర్వాత అక్కడా అక్కడా చిన్నా, చితకా వేషాలు వేసినా, [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]] (1945) తో ఇంకా బాగా తెలిసాడు. [[బాలరాజు]] (1948) తో ఇంకా బాగా తెలిసి పెద్ద నటుడైపోయి, జనాన్ని వెంట పరిగెత్తించుకున్నాడు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అందులోని శివరావు నటనా, అతని పాటలూ ప్రేక్షకజనాన్ని బాగా ఆకర్షించాయి.
 
ఆ దశలోనే వచ్చిన [[గుణసుందరి కథ]], [[లైలా మజ్ను]], [[రక్షరేఖ]], [[శ్రీ లక్ష్మమ్మ కథ ( ప్రతిభ)|శ్రీ లక్ష్మమ్మ కథ]], [[స్వప్న సుందరి]] ( అన్నీ 1949 విడుదలలే! ) మొదలైన చిత్రాలు పెద్ద హిట్లు కావడంతో శివరావును ప్రజలు అద్భుత హాస్య నటుడిగా కొనియాడారు. సినిమాలు, ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో తారలు అందరూ వెళ్ళితే, శివరావు వెంటా, దగ్గరా మాత్రం ఎక్కువమంది జనం గుమిగూడి కనిపించేవారు. [[గుణసుందరి కథ]] లో శివరావే కథానాయకుడు నిజానికి. ఆ చిత్రంలోని ఊతఓదం ‘గిడి గిడి’ తో జనసందోహం చేసిన సందడీ, గోలా ఆకాశం అంటేవి. 1950 లో శివరావు సొంతంగా సినిమా కంపెనీ ఆరంభించి, [[పరమానందయ్య శిష్యుల కథ (1950 సినిమా)|పరమానందయ్య శిష్యుల కథ]] హాస్య నటులతో తీసాడు. [[అక్కినేని నాగేశ్వరరావు|నాగేశ్వరరావు]] హీరో కాగా, హీరోయిన్‌గా, [[గిరిజ]]ను పరిచయం చేశాడు. అతనే దర్శకత్వం వహించాడు.
"https://te.wikipedia.org/wiki/కస్తూరి_శివరావు" నుండి వెలికితీశారు