చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం (2) using AWB
పంక్తి 1:
 
 
{{Infobox prepared food
|name=చాకొలెట్
Line 19 ⟶ 17:
'''చాకొలెట్ ''' చెట్ల నుండి వచ్చే, కాఫీని పోలిన, పదార్థం. దీనిని రకరకాల పానీయాలలోను, తినుభండారాలలోను, [[మిఠాయి]] లలోను కలుపుతారు. చాకొలెట్ కలిసిన వంటకాలు, పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. స్నేహితులైనా, ప్రేమికులైనా, ఆత్మీయులైనా, అధికారులైనా, శుభాకాంక్షలు చెప్పాలన్నా, అభినందనలు తెలపాలన్నా, స్వాగతిస్తున్నా, వీడిపోతున్నా, ఇచ్చిపుచ్చుకునే కానుక చాకొలెట్. ఒకప్పుడు ఎవరినైనా కలవాలన్నా, శుభాకాంక్షలు చెప్పాలన్నా, పూలూ పండ్లే తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు వీటి స్థానంలోకి చాకొలెట్ వచ్చేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలకయితే చాకొలెట్ ని మించిన కానుక లేనే లేదు. అందుకే అందమైన పెట్టెలలో అలంకరించి మరీ అందిస్తున్నారు. పెళ్లి, పుట్టినరోజు, కొత్త సంవత్సరం, వంటి వేడుకల్లోనూ ఫ్యాషన్ వేదికలమీదా అద్భుతమైన చాకొలెట్ కళాకృతులతో ఆహూతుల్ని అలరిస్తూ తీసి రుచుల్ని అందిస్తున్నారు.
==చరిత్ర==
[[దక్షిణ అమెరికా]]లో ఒకానొకప్పుడు నివసించిన మాయ, ఆజ్టెక్ జాతులు చాకొలెట్ తో చేసిన పానీయాలు విరివిగా తాగేవారు. పురావస్తు పరిశోధకుల మాటలని బట్టి చూస్తే చాకొలెట్‌ సుమారు 3,000 సంవత్సరాల కిందటే ఉపయోగంలో ఉండేదిట. చాకొలెట్‌ ని మనకి పరిచయం చేసిన ఘనత హాంస్‌ స్లోన్‌ (Hans Sloan) అనే ఐర్లండు దేశపు వైద్యుడికి దక్కుతుంది. (ఈయన లండన్‌ లో ఉన్న [[బ్రిటిష్ మ్యూజియం]] సంస్థాపకులలో ఒకడు.) ఈయన జమైకాలో బ్రిటిష్‌ గవర్నర్‌ దగ్గర పని చేస్తూన్న రోజులలో చేదుగా ఉండే కోకో తాగలేక దాంట్లో కాసిన్ని పాలు కలిపేడు. (టీ లో పాలు కలిపి తాగడం కూడ బ్రిటిష్‌ వాళ్ల అలవాటే!) చేదుగా ఉన్న కొకో లో పాలు కలిపేసరికి దాని రుచే మారిపోయింది. అప్పటివరకు వేడి నీళ్లల్లో కలుపుకు తాగే కోకో పాలల్లో కలిపేసరికి ఎంతో రుచిగా తయారయింది. అప్పటినుండి ఘనరూపంలో ఉన్న చాకొలెట్‌ కి కూడ పాలు కలిపేసరికి తినడానికి వీలుగా తయారయింది. <ref> Davide Castelvecci, Chocalate: Mixing the bitter treat with milk was the popular breakthrough, Scientific American, p 96, September 2009</ref>
==చాకొలెట్ - రకాలు - తయారీ ==
కకోవా (cocoa) గింజలతో చేసే చాక్లెట్ల రుచులూ, రకాలూ కోకొల్లలు. ప్రాథమికంగా చాకొలెట్ మూడు రకాలు.
*కకోవా లిక్కర్ (గింజ తొడిమనుంచి తీసే పొడి లేదా ద్రవం)
*కకోవా బటర్ (గింజలోని కొవ్వుపదార్థం)
*కకోవా పొడి (లిక్కర్, కొవ్వు తీసేయగా మిగిలిన పొడి)ని వాడుతూ చేస్తారు.
 
కకోవా అభిషవానికి (లిక్కర్‌కి) కాస్త కకోవా వెన్న (బటర్), పంచదార కలిపి చేసేదే నల్ల (డార్క్ లేదా బ్లాక్) చాకొలెట్. ఇందులో కలిపే కకోవా అభిషవం గాఢత కనీసం 35 శాతానికి తగ్గకూడదనే నిబంధన ఉంది. ఖరీదైన డార్క్ చాకొలెట్ లో 70 నుంచి 99 శాతం కకోవా లిక్కర్ ఉంటుంది. కకోవా ద్రవం లేదా పొడి కనీసం 20 శాతం ఉండి పాలు, పంచదారతో కలుపుతూ చేసేదే '''పాల చాకొలెట్'''. కకోవా బటర్ మాత్రమే వాడుతూ పాలు, పంచదారతో చేసేదే '''తెల్ల చాకొలెట్'''. ఇందులో కకోవా అస్సలు ఉండదు. ఈ మూడు రకాలకీ జోడించే పాలు, పంచదార శాతాన్ని బట్టి ఎన్నో రకాల చాకొలెట్ లు చేస్తారు. వీటిల్లోనూ పుదీనా, వెనీలా, కాఫీ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ... ఇలా రకరకాల షాడబాలనీ (ఫ్లేవర్లని), బాదం, వేరుసెనగ, పిస్తా, వంటి పలుకులనూ జోడిస్తూ చేసే మరెన్నో రకాలు చాకొలెట్ లు ఉన్నాయి.
 
==చాకొలెట్ ని నిల్వ చెయ్యడం==
తాజాగా ఉన్న చాకొలెట్ మంచి రుచిగా ఉంటుంది. తాజాగా ఉన్న చాకొలెట్ కి ఉన్న కూర్పరితనం (texture), షాడబం (flavor) నిల్వ ఉన్న చాకొలెట్ కి ఉండవు. అందుకని, చాకొలెట్ ని ఎప్పుడు తినదలుచుకున్నామో అప్పుడే కొనుక్కుని తినడం మంచిది. ఘన రూపంలో ఉన్న చాకొలెట్ ని చల్లగా ఉన్న (65 - 68 F), చెమ్మదనం (humidity) తక్కువగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేస్తే చాల రోజులు తాజాగా, కమ్మగా ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకుని నిల్వ చేస్తే నల్ల చాకొలెట్ ఏడాది పాటు పాడవకుండా ఉంటుంది. పాల చాకొలెట్, తెల్ల చాకొలెట్ ఆరు నెలలు నిల్వ ఉంటాయి. నిల్వ చేసిన చాకొలెట్ కి గాలి, వెలుగు తగల కూడదు. ఎండ తగిలితే చాకొలెట్ కరిగి ముద్దయిపోతుంది. అందుకనే ఇండియాలో నాణ్యమైన చాకొలెట్ కొనుక్కుని, తిని, ఆనందించడం కష్టం. మనకి బజారులో దొరికే చాకొలెట్ ఎండకి, వేడికి తట్టుకోవాలి కనుక దానిలో ఏదో కలపాలి. అలా కలిపితే చాకొలెట్ అసలు రుచి పోతుంది.
 
ఇండియాలో అన్ని కాలలోను వేడిగానే ఉండే ప్రదేశాలే ఎక్కువ కనుక తినగా మిగిలిన చాకొలెట్ ని రిప్రిజిరేటర్ లో పెట్టక తప్పదు. అటువంటి పరిస్థితులలో చాకొలెట్ ని డబ్బాలో పెట్టి, మూత గట్టిగా పెట్టి, రిప్రిజిరేటర్ లో దాచుకుని, తినే ముందు కొద్ధి క్షణాలు వెచ్చబడనిచ్చి తినడం మంచిది. మూత పెట్టపోతే రిప్రిజిరేటర్ లో ఉన్న వంటకాల వాసనలు చాకొలెట్ కి అంటుకుని రుచి పాడవుతుంది.
Line 42 ⟶ 40:
** కకోవా ఉపయోగించి తయారుచేసిన చాక్లెట్ వల్ల జీర్ణనాళ క్యాన్సర్ వచ్చే అవకాశము తగ్గుతుంది.
** ఫ్రీ రాడికల్స్ జీర్ణనాళములోని పేగుభాగపు క్యాన్సర్ ని తెస్తున్నాయ్ని కనుగొనబడింది . అటువంటి ఫ్రీ రాడికల్స్ నుండి జీర్ణనాళ రక్షణకు చాక్లెట్లు చక్కగా పనికొస్తాయని కొన్ని పరిశోధనలవల్ల వ్యక్తమయినది .
** ఫ్లావనాల్స్ అనే పదార్ధంపదార్థం శరీరంలో ఎండోథీలియం నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియకు తోడ్పడుతుంది. అంతేకాకుండా తక్కువ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్న వారు ఈ డార్క్ చాక్లెట్లు తీసుకుంటే సత్ఫలితాలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
**చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయనేది అపోహ మాత్రమే. చాక్లెట్లే కాదు, పిండిపదార్థాలు ఉన్న ఏ పదార్థం ఇరుక్కున్నా పళ్లు పుచ్చిపోతాయి. చాక్లెట్‌లోని సహజ కొవ్వులవల్ల మిగిలిన స్వీట్లకన్నా దీన్ని శుభ్రం చేయడం తేలిక. కకోవాలోని టానిన్లు త్వరగా పాచి పట్టనీయవు.
**కానీ కొంత మందికి కోకోవా పడదు [[అలర్జీ]] వస్తుంది . నిద్ర కుడా కొందరిలో సరిగా పట్టదు . చాకోలిట్లు వాడడం లో జాగ్రత్త పడాలి .
Line 63 ⟶ 61:
* 1528లో స్పానిష్ పరిశోధకుడు HERNANDO CORTEZ కోకా బీన్స్ మెక్కను దక్షిణ అమెరికా నుంచి స్పానిష్ రాజకుటుంబానికి బహుమతిగా తెచ్చాడట.
* మొదటి సారి మెక్సికోలో చాక్‌లెట్ బార్ తయారీ ప్రారంభమైంది. అదీ 300 ఏళ్ల క్రితం. ఆ తరువాత చాలా కాలానికి 1840లో ప్రఖ్యాత క్యాడ్‌బరీ కంపెనీ ప్రారంభమైంది.
* మనుషులకు అంత ప్రియమైన చాక్‌లెట్లు కుక్కలకు మాత్రం ఏమంత మంచివి కాదట. చాక్‌లెట్‌ల్లో వుండే థియోబ్రొమైన్ అనే పదార్ధంపదార్థం కుక్కల సెంట్రల్ నెర్వస్ సిస్టమ్‌ను దెబ్బతీస్తుందట.
* మిల్క్ చాక్లెంట్లంటే ప్రపంచవ్యాప్తంగా మోజే కానీ, మగవారు ఎక్కువ డార్క్ చాక్‌లెట్లనే ఇష్టపడతారని ఓ సర్వేలో తేలింది.
* ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏడు బిలియన్ డాలర్ల విలువైన చాక్‌లెట్లు ఖర్చయిపోతున్నాయి.
Line 76 ⟶ 74:
==బయటి లంకెలు==
* [https://www.facebook.com/chocolateyami I love chocolate and ice cream facebook page]
 
[[వర్గం:మిఠాయిలు]]
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు