నాలుగు స్తంభాలాట (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
music = [[రమేష్ నాయుడు]] |
playback_singer = [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల]] |
starring =[[సుత్తివేలు]],<br />[[విజయ నరేష్|నరేష్]],<br>[[ప్రదీప్ (నటుడు)|ప్రదీప్]],<br>[[పూర్ణిమ]], [[తులసి (నటి)|తులసి]] |
}}
'''నాలుగు స్తంభాలాట''' [[జంధ్యాల]] దర్శకత్వంలో, [[విజయ నరేష్|నరేష్]], [[ప్రదీప్|ప్రదీప్]], [[పూర్ణిమ]], [[తులసి (నటి)|తులసి]] ముఖ్యపాత్రల్లో నటించగా [[నవతా కృష్ణంరాజు]] నిర్మించిన 1982 నాటి చలనచిత్రం. నలుగురు యువతీయువకుల జీవితంతో ప్రేమ, పెళ్ళిళ్ళతో జీవితం ఆడుకున్న ఆటగా ఈ కథను రాసుకున్నారు జంధ్యాల. భారమైన ప్రేమకథలో సినిమాల్లో అంతగా అనుభవం లేని హీరోహీరోయిన్లతో నటింపజేసి జంధ్యాల విజయం సాధించారు. హిందీలో ఈ సినిమాను సంజయ్ దత్, అశోక్ కుమార్, పద్మినీ కొల్హాపురి ముఖ్యపాత్రల్లో బేకరార్ అన్న పేరుతో పునర్నిర్మించారు. ఈ సినిమాలో [[సుత్తి వీరభద్రరావు]], [[సుత్తి వేలు]] చేసే హాస్యం చాలా ప్రాచుర్యం పొంది, సుత్తి అన్న పదాన్ని తెలుగు నాట ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. ఆ సినిమా నుంచి వేలు, వీరభద్రరావుల పేర్లకు సుత్తి అనేది ఇంటిపేరు అయ్యింది.
 
== చిత్ర కథ ==
నరేష్ ([[విజయ నరేష్]]), ప్రదీప్ ([[ప్రదీప్ (నటుడు)|ప్రదీప్]]) ప్రాణస్నేహితులు. నరేష్ ధనవంతుడు కాగా, ప్రదీప్ ది మధ్యతరగతి కుటుంబం. ప్రదీప్ ఇంట్లో అద్దెకుంటున్న కుటుంబంలోని అమ్మాయి శారద([[పూర్ణిమ]])ని నరేష్ ప్రేమిస్తాడు. నరేష్, శారదలు కలవడానికి ప్రదీప్ రాయబారిగా సహాయం చేస్తాడు. ఈ క్రమంలో ప్రదీప్, శారదల మధ్య కనిపించిన సాన్నిహిత్యాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళ పెద్దలు వాళ్ళిద్దరికీ పెళ్ళి నిశ్చయిస్తారు. అనుకోకుండా ఒకనాడు నరేష్, శారదలు శారీరికంగా దగ్గరవుతారు. నరేష్ మేనమరదలు కమల([[తులసి (నటి)|తులసి]])కి అతనంటే విపరీతమైన ఇష్టం. శారదని పెళ్ళిచేసుకుంటే, చచ్చిపోతానంటూ నరేష్ అన్న బెదిరిస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నరేష్, కమలని పెళ్ళిచేసుకుంటాడు. శారద గర్భవతి అయిందని తెలిసిన ప్రదీప్ ఆమె పరువు నిలబెట్టేందుకు తానే పెళ్ళిచేసుకుంటాడు. అయితే లోకం ముందు భార్యాభర్తలైనా, ఏకాంతంలో చెల్లెలిలా చూసుకుంటానని మాటిచ్చి పెళ్ళాడతాడు. ఆ మాటను నిలబెట్టుకుని ఆమెను అభిమానంగా చూసుకుని పెద్దమనసుతో వ్యవహరిస్తాడు. శారద ఆడపిల్లని కంటుంది, ఆ పాపకి నరేష్ తల్లి మహాలక్ష్మి పేరుపెడతాడు ప్రదీప్. తిరుపతి వెళ్ళేదారిలో రెండు జంటలు కలుస్తాయి. కమల మానసికంగా అనుభవించే క్షోభ చూసి నిద్రమాత్రలు మింగి చివరకు శారద ఆత్మహత్య చేసుకుంటుంది.
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===