భట్టిప్రోలు లిపి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బౌద్ధస్తూపము: clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB
పంక్తి 7:
==బౌద్ధస్తూపము==
{{main|భట్టిప్రోలు స్తూపం}}
[[ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర|తెలుగుదేశ చరిత్రలో]] ప్రాచీనాంధ్ర నగరమయిన [[భట్టిప్రోలు]]ది విశిష్టస్థానం<ref>శాతవాహన పూర్వయుగపు స్థావరాలు: చారిత్రక నేపధ్యంనేపథ్యం, పి. ఆర్. కె. ప్రసాద్, 2004, గుంటూరు జిల్లా సమగ్ర చరిత్ర, గుంటూరు జిల్లా చరిత్ర సంఘం, గుంటూరు</ref>. ప్రపంచ బౌద్ధారామాలలో ప్రముఖ చరిత్ర గలిగినదిగా కీర్తించబడిన బృహత్ [[స్తూపం]] ఇక్కడ ఉన్నది<ref>The Buddhist Architecture in Andhra, D. J. Das, 1993, Books and Books, New Delhi</ref>. క్రీ. పూ. 4-3 శతాబ్దాల నాటి ఈ స్తూపం భవననిర్మాణ రీతులలోని ప్రథమ దశలను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించిన శాసనాలు ప్రజాస్వామిక విలువలకు నెలవైన గణతంత్ర రాజ్యంగా భట్టిప్రోలు ఉనికిని బలపరుస్తున్నాయి<ref>భట్టిప్రోలు స్తూపము: వాస్తువు, బ్రాహ్మీ శాసనములు, ప్రాక్తెలుగు, కార్తికేయ శర్మ, 1986, భారతి, అక్టోబరు సంచిక</ref>. [[గౌతమ బుద్ధుడు]], జైన తీర్థంకరుడైన [[మహావీరుడు]] ఈ ప్రాంతాన్ని దర్శించారన్న అభిప్రాయం చరిత్రకారులలో ప్రబలంగా ఉంది<ref>Buddha's Preaching of the Kalachakra Tantra at the Stupa of Dhanyakataka, H. Hoffman, in: German Scholars on India, Vol. I, 1973, PP. 136-140, Varanasi</ref><ref>Taranatha; http://www.kalacakra.org/history/khistor2.htm</ref>.
 
భట్టిప్రోలు స్తూపము ధాతుగర్భము. అనగా బుద్ధుని ధాతువులపై నిర్మించబడినది. శాసనాలలోని 'బుధ శరీరాని నిఖేతుం', 'బుధ శరీరాని మహనీయాని కమ్మనే' అనే వాక్యాలనుబట్టి స్తూపం యదార్ధమయిన బుద్ధ ధాతువుపై నిర్మించబడినట్లు స్పష్టం. స్తూపం మధ్య అమూలాగ్రంగా రంధ్రం ఉన్నది. రంధ్రము చుట్టూ ఇటుకలను పద్మాకారములో అమర్చారు. రంధ్రంలో స్తూపాగ్రాన ఉండే ఛత్రపుకాడను అమర్చారు. రంధ్రముగుండా మూడు బండరాతి పేటికలు (శిలా మంజూషికలు) లభించాయి.
"https://te.wikipedia.org/wiki/భట్టిప్రోలు_లిపి" నుండి వెలికితీశారు