బొబ్బిలి యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58:
ఆ సమయంలో రంగారావు తన ముఖ్య సేనానులను, అనుచరులను సమావేశపరచి, ఓటమి అనివార్యమని చెప్పి, తదుపరి కర్తవ్యం గురించి వారికి చెప్పాడు, అందరూ రంగారావు చెప్పినదానికి అంగీకరించారు. ఓటమి తరవాత, తామ స్త్రీలు, పిల్లలు శత్రువు చేతికి చిక్కి అవమానాల పాలు కాకూడదని భావించిన బొబ్బిలి వీరులు, కోటలోపల ఉన్న తమ నివాసాలకు నిప్పు పెట్టారు. మంటలకు తాళలేక బయటకు వచ్చే వారిని కత్తులతో పొడిచి చంపారు. ఆలా కోటలో ఏ ఒక్క స్త్రీ, గానీ, పిల్లవాడు గానీ బ్రతకలేదు, ఒక్క రంగారావు కుమారుడు తప్ప. కుమారుని చంపమని అతడి గురువుకు రంగారావు ఇచ్చిన ఆదేశాలను అమలు చెయ్యలేక అతడిని రక్షించాడు, ఆ బాలుడి గురువు. (మరో కథనంలో ఆ బాలుణ్ణి రక్షించినది అతడి ఆయా లక్ష్మి అని ఉంది.)<ref>[https://books.google.co.in/books?id=9Fb26pWqhScC నిజాము - బ్రిటను సంబంధాలు 1724-1857] - పేజి:106</ref>
 
యుద్ధంలో చిట్టచివరి బొబ్బిలి వీరుడు కూడా నేలకొరిగాక మాత్రమే ఫ్రెంచి సైన్యం కోటలోనికి ప్రవేశించలేకపోయిందిప్రవేశించగలిగింది. లోపలికి వెళ్ళిన వారు అక్కడ మంటల్లో స్త్రీలు, పిల్లలు చనిపోయిన దృశ్యం చూసి దిగ్భ్రాంతులయ్యారు. శవాల మధ్య నుండి నడుచుకుంటూ, ఆ గురువు రంగారాయుని కుమారుణ్ణి తీసుకుని వచ్చి బుస్సీ మనుష్యులకు అప్పగించారు.  వాళ్ళు ఆ కుర్రవాడిని బుస్సీ వద్దకు తీసుకువెళ్ళారు.
 
లోపల జరిగిన సామూహిక మరణాల గురించి తెలిసిన బుస్సీ, కోటలోనికి వెళ్ళేందుకు కూడా ఇష్టపడలేదు. (మరొక కథనం ప్రకారం అతడు కూడా లోపలికి వెళ్ళాడు.) బుస్సీ ఆ పిల్లవాడిని బొబ్బిలి వారసునిగా గుర్తించి, తాను రంగారావుకు బొబ్బిలి స్థానంలో ప్రతిపాదించిన కొత్త ప్రాంతానికి రాజుగా ఆ కుర్రవాణ్ణి గుర్తించాడు.
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_యుద్ధం" నుండి వెలికితీశారు