ఆర్యభట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → ,, ఉన్నవి. → ఉన్నాయి., లో → లో (4), కి → కి (2), గా → గా (2 using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధా → గ్రంథా (5), బడినది. → బడింది., → (2), ( → ( (2) using AWB
పంక్తి 28:
అయినా గానీ ఆ పుస్తకంలో లోతైన ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో చాలా విశేషాలతో పాటు, ఒకదానికొకటి ఎదురుగానూ, ఒకే దిశలోనూ సంచరించే గ్రహాలు కలుసుకోవడానికి అవసరమయ్యే సమయాన్ని లెక్కగట్టడానికి కొన్ని సూత్రాలు కూడా ప్రతిపాదించాడు. సంఖ్యాశాస్త్రంలో కూడా చెప్పుకోదగ్గ కృషిచేశాడు.
 
ఆర్యభట్టుడాతని గ్రంధాలలోగ్రంథాలలో శాలివాహన శతకాన్నిగానీ, విక్రమాదిత్య శకాన్నిగాని ఉపయోగించలేదు. యుధిష్టర యుగాన్నే చెప్పేడు.అందువల్ల ఈయన యుధిష్టర యుగం వాడుకలో ఉండేటప్పుడే ఈతను జన్మించివుంటాడు. [[వరాహమిహిరుడు]] తనగ్రంధాల్లో శకభూపాలకాలమని, శకేంద్రకాలమని ఉపయోగించాడు.ఇదే విక్రమాదిత్యకాలమని [[భట్టోత్పలు]] డన్నాడు. [[భాస్కరుడు]] కూడా తన సిద్ధాంత గ్రంధాల్లోగ్రంథాల్లో శాకనృపసమయమని ఉపయోగించాడు. ఇదే శాలివాహన శకమని కొందరు పెద్దలు చెబుతారు.ఈరెండు శకాలు వాడుకలోనికి ఎప్పుడు వచ్చాయో అన్న విషయం చెప్పడం కష్టం.కాని ఇవి రెండు వాడుకలోనికి రాక పూర్వమే ఆర్యభట్టుడు జన్మించాడు.ఆర్యభట్టుడు [[mouli]]కి పూర్వుడు. అనేక వందలసార్లు బ్రహ్మగుప్తుడు ఆర్యభట్టు నామాన్ని ఉదహరించాడు. వరాహమిహిరునికి కన్నా పూర్వుడని అనేక అధారాలు ఉన్నాయి. ఎందుచేతనంటే, వరాహమిహిరుని గ్రంధాలుగ్రంథాలు [[శ్రీసేనుడు]] [[రోమక సిద్ధాంతం]] మీదా, [[విష్ణుచంద్రుడు]] [[వశిష్ట సిద్ధాంతం]] మీదా అధారపడి ఉన్నాయి. ఈరెండు సిద్ధాంతాలు ఆర్యభట్టుని సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని వ్రాయబడినవని బ్రహ్మగుప్తుదు సూచించాడు. కాబట్టి ఆర్యభట్టుడు బ్రహ్మగుప్తుడికి, వరాహమిహిరునికి పూర్వుడన్నమాట మనం నమ్మవచ్చు. బ్రహ్మగుప్తుడు శాలివాహన శకంలో ఆరవ శతాబ్దానికి చెందినవాడు. వరాహమిహిరులు ఇద్దరున్నారు. రెండవ శతాబ్దంలో ఒకడు, ఐదవ శతాబ్దంలో ఒకడు. ఈ రెండవ వరాహమిహిరునికి పూర్వులైన విష్ణుచంద్ర శ్రీసేన దుర్గసింహులకుకూడా ఆర్యభట్టుడు పూర్వుడు. ఈవిషయాలన్నీ పరిశీలిస్తే, ఆర్యభట్టుడు నిస్సందేహంగా శాలివాహనశకం ఐదవ శతాబ్దానికి కొన్ని సంవత్సరాలు ముందుగానే ఉన్నాడని నిర్ధారణకు రావచ్చును. ఇంకా సూక్ష్మంగా చర్చిస్తే ఆర్యభట్టుడు క్రీ.శ.426లో జన్మించాడని, ఆర్యభట్టీయమనే గ్రంధాన్నిగ్రంథాన్ని క్రీ.శ.499లో వ్రాసాడని చెప్పవచ్చును.
 
ఆర్యభట్టుడు ఎప్పుడూ కూడా ఆకాశంవైపు చూస్తూ కంటికి కనబడ్డవాటికి, అప్పటికి ఉన్నట్టి సిద్ధాంతాల వలన ఫలితాలకి గల వ్యత్యాసాన్ని గుర్తించి, చాలా విచారించి దేవునిగూర్చి తపస్సు చేసేడట. దానిఫలితమే '''దశ గీతిక''' అనేచిన్న గ్రంథం. ఈయన రచించిన ఆర్యభట్టీయమనే గ్రంథంలోని భాగాలు రెండు -దశాగీతిక, ఆర్యాష్టోత్తరశతకము. ఈదశగీతికలో పదమూడు శ్లోకాలున్నాయి. ఇవన్నీ వ్యాకరణ సూత్రాల్ని పాటించకుండా వ్రాయబడ్డవి. ఈగ్రంథంలో చిన్నచిన్న సూత్రాల్లో గూఢంగా అనంతమైన శాస్త్రజ్ఞానాన్ని ఇమిడ్చిపెట్టాడు. గణితపాదం, కాలక్రియపాదం, గోలార్ధ ప్రకాశిక అనేవి మూడు ఆర్యాష్టోత్తరశతకంలో ప్రకరణాలు. ఆర్యభట్టుని గ్రంధాలకుగ్రంథాలకు వ్యాఖ్యానకారులు చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యులు దశకగీతిప్రకాశిక వ్రాసిన [[సూర్యదేవదీక్షితుడు]], కేరళకు చెందిన [[నీలకంఠసోమయాజి]].
 
== రచనలు ==
పంక్తి 60:
 
== ఖగోళ శాస్త్రం ==
భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు వస్తాయని, రాహు కేతువులు అనేవి నిజంగా లేవని వాదించాడు. కానీ అతని వాదనని అప్పట్లో ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు కూడా కొంత మంది గ్రహణం సమయంలో భోజనం చెయ్యరు, గర్భిణి స్త్రీలని ఇంటి బయటికి రానివ్వరు. ఆర్య భట్ట బోధనలు [[గ్రీకు|గ్రీక్]] శాస్త్రవేత్తలని కూడా ప్రభావితం చేసాయి. భూమి నీడ చంద్రుని మీద గోళాకారం (elliptical shape)లో పడుతుంది కనుక భూమి గుండ్రంగా ఉన్నట్టు గ్రీక్ శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఆర్యభట్ట సిధ్ధంతాల ఆధారంగానే. కానీ అప్పట్లో ప్రజలలో ఈ సిధ్ధాంతాలని నమ్మేంత జ్ఞానం వృధ్ధి చెందలేదు.
 
ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తల కష్టాలకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన గోళాధ్యాయంలో నిర్వచించాడు. అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయంప్రకాశం కానే కాదని, అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన వచ్చినదని చెప్పాడు. [[సూర్య గ్రహణం|సూర్య గ్రహణాల]]ను ఖచ్చితంగా లెక్క కట్టాడు.
 
భూమి తన చుట్టూ తాను తిరగటానికి ([[పరిభ్రమణం]]) పట్టే సమయం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకనులుగా లెక్కగట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల, 56 నిమిషాల, 4.091 గా తేలింది.
పంక్తి 84:
ఆర్యభట్టుడు '''భూగోళః సర్వతోవృత్తః''' అని వ్రాసాడు.భూగోళ మనే మాటలో ఇమిడిఉంది భూమియొక్క వర్తులత్వం (Sphericity). భూమి నక్షత్రగోళానికి మధ్యగా నిరాధారంగా ఉందని చెప్పాడు.ఆర్యభట్టుడు భూభ్రమణం, భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యునిచుట్టూ తిరుగుతోందని ఈ క్రింద శ్లోకంలో చెప్పాడు.
" భప్ంజరః స్థిరో భూరేవావృత్యావృత్య ప్రాతిదైశికా ఉదయాస్తమయో సంపాదయతి నక్షత్రగ్రహణాం" - నక్షత్రగోళం స్థిరంగా ఉంది. ఈ భూమే తిరుగుతూ నక్షత్రాలయొక్క గ్రహాలయొక్క ఉదయాస్తమయాల్ని కలగజేస్తోంది.
కాని ఈసిద్ధాంత మప్పటి ప్రజాభిప్రయానికిన్నీ ప్రాచీన సిద్దంతాలకున్నూ వ్యతిరేకంగా ఉండడం చేత భయపడో, లేక ఊరికే గణితానికి అనుకూలంగా ఉండేకొరకో, ఎందుకోగానీ వెంటనే మళ్ళీ భూమి తిరక్కుండా మధ్యనుందనీ, నక్షత్రాలూ, గ్రహాలూ భూమిచుట్టూ తిరుగుతున్నాయనీ వ్రాసాడు.ఆర్యభట్టుని భూభ్రమణ సిద్ధాంత మారోజుల్లోనే బ్రహ్మగుప్తునిచే ఆక్షేపింపబడినదిఆక్షేపింపబడింది.
"ప్రాణేనైతి కలాం భూర్యదితత్కుతో వ్రజేత్కనుధ్వానుం, ఆవర్తన మర్వాక్చే న్నపతంతి సముచ్ఛ్హాయాః కస్మాత్"- భూమి ఒకప్రాణంలో ఒకకల కనక కదలినట్లైతే, ఎక్కడికి వెళుతోంది? అది తిరుగుతోంటే ఎత్తైన వస్తువులు పడిపోవెందుచేత?.
కానీ దీనిని బ్రహ్మగుప్తుని భాష్యకారుడగు [[ప్రీతూదకస్వామి]] ఖండిస్తూ, ఆర్యభట్టుని సూత్రాన్నే సమర్ధించాడు.కాబట్టి భూభ్రమణం తెలిసినవారూ, ఒప్పుకున్నవారూ కూడా మన పూర్వుల్లో ఉన్నారు.
 
భూమి మొదలగు గ్రహాలయొక్క గతి పూర్తిఅయినవృత్తంలో లేదనీ దీర్ఘవృత్తంగా (elliptical) ఉందనీ తెలియజేసిన వారిలో మొదటి హిందువుడు ఆర్యభట్టుడే. సూర్యచంద్ర గ్రహణాలకి కారణంగా చెప్పబడే రాహుకేతువుల్ని గ్రహించక ఆర్యభట్టుడు, చంద్రుడు భూచ్ఛ్హాయలోనికి వెళ్ళినప్పుడే చంద్రగ్రహణం కలుగుతోంది అన్న విషయాన్నికూడా తెలియపరిచాడు. ఇదీకాక, ఈ చంద్రుడు మొదలయిన గ్రహాలు స్వయంప్రకాశములు కావనీ, సూర్యకాంతివల్లనే ప్రకాశిస్తున్నాయని చెప్పినవాడు కూడా ఆర్యభట్టుడే కాని నక్షత్రాలని కూడా వాటితో చేర్చాడు.
 
భూమికాకర్షణశక్తి కలదని, అన్ని మాటల్లో చెప్పకపోయినా, అతనికావిషయం తెలుస్తున్నట్లుగా రెండుమూడుచోట్ల, ఆ శక్తిని గురించి ఆతడు చేసిన సూచనలవల్లన ఊహించవచ్చునని కొందరంటారు. [[భాస్కరుడు]] మాత్రం ఆకర్షణశక్తి అనేపదాన్ని వాడాడు.
"https://te.wikipedia.org/wiki/ఆర్యభట్టు" నుండి వెలికితీశారు