"వేటూరి ప్రభాకరశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

లింకులు సరిచేశాను
(లింకులు సరిచేశాను)
'''వేటూరి ప్రభాకరశాస్త్రి''', [[తెలుగు]] కవి, భాష పరిశోధకుడు మరియు చరిత్రకారుడు. చరిత్రలో లభ్యమౌతున్న మొట్టమొదటి తెలుగు పదము ''నాగబు'' అని కనుగొన్నది ఈయనే.
 
ప్రభాకరశాస్త్రి, [[కృష్ణా జిల్లా]], [[మోపిదేవి]] మండలములో [[కృష్ణా నది]] తీరమున ఉన్న [[పెద్ద కళ్ళేపల్లిపెదకళ్ళేపల్లి]]లో శ్రీవత్స గోత్రజులైన వేటూరి సుందరశాస్త్రి, శేషమ్మలకు మూడవ సంతానముగా [[1888]], [[ఫిబ్రవరి 7]]న జన్మించాడు. ఈయనకు నలుగురు సోదరులు, నలుగురు సోదరీమణులు. తండ్రి సుందరశాస్త్రి [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] వైద్యుడు. ప్రభాకరశాస్త్రి ప్రాథమిక విద్య స్వగ్రామములోనే సాగినది, తండ్రి వద్ద, మద్దూరి రామావధాని వద్ద సంస్కృతాంధ్రములను నేర్చుకొన్నాడు. ఉపనయనమైన తర్వాత ప్రభాకరశాస్త్రిని ఆయన తండ్రి శాస్త్రాలు అభ్యసించడానికి [[చెల్లపల్లిచల్లపల్లి]]లోని అద్దేపల్లి సోమనాథశాస్త్రి వద్ద చేర్పించాడు.
 
16 యేళ్ల వయసులో, [[చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి]] [[బందరు]] ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని తెలిసి కొందరు సహాధ్యాయులతో కలిసి అక్కడ చేరాడు. బందర్లో విద్యాభ్యాసము చేస్తున్న కాలములో ఈయన [[కొండా వెంకటప్పయ్య]] మరియు వల్లూరి సూర్యనారాయణరావుల ఇంట నివసించాడు. తెలుగులో తనకు తెలిసినదంతా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రితో ముఖతః వినోదగోష్ఠిలో విని నేర్చుకున్నదేనని ఆ తరువాత ప్రభాకరశాస్త్రి చెప్పుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/196962" నుండి వెలికితీశారు