రైలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రైలు రవాణా వ్యవస్థ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎రైలు మార్గాల విద్యుదీకరణ: clean up, replaced: ప్రశక్తి → ప్రసక్తి using AWB
పంక్తి 120:
అవిరి రైళ్ళ కంటే ఎలక్ట్రిక్ రైళ్ళ విషయంలో అనేక సౌలభ్యాలున్నాయి. ఆవిరిని ఇంజన్ బాయిలర్లలో ఎక్కడికక్కడే తయారుచేసుకోవాలి. కానీ ఎలక్ట్రిక్ రైళ్ళకు కావలసిన విద్యుచ్చక్తిని కొన్ని పెద్ద పవర్ స్టేషన్లలో ఉత్ప్త్తి చేసి నిర్వహణ ఖర్చులను తగ్గించవచ్చు ఆవిరి రైళ్ళలో ఉపయోగించటానికి వీలులేని నాసిరకం బొగ్గు, జలశక్తి,సహజ వాయువు, పరమాణు శక్తి లాంటి ఇంధనాలనూ, శక్తి జనకాలనూ విధ్య్చ్చక్తి ఉత్పాదనలో వాడుకోవచ్చు. ఎలక్ట్రిక్ రైళ్ళు తమ ఇంధనాన్ని గానీ, నీటిని గానీ ఆవిరి రైలు లాగా మోసుకొని పోవలసిన పనిలేదు.పని చేసేటప్పుడు మాత్రమే ఇవి శక్తిని ఉపయోగించుకుంటాయి. కానీ ఆవిరి రైలు బయలు దేరటానికి చాలా ముందుగానే ఆవిరిని సిద్ధం చేసి ఉండాలి. రైలు ;స్టేషన్ల వద్ద ఆగిఅప్పుడూ, ప్రయాణం ముగించిన కాసేపటికి వరకూ కూడా ఇంధనం సష్టమవుతుంది. ఎలక్ట్రిక్ రైలులో నియంత్రణ సాధనాలను, రక్షణ సదుపాయాలను వీటిలో జోడించటానికి వీలుంది. ఇంధనాన్ని పలుమార్లు ఇంజన్ లోకి జొప్పించే అవసరం లేకపోవటంతో గమ్య స్థానాన్ని వేగిరంగ చేరుకోవచ్చు.
 
ఎలక్ట్రిక్ రైళ్ళలో పొగ, మసి లెకపోవటం ప్రయాణీకులకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇంజన్ పొగ లోని ఆమ్ల సంబంధమైన అంశాల వల్ల ఇళ్ళు, కట్టడాలు దెబ్బతినే ప్రశక్తిప్రసక్తి లేదు. పొగగొట్టం నుంచి వచ్చే మిణుగులుల వల్ల అపాయం లేదు. పొరంగాల్లో వెళ్ళేటప్పుడు వాతావరణం కలుషితం కాదు. మట్ట ప్రాంతాల్లో ప్రయాణం ఆవిరి రైలు కంటే వేగంగా ఉంటుంది. ఈ అన్ని కారణాల మూలంగానే రైలు మార్గాల విద్యుదీకరణ అన్ని దేశాల్లోనూ విస్తృతంగా జరుగుతోంది.
==విద్యుదీకరణ - రకాలు==
విద్యుదీకరణ రెండు రకాలుగా జరుగుతుంది. ఒక రకంలో 50 నుంచి 3000 వోల్టుల వరకు ఏకముఖ విద్యుత్ ప్రవాహాన్ని వాడుతారు. మరోరకం లో 25,000 వోల్టుల ఏకాంతర విద్యుత్తు ని ఉపయోగిస్తారు. డి.సి. ని వాహక తీగల్లో ఎక్కువ దూరం తీసుకెళ్ళితే ప్రసార నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పవర్ స్టేషను లు ఎ..సి నే సరఫరా చేస్తాయి. కానీ ఎలక్ట్రిక్ రైళ్ళు పనిచేయటానికి కావలసింది డి.సి యే, ఎ.సి.ని డి.సి. గా మార్చటానికి మొదట్లో మెర్క్యురీ ఆర్క్ రెక్టిఫైయర్, కాంటాక్ట్ రెక్టిఫైయర్ లను వాడేవారు. ఇటీవల జెర్మేనియం రెక్టిఫైయర్. యూస్టన్-లివర్ పూల్ మార్గంలో మాత్రం 25,000 వోల్ట్ ఎ.సి ని వాడుతున్నారు. దీన్ని 1960 లో ప్రారంభించారు. 3,300 హె.సి ఇంజన్ తొ ఇది గంటకు 90 మైళ్ళ వేగాన్ని సాధించగలిగింది. ఆవిరి ఇంజన్ వెళ్ళె గరిష్ట వేగం గంటకు 130 మైళ్ళయితే, ఫ్రాన్స్ లో ఎలక్ట్రిక్ రైలు 1955 లోనే 205 మైళ్ళ వేగాన్ని సాధించింది.
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు