కొత్తపల్లి జయశంకర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3), , → , (2), లో → లో (2), కు → కు , గా → గా (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, హైదరాబాద్ → హైదరాబాదు, అంతస్థు → అంతస్తు, పార్ using AWB
పంక్తి 36:
| weight =
}}
[[తెలంగాణ]] సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ '''కొత్తపల్లి జయశంకర్''' ([[ఆగష్టు 6]], [[1934]] - [[జూన్ 21]], [[2011]]) [[వరంగల్ జిల్లా]], [[ఆత్మకూరు (వరంగల్ జిల్లా)|ఆత్మకూరు]] మండలం [[పెద్దాపూర్]] గ్రామశివారు [[అక్కంపేట (పెద్దాపూర్ (ఆత్మకూరు)|అక్కంపేట]]లో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ [[బ్రహ్మచారి]]గా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి [[కాకతీయ విశ్వవిద్యాలయం]] వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టిపార్టీ ఏర్పాటులో [[కె.చంద్రశేఖరరావు]]కు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011, జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.
 
==బాల్యం==
పంక్తి 48:
 
==తెలంగాణా ఉద్యమంలో==
1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1952 లో జయశంకర్ నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చాడు. [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కె.సి.ఆర్]]కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించాడు. [[తెలంగాణా]] రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు. అబ్ తొ ఏక్ హీ ఖ్వాయిష్ హై, వొ తెలంగాణ దేఖ్‌నా ఔర్ మర్‌జానా' (ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి) అని అనేవాడు.
 
విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిది. విద్యార్థి దశ నుంచే తెలం‘గానం’ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఉరికి ఆనా టి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశా లాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సా ర్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన అపర మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణకోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయ నం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసిన అక్షరయావూతికుడు ఆయన.
పంక్తి 60:
తెలంగాణ సాధికారిక స్వరం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఇంటర్వ్యూ ప్రారంభసంచికలో వేయాలని ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ అల్లం నారాయణ సార్ ఆ బాధ్యతను నాపై పెట్టారు. జయశంకర్ సార్‌తో మాట్లాడటమంటే.. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమాన్ని గురించి తెలుసుకోవడమే. ఆ ఉత్సాహంతోనే సార్‌కు ఫోన్ల మీద ఫోన్లు చేసి విసిగించాను. ‘ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు. అయినా ఇప్పుడు నా ఇంటర్‌వ్య్యూ ఎందుకయ్యా చూద్దాం లే..’ అంటూ సున్నితంగా తిరస్కరించినప్పటికీ… చివరికి ఒప్పుకున్నారు.
హబ్సీగూడ రోడ్ నెంబర్ 5లో ఉన్న ‘కాంక్రీట్ హార్మొని’ అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్థులోనిఅంతస్తులోని పెంట్‌హౌస్… అక్కడి నుంచి చూస్తే ఉద్యమాల పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ గొప్పగా కనిపిస్తోంది. అదేమాట సార్‌తో అంటే… ‘ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతి ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది చెప్పు.. అందరికీ ఉస్మానియా యూనివర్శిటీ అంటే చెట్లు కనిపిస్తయి.. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్లముందే కదుల్తు కనిపిస్తరు. దు:ఖమొస్తది.. అయితే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు… అదే ఉస్మానియాలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్నాపకం. కానీ వారి భవిష్యత్ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకుని… వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయనాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
 
==అస్తమయం==
పంక్తి 73:
తరతరాలుగా తెలంగాణకు సీమాంధ్ర పాలకులు, మీడియా చేస్తున్న అన్యాయాలు, అక్రమాల గురించి గంటల తరబడి వివరించే సత్తా, సాధికారత ప్రొఫెసర్ జయశంకర్ సొంతం. నీళ్లు, ఉపాధి, విద్య, సంస్కృతి…ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అందులో తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఆయన బాధాతప్త హృదయంతో చెబుతారు. మీడియా వక్రీకరణలు, ట్యాంక్‌బండ్ సంఘటన, జాయింట్ క్యాపిటల్, తెలంగాణ సాహిత్యం, సామాజిక న్యాయాలపై ప్రారంభసంచికలో ముచ్చటించిన ప్రొఫెసర్ సాబ్ జీవితంలో ‘సిటీకాలేజ్’ సంఘటనకూ ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక మన భాషను, యాసను ఎగతాళి చేసిన సీమాంవూధులను ఎండగడుతూనే… భవిష్యత్ తెలంగాణను గొప్పగా ఊహిస్తున్నారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే…
1952లో విశాలాంవూధకు వ్యతిరేకంగా పోరాటం మొదలయ్యింది. నేనప్పుడు వరంగల్‌లొవరంగల్‌లో ఇంటర్ చదువుతున్నా. 1948-52 ప్రాంతంలో ఉద్యోగాల కోసం వలస వచ్చారు. తెలంగాణలో ఇంగ్లీషు రాదు… కమ్యూనిస్టు భావాలు చాలా ఉంటాయని కేంద్రం ఆంధ్ర ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇక్కడికొచ్చిన వాళ్లు మనల్ని బాగా ఎక్కిరించేవాళ్లు. అయ్యదేవర కాళేశ్వరరావు అనే ఆయనను పిలిపించి వరంగల్‌లో ఉపన్యాసం పెట్టించారు. ఆయన మనల్ని బాగా వెక్కిరిస్తే.. మేం ప్రతిఘటించినం. కలెక్టర్లు, పోలీసులు కూడా వాళ్లే కాబట్టి లాఠీచార్జీ జరిపించారు. అప్పుడు నేను కూడా లాఠీదెబ్బలు తిన్నా. అప్పటికే తెలంగాణ ఎన్టీవోస్, టీచర్లు ఆంధ్రోళ్ల వల్ల అవమానాలకు గురవుతూ.. హైదరాబాద్‌లోహైదరాబాదు‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి నేను కూడా బయలుదేరినా.. మా బస్సు భువనగిరిలో ఫెయిలయ్యింది. ఈలోపు అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిగి 7గురు విద్యార్థులు చనిపోయారు. ఒకవేళ ఆ సమయానికి నేను కూడా అక్కడికి చేరుంటే.. అమరవీరుల జాబితాలో చేరే వాణ్ణి. ఆ అదృష్టం నాకు దక్కలేదు. బతికి ఏం చేశానయ్యా అంటే.. ఈ ఘోరాలన్నీ చూడాల్సి వచ్చింది.
భాషను.. యాసను ఎగతాళి చేశారు…
 
"https://te.wikipedia.org/wiki/కొత్తపల్లి_జయశంకర్" నుండి వెలికితీశారు