ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==జననం మరియు బాల్యం ==
జానకి [[గుంటూరు జిల్లా]], రేపల్లె తాలూకా, [[పల్లపట్ల]] గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. [[లతామంగేష్కర్‌లతా మంగేష్కర్]], [[పి.సుశీల]], [[జిక్కీజిక్కి]], [[పి.లీల]] పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, [[చెన్నై]]లోని [[ఏవీయం స్టూడియో]]లో పాడటం ఆరంభించిన జానకి [[మద్రాసు]]కు మారింది.
 
==గాయనిగా తొలినాళ్ళు==
"https://te.wikipedia.org/wiki/ఎస్._జానకి" నుండి వెలికితీశారు