గౌతమ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , కి → కి , మాత్రమె → మాత్రమే, భ using AWB
పంక్తి 1:
<br /><center><div style="text-align:left;width:90%;padding:1em;border:solid 2px gold;background:#99ffff;color:green;font-blue:bold">
శ్రీ మహావిష్ణువు యొక్క [[ఏకవింశతి అవతారములు]]లో ఒక అవతారముగా భావించిన [[బుద్ధావతారము]], ఈ వ్యాసం ఒకటి కాదు. బుద్ధుడు , గౌతమ బుద్ధుడు అవతారాలు, రూపాలు వేరు !
</div></center><br />
{{clear}}
పంక్తి 39:
}}
[[దస్త్రం:StandingBuddha.jpg|right|thumb|నిలబడియున్న [[బుద్ధుడు|బుద్ధుని]] శిల్పము, ఒకప్పటి [[గాంధార]], ఉత్తర [[పాకిస్తాన్]], క్రీ.పూ. 1వ శతాబ్దం.]]
'''సిద్ధార్థ గౌతముడు''' ([[సంస్కృతం]]:सिद्धार्थ गौतमः (సిద్ధార్థ గౌతమః) ; [[పాళి]]: సిద్దాత్త గోతమ) నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు మరియు బౌద్ధ ధర్మానికి మూల కారకులు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు: 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు<ref>[[s:ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/ఆరవ ప్రకరణము|ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము లో బుద్ధునికాలమను విభాగము]]</ref>. మిగతా లెఖ్ఖలను ఇంకా అత్యధికుల ఆమోదించలేదు.
 
గౌతముడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. ఆయన జీవిత సంఘటనలు, బోధలు మరియు భిక్షువుల నడవడికలు మొదలగునవి అన్ని ఆయన మరణం తరువాత సంఘముచే తరతరాలుగా పారాయణం చేయబడ్డాయి. మొదట, నోటి మాటగా బోధింపబడినా, దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత త్రిపీటక అనే పేరుతో మూడు పీఠికలుగా విభజింపబడి భద్రపరిచారు.
పంక్తి 45:
== బుద్ధుని జీవితము ==
బుద్ధుని జీవితములో, కేవలం కొన్ని వివరములు మాత్రమే నిర్ధారించగలము, మిగతా వాటి చారిత్రకతకు ఆధారాలు కష్టమే. బౌద్ధ సాహిత్యం నుండి మనకు లభించు వివరములే ఎక్కువ. క్లుప్తంగా క్రింద వివరించబడినవి.
[[దస్త్రం:SiddhartaBirth.jpg|thumb|200px|left| (2-3వ శతాబ్దం) సిద్ధార్థుని జననం.]]
 
బుద్ధుడు మరియు అతని శిష్యులు, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు బుద్ధుని బోధనలను చర్చించి ఆచరించేవారు. ఈ బోధనలను భద్రపరచి ప్రచారం చెయ్యడానికి బుద్ధుని నిర్యాణం తర్వాత ఒక సంఘం ఏర్పడింది. ఒక శతాబ్దం తర్వాత ఇంకో సంఘం ఏర్పడింది. ఈ రెండు సంఘాలు బుద్ధుని బోధనలను ప్రచారం చేయసాగాయి. ఈ సంఘాలు బుద్ధుని బోధనలను, వేర్వేరు భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో బౌద్ధ భిక్షువుకు అప్పగించాయి. అప్పటి నుంచి బుద్దునిబుద్ధుని బోధనలు ముఖస్థంగా ప్రచారం కాసాగాయి. చరిత్ర ప్రకారం బుద్ధుని బోధనలను, రెండవ సంఘం ఏర్పడినప్పుడు గానీ, లేదా తర్వాత కొద్ది కాలానికి గానీ ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నాయి. కానీ, ఈ బోధనలు బుద్ధుని నిర్యాణానంతరం, మూడు, నాలుగు శతాబ్దాల వరకు ఎక్కడా గ్రంధస్థంగ్రంథస్థం చెయ్యబడలేదు. ఈ సమయంలో బౌద్ధ బిక్షువులు, గౌతమ బుద్ధుని జీవితాన్ని మరింత గొప్పగా మలచడానికి, అతని చరిత్రను, బోధనలను, మార్చడం గానీ, లేదా కొత్త విషయాలను జోడించడం గానీ చేసిఉండవచ్చునని కొందరి అభిప్రాయం.
 
ప్రాచీన భారతీయులు కాలక్రమము కన్నా తత్వశాస్త్రమునకే ప్రాముఖ్యతనిచ్చేవారు. అందువల్ల బౌద్ధ మత గ్రంథాలలో కూడా, శాక్యముని జీవిత చరిత్ర కన్నా ఆయన బోధనలకే ప్రాముఖ్యం ఉంటుంది. ఈ గ్రంథాలలో ప్రాచీన భారతీయ నాగరికత మరియు జీవన విధానం వివరించబడింది.
పంక్తి 69:
[[దస్త్రం:Great Departure.JPG|thumb|left|ఈ చిత్రంలో సిద్ధార్దుడు తన అంతఃపురాన్ని మరియు రాజ భోగాలను వద్దలి పరివ్రాజక జీవితం గడపడానికి బయలుదేరాడు. అతనితో పాటు రాజభటులు, మీతుణా ప్రేమజంటలు, దేవతలు కూడా కనబడతారు]]
 
సిద్దార్డునకు ఐహిక ప్రపంచపు కష్ట్టసుఖాలు తెలియకూడదని శుద్దోధనుడు ఎంత ప్రయత్నించినా, తన 29వ ఏట, ఒక రోజు సిద్ధర్డుడు, ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగ పిడితుడ్ని, ఒక కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. అప్పుడు తన రధ సారధిరథసారథి ఛన్న (చెన్నుడు) ద్వారా, ప్రతి మానవుడూ ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెంది, ముసలితనాన్నీ, రోగాన్నీ, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడప నిశ్చయించాడు.
 
అప్పుడు సిద్ధార్దుడు పరివ్రాజక జీవితం గడపడానికి, తన రధ సారధిరథసారథి ఛన్న సహాయంతో, ఒకనాడు రాజభవనం నుంచి కంతక అనే గుర్రంపై తప్పించుకున్నాడు. ఈ విధంగా ఒక బోధిసత్వుని నిష్క్రమణ అతని భటులకు తెలియకుండా ఉండడానికి, అతని గుర్రపు డెక్కల చప్పుడు దేవతలచే అపబడిందని చెప్తారు. దీనినే ఒక గొప్ప నిష్క్రమణ (మహాభినిష్క్రమణ) (ది గ్రేట్ డిపార్చర్) అని అంటారు.
 
సిద్ధార్దుడు తన సన్యాసి జీవితాన్ని రాజగృహ (మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణం) లో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. కానీ బింబిసార మహారాజ సేవకులు, సిద్దార్డుని గుర్తించడంతో, బింబిసారుడు, సిద్ధార్దుని అన్వేషణకు కారణం తెలుసుకుని, అతనికి తన సింహాసనాన్ని (మహారాజ పదవిని) బహుకరించాడు. కాని సిద్ధర్డుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ, తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదటగా మగధ సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాటిచ్చాడు.
 
తర్వాత సిద్ధార్దుడు, రాజగృహను విడిచిపెట్టి, ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేశాడు. అలరకలమ అనే సన్యాసి, తన బోధనలలో సిద్ధార్దుని ప్రావీణ్యున్ని చేసి, తన వారసుడిగా ఉండమని కోరాడు. కాని అ బోధనలవల్ల సిద్ధార్దుని జ్ఞానతృష్ణ తీరకపోవడంతో అ కోరికను నిరాకరించాడు. తర్వాత సిద్ధార్దుడు ఉదకరామపుత్త అనే యోగి శిష్యరికంలో యోగశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కాని ఇది కూడా సిద్ధార్దుని జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా నిరాకరించాడు.
పంక్తి 80:
 
=== జ్ఞానోదయం ===
తర్వాత సిద్ధార్దుడు ధ్యానం, అనాపనసతి (ఉశ్చ్వాస, నిశ్వాసలు) ద్వారా మధ్యయ మార్గాన్ని కనిపెట్టాడు (ఐహిక సుఖాలను, కోరికలను త్యజించడం). ఈ సమయంలో సుజాత అనే పల్లె పడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకునేవాడు. తర్వాత సిద్ధార్దుడు, బుద్ధ [[గయ]]లో ఒక బోధి వృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకొనుటకు భగవత్ ధ్యానం చేశాడు. కాని కౌండిన్యుడు మరియు అతని ఇతర శిష్యులు, సిద్ధార్దుడు జ్ఞాన సముపార్జన సాధనను విరమించినట్లుగా, క్రమశిక్షణా రహితుడుగా భావించారు. చివరకు, తన 35వ ఏట, 49 రోజుల ధ్యానం తర్వాత, సిద్ధార్దునకు జ్ఞానోదయమయ్యింది. కొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్దునకు బాధ్రపద మాసంలో జ్ఞానోదయమయ్యిందని, ఇంకొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్దునకు ఫాల్గుణ మాసంలో జ్ఞానోదయమయ్యిందని చెప్తారు. అప్పటి నుండి గౌతమ సిద్ధార్దుడు, గౌతమ బుద్ధునిగా మారాడు. బౌద్ధ మతంలో ఇతనిని శాక్యముని బుద్దుడనిబుద్ధుడని భావిస్తారు.
 
జ్ఞానోదయమయ్యాక గౌతమ బుద్ధుడు, మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణమందురు. అప్పుడు గౌతమ బుద్ధుడు, ప్రతి బుద్ధునకు ఉండవలసిన 9 లక్షణాలను ప్రతిపాదించాడు.
పంక్తి 87:
 
=== సంఘాన్ని రూపొందించడం ===
[[దస్త్రం:Viṣṇu as Buddha making gesture of dharmacakrapravartana flanked by two disciples.jpg|thumb|ఎడమ|బుధ్ధుని భోధనలనుబోధనలను వినుచున్న శిష్యులు.]]
జ్ఞానోదయమయ్యాక, గౌతమ బుద్ధుడు, తపుస్సా, భల్లక అనే ఇద్దరు వర్తకులను తన ప్రధమప్రథమ శిష్యులుగా చేసుకున్నాడు. వారికి గౌతమ బుద్ధుడు తన తల నుండి కొన్ని వెంట్రుకలను ఇచ్చాడనీ, వాటిని ఇప్పటికీ రంగూన్ లో ఉన్న ష్యూ డాగన్ ఆలయంలో భద్రపరిచారనీ ప్రజలు నమ్ముతున్నారు. తర్వాత బుద్ధుడు తన పూర్వాచార్యులైన అలరకలమ మరియు ఉద్దకరామపుత్తలకు తను తెలుసుకున్న పరమ సత్యం గురించి చెప్పాలని భావించాడు. కాని వారు అప్పటికే మరణించారు.
 
అప్పుడు బుద్ధుడు ఉత్తర భారతదేశంలో ఉన్న వారణాశిలో ఒక లేళ్ళ ఉద్యానవనంలో, కౌండిన్యిని దగ్గర తనతో పాటూ శిష్యరికం చేసిన మిగతా ఐదుగురు సన్యాసులకు, తను తెలుసుకున్న పరమ సత్యంపై మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. వీరంతా బుద్ధునితో కలిసి మొదటి బౌద్ధ భిక్షువుల సంఘాన్ని ఏర్పరిచారు. ఈ విధంగా బుద్ధం, ధర్మం, సంఘం అనే మూడు సూత్రాలతో కూడిన మొదటి బౌద్ధ మత సంఘం ఏర్పడింది. తర్వాత యాసుడు మరియు అతని 54 మంది మిత్రుల చేరికతో బౌద్ధ మత సంఘంలోని వ్యక్తుల సంఖ్య 60 ని దాటింది. తర్వాత ముగ్గురు కశ్యప సోదరులు మరియు వారి 200, 300, 500 మంది శిష్యుల చేరికతో బౌద్ధ మత సంఘ పరిమాణం 1000 ని దాటింది. వీరంతా బుద్ధుని బోధనలను, సామాన్య ప్రజలకు బోధించడానికి ప్రపంచమంతా పర్యటించారు.
పంక్తి 95:
[[దస్త్రం:Dasavatara9.png|thumb|దేశ పర్యటన చేస్తున్న బుద్ధుడు]]
[[File:Buddha Statue at amaravati. AP.JPG|thumb|left|[[అమారవతి]]లో గౌతమ బుద్ధుని విగ్రహము]]
మిగిలిన 45 సంవత్సరాల జీవితంలో గౌతమ బుద్ధుడు గంగా నదీ పరివాహకపరీవాహక ప్రాంతాలైన [[ఉత్తర ప్రదేశ్]], [[బీహార్]] మరియు దక్షిణనేపాల్ ప్రాంతాలలో పర్యటించి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. ఈ ప్రజలలో గొప్పతత్వ వేత్తలను మొదలుకొని, వీధులను శుభ్రం చేసే అంటరానివారు, అంగుళీమాల లాంటి హంతకులు, అళవక వంటి నర మాంసభక్షకులు ఉండేవారు. బౌద్ధ మతంలో అన్ని జాతులు తెగలకు చెందిన ప్రజలు మారడానికి వీలుండడం మరియు కుల, వర్గ విభజనలేకపోవడంతో బౌద్ధ మత సంఘంలోకి వేల కొద్దీ ప్రజలు రావడం మొదలు పెట్టారు. దీని వల్ల గౌతమ బుద్ధుడు ఇతర మతస్తుల నుండి బెదిరింపులు, హత్యా యత్నాలు ఎదుర్కొన్నాడు.
 
బౌద్ధ మత సంఘం భిక్షువులతోనూ, సన్యాసులతోనూ, భారతదేశంలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ధర్మ ప్రచారం గావిస్తూ, ఒక్క వర్షా కాలం తప్ప, మిగతా సంవత్సరమంతా ప్రయాణించేది. వర్షాకాలంలో వచ్చే వరదలవల్ల అన్ని మతాలకు చెందినసన్యాసులు ఆ కాలంలో తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేశేవారు. ఈ సమయంలో బౌద్ధ మత సంఘం ఒక ఆశ్రమాన్నిఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేది. చుట్టుపక్కల ప్రాంతాలనుండి ప్రజలంతా ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చేవారు. దీనినేవస్సాన అని అంటారు.
పంక్తి 109:
బుద్ధుడు ఐదవ వస్సనలో వైశాలికి దగ్గరలో ఉన్న మహావాసనలో బస చేశాడు. అప్పుడు బుద్ధుని తండ్రి శుద్దోధనుడు మరణశయ్యపైఉండడంతో, బుద్ధుడు అతని దగ్గరికి వెళ్లి ధర్మాన్ని బోధించడంతో, శుద్దోధనుడు మరణానికి ముందు బౌద్ధ సన్యాసిగా మారాడు. శుద్దోధనుని మరణం మరియి అంత్యక్రియలు సన్యాసినిల సంఘం ఏర్పడడానికి కారణమయ్యింది. బౌద్ధ గ్రంథాల ప్రకారం, బుద్ధుడుమొదట స్త్రీలను సన్యాసినిలుగా తీసుకోవడానికి నిరాకరించాడు. బుద్ధుని పిన తల్లి అయిన మహా ప్రజాపతి, బుద్ధుని బౌద్ధ సన్యాసదీక్షను ప్రసాదించమని అడుగగా బుద్ధుడు నిరాకరించి, కపిలవస్తుని విడిచి పెట్టి, రాజగృహకు ప్రయాణమయ్యాడు. కాని మహాప్రజాపతి నిరాశ చెందక, కొందరు శాక్య మరియు కొళియ వంశాలకు చెందిన స్త్రీలతో ఒక చిన్న గుంపుగా బయలుదేరి, బౌద్ధబిక్షువులను అనుసరిస్తూ రాజగృహకు చేరుకుంది. తర్వాత కొంత కాలానికి, అంటే బౌద్ధ సంఘం ఏర్పడిన ఐదు సంవత్సరాల తర్వాత ఆనందుని మధ్యవర్తిత్వంతో, స్త్రీలకు కూడా జ్ఞాన సముపార్జనకు సమాన శక్తి ఉందని బుద్ధుడు గ్రహించి, వారికి కూడా బౌద్ధ సంఘంలోస్థానం కల్పించాడు. కానీ బుద్ధుడు, బౌద్ధ సంఘానికున్న నియమాలతో పాటు, వినయమనే కొత్త నియమాన్ని, స్త్రీలకు ప్రత్యేకంగా జతపర్చాడు. తర్వాత సిద్ధార్దుని భార్య యశోధర కూడా బౌద్ధ సన్యాసినిగా మారింది.
 
తర్వాత కొంతకాలానికి, దేవదత్తుడు, బుద్ధుని కించపరచడం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో, [[దేవదత్తుడు]], తను బౌద్ధసంఘానికి నాయకత్వం వహిస్తానని బుద్ధుని కోరాడు. కానీ బుద్ధుడు నిరాకరించాడు. అప్పుడు దేవదత్తుడు మరియు బింబిసారుని కుమారుడైన అజాతశత్రు కలసి, బుద్ధుని, బింబిసారుని హత్య చేసి, తద్వారా వారి పదవులు తీసుకోవాలని పధకం వేశారు. దేవదత్తుడు మూడు సార్లు బుద్ధుని హత్య చేయాలని ప్రయత్నించాడు. మొదటి సారి కొందరు విలువిద్యా నిపుణులను బుద్ధుని హత్యచేయడానికి నియమించాడు. వారంతా బుద్ధుని కలిసి అతని శిష్యులుగా మారిపోయారు. రెండవ సారి దేవదత్తుడు కొండపైనుండి ఒకపెద్ద బండరాయిని బుద్ధుని పైకి దొర్లించాడు. అది వేరొక బండ రాయిని ఢీకొట్టి చిన్న చిన్న ముక్కలుగా పగిలి బుద్ధుని పాదాలనుమాత్రం తాకింది. మూడవ సారి ఒక ఏనుగుకు సారాయిని పట్టించి బుద్ధుని మీదకు వదిలాడు. కాని ఆ ప్రయత్నం కూడావిఫలమయ్యింది. ఈ ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో, దేవదత్తుడు, బౌద్ద సంఘంలో స్త్రీలకు మాత్రమెమాత్రమే కేటాయించిన వినయమనే నియమంపై కొత్తగా ఆంక్షలను విధించి, బౌద్ధ సంఘంలో కలతలు రేపాలని చూశాడు. కాని బుద్ధుడు ఆ ఆంక్షలను నిరాకరించడంతో దేవదత్తుడు సంఘ నియమాలను ఉల్లంఘించి, బుద్ధుని నియమ నిష్ఠలను విమర్శించడం మొదలు పెట్టాడు. ఈ రకంగా దేవదత్తుడు, మొదట కొందరు బౌద్ధ భిక్షువులను బౌద్ధ సంఘం నుంచి విడదీసినా, సారిపుత్త, మహా మొగ్గల్లనలు వారికి బౌద్ధ ధర్మాన్ని విశదీకరించిచెప్పి, తిరిగి వారిని బౌద్ధ సంఘంలోకి చేర్చారు. తర్వాత బుద్ధుడు తన 55వ ఏట ఆనందుని, బౌద్ధ సంఘానికి ముఖ్య కార్యదర్శిగాచేశాడు.
 
=== బుద్ధుని నిర్యాణం ===
మహా పరనిభాన సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, తన 80వ ఏట తాను కొద్ది రోజులలో మహా నిర్యాణమొందుతానని ప్రకటించాడు. తర్వాత, బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని (ఒక విషపు పుట్టగొడుగుల నుండి చేసిన వంటకం. పంది మాంసమని కొందరు భ్రమపడుతుంటారు.) భుజించాడు. అదితిన్న తర్వాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు బుద్ధుడు తన ముఖ్య అనుచరుడయిన ఆనందుని పిలిచి, తన అస్వస్థతకు కారణం, కుంద ఇచ్చిన ఆహరం కాదని, తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుంద చాలా గొప్పవాడని చెప్పి, కుందని ఒప్పించమని పంపాడు.
 
కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, సంసార సాగరంలో కొట్టు మిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణంగురించి తెలియజేయడానికి, కావాలనే నిర్యాణమొందాడని ఒక వాదన ఉన్నదిఉంది.
 
తర్వాత బుద్ధుడు తన శిష్యులైన బౌద్ధ భిక్షువులనందరిని పిలిచి వారికి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోమని అడిగాడు. కానీఎవ్వరు, ఏ సందేహాలను వెలిబుచ్చలేదు. అప్పుడు బుద్ధుడు మహా నిర్యాణమొందాడు. బుద్ధుని ఆఖరి మాటలు, “All composite things Pass away. Strive for your own liberation with diligence ”. బుద్ధుని శరీరానికి అంత్యక్రియలు జరిపిన తర్వాత, అతని అస్థికలు వివిధ బౌద్ధ స్థూపాలలో భద్రపరిచారు. వీటిలో కొన్ని ఇప్పటికిభద్రంగా ఉన్నాయంటారు (శ్రీలంకలో ఉన్న దలద మారిగావలో బుద్ధుని కుడివైపునుండే పన్ను ఇప్పటికి భద్రపరచబడి ఉంది. దీనినేటెంపుల్ ఆఫ్ టూత్ అంటారు).
[[శ్రీలంక]]లో [[పాళీ భాష]]లో ఉన్న దీపవంశ మరియు మహావంశ శాసనాలను బట్టి, అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణమొందిన218 సంవత్సరాల తర్వాత జరిగింది. కానీ చైనాలో ఉన్న ఒక మహాయాన శాసనాన్ని బట్టి, అశోకుని పట్టాభిషేకం బుద్ధుడునిర్యాణమొందిన 116 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ రెండు ఆధారాలను బట్టి, బుద్ధుడు క్రీ.పూ. 486లో (ధేరవాద శాసనం) గానీ లేదా క్రీ.పూ. 383లో (మహాయాన శాసనం) నిర్యాణమొందాడు. కానీ ధేరవాద దేశాలలో బుద్ధుడు క్రీ.పూ. 544 లేదా 543లోనిర్యాణమొందాడని భావిస్తారు. దీనికి కారణం అశోకుని కాలం ప్రస్తుత అంచనాల కన్నా 60 సంవత్సరాల ముందని వీరుభావించడమే.
 
పంక్తి 123:
=== బోధనలు ===
{{main|బౌద్ధ మతము}}
ఆయన యధాతథంగా బోధించినవి దొరుకుట కొంత కష్టమే అయినా, వాటి మూలాలను తెలుసుకోవడం అసంభవమైన పని కాదు. వివిధ బౌద్ధ భిక్షువులు, శాఖల మధ్య కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నా, మూల సిద్ధాంతాలు, భిక్షువుల నియమావళి పట్ల అంగీకారం ఉన్నదిఉంది. మచ్చుకు కొన్ని బోధనలు:
 
* నాలుగు ఆర్య సూత్రాలు.
* [[అష్టాంగమార్గం]].
* అనిచ్చ (సంస్కృతం: అనిత్య) : అన్ని వస్తువులు అనిత్యం
* అనత్త (సంస్కృతం: అనాత్మ) : నేను అని నిరంతరం కలిగే భావన ఒక "భ్రమ"
* దుక్క (సంస్కృతం: దు:ఖం) : అజ్ఞానము కారణముగా అన్ని జీవులు దు:ఖానికి గురి అవుతున్నాయి.
ప్రపంచంలో ప్రతి మనిషి కిమనిషికి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వీడి వెళ్ళవలసినదే కావున కొన్ని నిష్ఫలమైన మరియు మహత్తరమైన కార్యములనుకార్యముల గురించి వాటితో కల్గే మోహామోహాలను వివరించాడు.
గురించి వాటితో కల్గే మోహామోహాలను వివరించాడు.
 
=== భాష ===
Line 167 ⟶ 166:
File:Roundel 18 buddha ivory tusk.JPG|'''సహాయకుడు చండకునితో పాటుగా రాజప్రాసాదాన్ని వదిలివెళ్తున్న సిద్దార్థుడు'''
File:Siddhartha cutting his hair Roundel 19 buddha ivory tusk.jpg|'''రాజదుస్తులను, నగలను వదిలి, జుత్తు కత్తిరించుకుంటున్న సిద్ధార్థుడు'''
File:Roundel 20 buddha ivory tusk.JPG|'''సిద్ధార్థుడు ఒక స్త్రీ నుంచి భిక్ష స్వీకరించడం'''
File:Siddhartha in meditation Roundel 21 buddha ivory tusk.jpg|'''ధ్యానిస్తున్న సిద్ధార్థుడు'''
File:Roundel 22 buddha ivory tusk.JPG|'''ధ్యానం చేస్తున్న సిద్ధార్థుడిని ఐదుగురు సన్యాసులు కలవడం'''
File:Buddha seated under a tree in abhaya mudra Roundel 3 ivory tusk.jpg|'''''అభయముద్ర''తో చెట్టుకింద కూర్చున్న బుద్ధుడు'''
File:Sujata offers Kheer to Siddhartha Roundel 23 buddha ivory tusk.jpg|'''బుద్ధునికి పాయసం నివేదిస్తున్న సుజాత'''
File:Roundel 24 buddha ivory tusk.JPG|'''మారుడు (రాక్షసుడు) బుద్ధుని దృష్టి మరల్చాలన్న ప్రయత్నం చేయడం'''
File:Roundel 25 buddha ivory tusk.JPG|'''ధ్యానముద్రలో బుద్ధుడు'''
</gallery>
"https://te.wikipedia.org/wiki/గౌతమ_బుద్ధుడు" నుండి వెలికితీశారు