తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , ను → ను (3), గా → గా (4), తో → తో (6), హైద్రాబాదు → using AWB
పంక్తి 26:
{|cellpadding="5" align="left" style="background-color:transparent; border-style:none"

|{{వ్యాఖ్య|తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లనృపులు గొలువ ఎరుగవేబాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స|25px|25px|[[శ్రీ కృష్ణదేవ రాయలు]]}}

|{{వ్యాఖ్య|జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?|25px|25px| [[వినుకొండ వల్లభరాయడు]]}}

|{{వ్యాఖ్య|సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు?|25px|25px| [[మిరియాల రామకృష్ణ]]}}

తెలుగు ఇతర భాషా పదాలను సులభంగా అంగీకరిస్తుంది. [[సంస్కృతము]] ప్రభావము తెలుగు సాహిత్యముపై చాలా ఎక్కువ. [[సంస్కృతము]] చూపించినంత ప్రభావము ఇంక ఏ భాష కూడా తెలుగు భాషపై చూపలేదు. నిజానికి తెలుగు లిపిలో చాలా అక్షరములు, ముఖ్యముగా మహాప్రాణ (aspirated) హల్లులు కేవలం సంస్కృతము కోసమే లిపిలోనికి తీసుకొనబడినాయి. "మంచి సంస్కృత ఉచ్చారణ [[కోస్తా]] ప్రాంతములోని పండితుల దగ్గర వినవచ్చు" అని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతేకాకుండా ఇక్కడి పండితులను పొరుగు రాష్ట్రాల వారు వైదిక కర్మలను జరపడానికి ప్రత్యేకంగా పిలుచుకొని వెళ్ళేవారు అని ప్రతీతి. తెలుగుకి, సంస్కృతమునకు చాలా దగ్గర సంబంధం ఉండడం వలన వారి ఉఛ్ఛారణ స్వఛ్ఛంగా ఉంటుందనటంలో అతిశయోక్తి ఏమీలేదు. ఇప్పటికీ తెలుగు భాషలో సంస్కృత పదములను మనం గమనించవఛ్ఛు. సంస్కృత భాషా ప్రభావం భారత దేశ భాషలన్నింటి మీద ఉంది. కానీ తెలుగు భాషని గమనిస్తే, తెలుగుకి సంస్కృతం మాతృమూర్తి అనిపిస్తుంది. ఎందుకనగా ఉచ్చారణ, భావం సంస్కృతాన్ని తలపిస్తాయి.

[[సంస్కృతము]] తెలుగు సాహితీ ప్రపంచంలో ఓ శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నట్లే, [[పర్షియను]], [[ఉర్దూ భాష|ఉర్దూ]] పదాలు కూడా తెలుగు కార్యనిర్వాహక పదబంధములలో ఓ స్థానం ఏర్పరుచుకున్నవి. [[బ్రిటీషు]] వారి పరిపాలనవల్ల, మరియు [[సాంకేతిక విప్లవం]] వల్ల ఈ రోజుల్లో ఏ ఇద్దరు తెలుగువాళ్ళు కూడా ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఆంగ్ల పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుకోలేరు అని చెప్పడం సత్యదూరం కాదు. [[భారత దేశము|భారతదేశం]]లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రముఖ జన్యు (జెనెటిక్) శాస్త్రవేత్త అయిన [[జె.బి.ఎస్.హాల్డేన్]] గారు ఓ సందర్భములో తెలుగు భారత దేశానికి [[జాతీయ భాష]] కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పడములో ఆశ్చర్యము లేదు.

తెలుగువారికి [[ఆంగ్లము]] అంటే ఇంత ప్రేమ ఉన్నప్పటికీ భాషాశాస్త్రపరంగా, సంస్కృతీపరంగా, వ్యాకరణ పరంగానూ ఈ రెండు భాషలూ చాలా దూరంలో ఉంటాయి. తెలుగులో వాక్యం లో కర్త-కర్మ-క్రియ అవే వరుసలో వస్తాయి, కానీ [[ఇంగ్లీషు]] లో మాత్రము కర్త-క్రియ-కర్మగా వస్తాయి. [[ఆంగ్లము]] మాట్లాడువారికి తెలుగులో పదాల వరుస వ్యతిరేకదిశలో ఉంటాయి.

భావ వ్యక్తీకరణలో తెలుగు ప్రపంచ భాషలన్నింటితోనూ పోటీ పడుతుంది. ప్రపంచంలోని అతి కొద్ది క్రమబద్ధీకరించబడిన భాషలలో ఇది ఒకటి. తెలుగు వ్యాకరణము చాలా తేలికగానూ, నిర్మాణపరంగా అతిశుద్ధంగానూ ఉంటుంది. అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా [[కర్ణాటక సంగీతం]] లోని చాలా [[కృతులు]] తెలుగు భాషలోనే ఉన్నాయి. [[త్యాగరాజు]], [[రామదాసు|భద్రాచల రామదాసు]], [[క్షేత్రయ్య]], [[అన్నమయ్య]], వంటివారు తమ తమ కృతులతో, [[కీర్తన]] లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసారు. పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని పిలుచుకున్నారు.

తెలుగు (మరియూ ఇతర భారతదేశ భాషలలోని) భాషలో ఒక ప్రముఖమైన విషయము ఏమిటంటే [[సంధి]]. రెండు పదాలు పక్కపక్కన చేర్చి పలికినప్పుడు మనకు క్రొత్త మూడవ పదము వస్తుంది.

== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు