"తరిగొండ వెంగమాంబ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , భోధించా → బోధించా, గ్రంధా → గ్రంథా, ఉ using AWB
చి (→‎జీవితం: AWB తో RETF మార్పులు, typos fixed: చేసినాడు → చేసాడు, చినాడు → చాడు (2) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , భోధించా → బోధించా, గ్రంధా → గ్రంథా, ఉ using AWB)
వెంకమాంబ [[చిత్తూరు]] జిల్లా, [[గుర్రంకొండ]] మండలములోని [[తరిగొండ]] గ్రామములో వాసిష్ఠ గోత్రీకుడైన కావాల కృష్ణయ్య, మంగమాంబ అను నందవారిక [[బ్రాహ్మణ]] దంపతులకు 1730లో జన్మించినది<ref name="సింహావలోకనము" />.
 
వెంకమాంబ బాల్యములో తన తోటి పిళ్లవాళ్లలాగా ఆటలాడుకోక ఏకాంతముగా కూర్చొని [[భక్తి]] పారవశ్యముతో మునిగితేలేది. ఆ చిరు ప్రాయములోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురముగా గానము చేసేది. తండ్రి ఆమె భక్తిశ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యమును సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే [[గురువు]] వద్దకు శిక్షణకు పంపినాడు. దీక్షితులు ఆమె ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వెంకమాంబకు భోధించాడుబోధించాడు. అనతి కాలములోనే వెంకమాంబ ప్రశస్తి నలుమూలల పాకడముతో తండ్రి ఆమె విద్యాభ్యాసమును మాన్పించి తగిన వరునికోసము వెతకడము ప్రారంభించాడు.
 
తల్లి వెంకమాంబను ఇంటి పనులలో సహాయము చేయమని కోరగా తన సేవ భగవంతునికే అర్పణమని వెంకమాంబ తిరస్కరించినది. అనేక మంది వరులు ఆమెను చూచి చాలా అందముగా ఉన్నదనో, చాలా తెలివైనదనో నెపములతో [[పెళ్లి]] చేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు ఇంజేటి వెంకటాచలప్ప ఆమె అందమును చూసి ముగ్ధుడై ప్రేమలో పడి వెంకమాంబను వివాహమాడుటకు అంగీకరించాడు. తండ్రి ఆమెకు మంచిభార్యగా మసలుకోమని హితవు చెప్పి వివాహము జరిపించాడు. వివాహానంతరము వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఢ్యాన్ని వదిలించ ప్రయత్నము చేసాడు కానీ వెంకమాంబ అతనిని దగ్గరికి రానివ్వలేదు.
 
ఈమె [[తిరుమల]]లో ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో [[తుంబురు కోన]] వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తున్నది. ఈమెకు [[వేంకటేశ్వరుడు]] కలలో కనుపిస్తూ ఉంటాడని అనేవారు. తిరుమలలో ఉత్తర వీధిలో ఉత్తర దిశలో ఉన్న వనంలో (ప్రస్తుతం ఉన్న ఒక పాఠశాలలో) ఈమె సమాధి ఇప్పటికీ ఉన్నదిఉంది. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో [[ముత్యాల హారతి]] ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం (ఫసలి 1230) క్రీ.శ. 1890లో [[తూర్పు ఇండియా కంపెనీవారు]] తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తున్నది.<ref>[[సప్తగిరి]] ఆధ్యాత్మిక మాస పత్రిక, [[తి.తి.దే.]] ప్రచురణ - జనవరి 2008 - డా. రమేశన్ వ్రాసిన ఆంగ్ల గ్రంథం ధారావాహికకు డా. కోరాడ రామకృష్ణ అనువాదం</ref> ఆమె తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించారు. చివరకు క్రీ.శ.1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ నవమినాడు తరిగొండ వెంకమాంబ వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ సజీవ సమాధి చెందారు<ref name="సింహావలోకనము" />.
 
==రచనలు==
వేంకమాంబ తాను [[భాగవతం]] ద్వాదశస్కంధాలను ద్విపదకావ్యాలుగా రచించినట్టు, వేంకటాచలమాహాత్మ్యంలోని ఒక పదంలో చెప్పుకొంది.
 
ఈ [[ద్విపద]] భాగవతంలో, తత్వార్థాలను పామరులకు కూడా సరళసుబోధకం చేయడానికి, వేంకమాంబ తేటతెలుగు పదాలను ప్రయోగించి సంక్షిప్తసుందరం గావించినట్టు, ఈ ద్విపద పంక్తుల నుపంక్తులను బట్టి తెలుస్తున్నది.
 
వేశ్యాంగన [[ముద్దుపళని]] వ్రాసిన [[రాధికా సాంత్వనము]] అనే శృంగారప్రబంధంలో వలె, మితిమీరిన శృంగారవర్ణనలు చేయక, కులాంగన అయిన వేంకమాంబ శృంగారం పేర అసభ్యవర్ణనలు చేయలేనని వేంకటేశ్వరమాహాత్మ్యంలో శ్రీకృష్ణునికి, అనగా కలియుగప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి ఇలా విన్నవించుకోవడం సమంజసంగానే ఉంది.
 
==విశేషాలు==
పలు ప్రక్రియలలో ఇన్ని గ్రంధాలుగ్రంథాలు వ్రాసిన కవయిత్రులు ఆ కాలంలో లేరు. ఇటీవలే వెంగమాంబకు సంబంధించిన జీవిత విశేషాలను, రచనల వివరాలను తెలుపుతూ ఒక జాతీయ సదస్సును [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ఉద్యోగుల శిక్షణా సంస్థ డైరెక్టర్ భూమన్ ప్రారంభించాడు. ఆమె కీర్తనలకు ప్రాచుర్యం కలిగించే లక్ష్యంతో "జీవనగానం" అవే [[సి.డి.]]ని [[2007]]లో విడుదల చేశారు.
 
తరిగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వెంగమాంబ ప్రతిమ తరతరాలుగా పూజలు అందుకొంటున్నది. [[జనవరి 1]]న, ఇతర పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయ.
 
ఉత్తర మాడా వీధి లోవీధిలో నివసించే తరిగొండ వెంగమాంబ హారతి తీసుకోనిదే బ్రహ్మోత్సవాల సమయంలో ఆమె ఇంటి ముందునుండి కదలని రథానికి గుర్తుగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతి ఇమ్మని భక్తులూ, అర్చకులూ అడిగేవారట. కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది .ఈ సేవనే '''తరిగొండ ముత్యాల హారతి''' అనేవారు. వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది. అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.
 
[[ఆంధ్రప్రభ]] దినపత్రికలో ఆమె జీవిత కథ సీరియల్‌గా వచ్చింది.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1974794" నుండి వెలికితీశారు