కళ్ళం అంజిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రూ. → రు., లో → లో , ప్రాధమిక → ప్రాథమిక, ప్రవేస → ప్రవేశ, using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రూ. → రు. (2), ) → ) using AWB
పంక్తి 24:
 
==కంపెనీ స్థాపన==
పలు కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో [[1984]]లో రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ను స్థాపించారు. రివర్స్‌ ఇంజినీరింగ్‌ పద్ధతుల ద్వారా బహుళజాతి కంపెనీల చేతుల్లో ఉన్న అత్యంత ఖరీదైన ప్రాణాధార ఔషధాలకు జనెరిక్‌ రూపాలను రూపొందించి, తృతీయ ప్రపంచ దేశాలకు ఆపద్బాంధవుడు అయ్యారు. బడా కంపెనీలతో పోటీపడి అనేక మందులకు పేటెంట్లు సాధించారు. రూరు.25 లక్షల పెట్టుబడితో మొదలైన రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రూరు.వేల కోట్ల టర్నోవర్‌తో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించింది. [[న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజి]]లో నమోదైన తొలి ఆసియా ఫార్మా కంపెనీ ఇదే.
పంక్తి 30:
అంజిరెడ్డి తండ్రి పసుపు రైతు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పసుపు పొలాల్లో తిరుగుతూ అంజిరెడ్డి అక్కడే పాఠశాల విద్య పూర్తిచేశారు. చిన్నతనంలో పుస్తకాల పురుగుకాదు. ఆటపాటల్లోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారు. కాకపోతే అమోఘమైన జ్ఞాపకశక్తి ఆయనకు ఉండేది. ఒక్కసారి చూసిన, విన్న విషయాన్ని మరచిపోయేవారు కాదు. అందుకే తన తోటి విద్యార్థులు పరీక్షల్లో తప్పితే, తాను మాత్రం మంచి మార్కులు కొట్టేసేవారు. ఉన్నత విద్యాభ్యాసం 1958లో గుంటూరు ఏసీ కాలేజీలో సాగింది. అక్కడి నుంచి ఫార్మాసూటికల్స్‌ కెమిస్ట్రీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ విద్య కోసం బాంబే విశ్వవిద్యాలయానికి వెళ్లారు. తర్వాత పుణెలోని నేషనల్‌ కెమికల్‌ ల్యాబరేటరీలో పీహెచ్‌డీ చేశారు. ఔషధ శాస్త్రవేత్తగా ఆయన రూపుదిద్దుకుంది అక్కడే. తర్వాత ఐడీపీఎల్‌లో పూర్తిస్థాయి ఔషధ నిపుణుడిగా తయారయ్యారు. ఆయన విజయప్రస్థానానికి పునాది పడింది ఐడీపీఎల్‌లోనే నని పలు సందర్భాల్లో అంజిరెడ్డి స్పష్టం చేయటం గమనార్హం.
 
తన సన్నిహితుల వద్ద, కంపెనీలో జరిగే అంతర్గత సమావేశాల్లో అంజిరెడ్డి నోటివెంట అప్రయత్నంగా వచ్చే మాట ఫైజర్‌. ప్రపంచంలో అగ్రగామి ఔషధ కంపెనీ ఫైజర్‌. అటు అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఔషధ ప్రపంచంలో ఫైజర్‌కు తిరుగు లేదు. పుణెలో నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీస్‌లో 1969లో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసే సమయంలో ఫైజర్‌ ప్లాంట్‌ను చూశారాయన. అప్పుడే నిర్ణయించుకున్నారు ఫైజర్‌ లాంటి సంస్థను నిర్మించాలని. ఆ తర్వాత ఐడీపీఎల్‌ (ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌) లో ఉద్యోగంలో చేరారు కానీ ఆయనలోని పరిశోధకుడు వూరుకోలేదు. త్వరలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి పారిశ్రామికవేత్త అవతారం ఎత్తారు. 1976లో యూనిలాయిడ్స్‌ అనే ఔషధ కంపెనీతో మొదలైన ప్రస్థానం 1984లో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏర్పాటుతో వేగాన్ని పుంజుకుంది. అప్పుడే పేటెంట్‌ గడువు ముగిసిన [[ఐబూప్రూఫెన్‌]] (Ibuprofen) అనే నొప్పి నివారణ మందును సొంతంగా తయారు చేసి చాలా తక్కువ ధరలో ఏకంగా అమెరికాకే సరఫరా చేశారు. దాంతో విశ్వవిపణిలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ సమరభేరి మోగించినట్లుయింది. తర్వాత ఇక అంజిరెడ్డి వెనుదిరిగి చూసుకోలేదు. నార్‌ఫ్లాక్సాసిన్‌, సిప్రోఫ్లాక్సాసిన్‌, వోమిప్రజోల్‌... ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఔషధాలతో ఔషధ మార్కెట్‌ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశారు. ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని అప్రతిహతంగా ముందుకు సాగారు. తాను కంపెనీ స్థాపించే నాటికే దేశీయంగా స్ధిరపడి ఉన్న ర్యాన్‌బ్యాక్సీ, సిప్లా వంటి కంపెనీల ఆధిపత్యాన్ని అతితక్కువ సమయంలోనే సవాలు చేసే స్థాయికి ఎదిగారు. కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. బిలియన్‌ డాలర్ల కంపెనీ గ్రామీణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఒక వ్యక్తి వ్యాపారాన్ని స్థాపించటం, విజయవంతమైన వ్యాపరవేత్తగా ఎదగటం అంత సులువైన విషయం ఏమీ కాదు. అది కూడా ఒక తరంలోనే. ఏదో సాదాసీదా కంపెనీ అంటే సరేకానీ బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయాన్ని (రూ. 5,000 కోట్లకు పైనే) సంపాదించే స్థితికి ఎదగటం కొంతమంది వల్లే అవుతుంది. అటువంటి వారిలో డాక్టర్‌ అంజిరెడ్డి ఒకరు. మన రాష్ట్రం నుంచి బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసే స్థాయికి ఎదిగిన రెండు సంస్థల్లో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒకటి. మరొకటి సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌. 2005-06లో బిలియన్‌డాలర్ల టర్నోవర్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ నమోదు చేసింది. అంతటితో ఆగకుండా ఆ తర్వాత నాలుగేళ్లకే ర్యాన్‌బ్యాక్సీని అధిగమించి దేశంలో వార్షిక టర్నోవర్‌ పరంగా అగ్రగామి కంపెనీగా ఎదిగింది. మన రాష్ట్రం నుంచి న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజిలో నమోదైన తొలి కంపెనీ కూడా ఇదే కావడం విశేషం. ఒక బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయాన్ని నమోదు చేసే స్థాయికి ఎగదటానికి డాక్టర్‌ రెడ్డీస్‌కు దాదాపు పాతికేళ్లు పడితే, ఆతర్వాత రెండు బిలియన్‌ డాలర్ల కంపెనీ కావటానికి మాత్రం ఎక్కువ సమయాన్ని తీసుకోలేదు. 2012 నాటికే రెండు బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయం స్థాయిని అధిగమించి ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతోంది. 5 బిలియన్‌ డాలర్ల వార్షిక టర్నోవర్‌ను నమోదు చేయటానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ఎంతో దూరంలో లేదనే విశ్లేషణలు ఉన్నాయి.
 
===కొత్త ఔషధాల రూపకల్పన===
"https://te.wikipedia.org/wiki/కళ్ళం_అంజిరెడ్డి" నుండి వెలికితీశారు