నూతలపాటి సాంబయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
==నాటకరంగం==
ఇతడు విద్యార్థి దశలోనే 1954లో చెంచునాయుడు, అలెగ్జాండర్ మొదలైన ఏకపాత్రలను ధరించడం ద్వారా నటనను ప్రారంభించాడు. ఆ సమయంలోనే కొన్ని నాటికలకు దర్శకత్వం వహించాడు.1965లో [[పినిశెట్టి శ్రీరామమూర్తి]] వ్రాసిన "పల్లెపడుచు" నాటకాన్ని జనరంజకంగా ప్రదర్శించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. పత్రి జగన్నాథరావు దర్శకత్వంలో "మాస్టర్‌జీ" నాటకాన్ని తయారు చేసి టికెట్టు నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ నాటకాన్ని అనేక నాటక పోటీలలో ప్రదర్శించి అనేక బహుమతులు పొందాడు. [[భీశెట్టి లక్ష్మణరావు]] రచించిన "సమాజం మారాలి", గోళ్ళపాటి నాగేశ్వరరావు వ్రాసిన "సరస్వతీ నమస్తుభ్యమ్‌", [[భమిడిపాటి కామేశ్వరరావు]] వ్రాసిన "మనస్తత్వాలు" అనే నాటకాలు/నాటికలు ఇతనికి మంచిపేరును తెచ్చిపెట్టాయి.
 
ఇతడు సత్తెనపల్లి ప్రమోద ఆర్ట్స్ ఆడీటోరియం నిర్మాణంలో కృషిచేశాడు. దాదాపు పది సంవత్సరాలు దానికి ప్రోగ్రాం ఇన్‌ఛార్జ్ గా, స్టేజి డైరెక్టరుగా బాధ్యతలు వహించి రాష్ట్రంలోని అనేక కళాసంస్థలను, ఔత్సాహిక నటీనటులను, కళాకారులను, సంగీత, సాహిత్యవేత్తలను సత్తెనపల్లికి ఆహ్వానించి నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు. 1990 నుండి ప్రగతి కళామండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ సంస్థ తరఫున ప్రతి సంవత్సరం నాటికల పోటీలను నిర్వహిస్తున్నాడు.
 
==సన్మానాలు, బహుమానాలు==
"https://te.wikipedia.org/wiki/నూతలపాటి_సాంబయ్య" నుండి వెలికితీశారు