కుమారజీవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మంను → మాన్ని , బోదన → బోధన (3), గ్రంధా → గ్రంథా (34), విధ్యా using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంప్రదాయా → సంప్రదాయా, స్వచ్చంద → స్వచ్ఛంద, గోష్టి → using AWB
పంక్తి 33:
కుమారజీవుని 7సంవత్సరాల వయసులో ఇతని తల్లి జీవిక తన భర్త నుండి అనుమతి పొంది బౌద్ధ సన్యాసినిగా మారి కూచాలోని సియోలి (Tsio-li) సన్యాసినుల మఠంలో చేరింది. ఏడు సంవత్సరాల చిరుప్రాయంలోనే కుమారజీవుడు బౌద్ధ సూత్రాలను వల్లెవేస్తూ అసాధారణ ప్రజ్ఞా పాటవాలను కనపరచడంతో, తల్లి జీవిక ఇతనిలోని ప్రతిభను గుర్తించి బౌద్ధ సిద్ధంతాలతోను, చింతనలోను చక్కని ప్రావీణ్యం నేర్పించాలనే నిశ్చయించింది.
===[[కాశ్మీర్]]లో విద్యాభ్యాసం===
కుమారజీవుని విద్యాభ్యాస నిమిత్తం 9 సంవత్సరాల వయసులో అతనిని తోడ్కొని తల్లి జీవిక మధ్య ఆసియా నుండి ప్రయాసభరితమైన ప్రయాణం సాగించి బుద్ధుడు జన్మించిన భారతదేశానికి చేరుకొంది. కుమారజీవుడు ముందుగా తండ్రి స్వస్థలం అయిన కాశ్మీర దేశంలో ప్రసిద్ధ బౌద్ధాచార్యుడు అయిన ‘బందుదత్తు’ని వద్ద సంస్కృతం అభ్యసించాడు. స్థవిరవాదుల సాంప్రదాయానికిసంప్రదాయానికి చెందిన నికాయాలను దీర్ఘ ఆగమ, మధ్యమ ఆగమ, ఖుద్దక ఆగమాలను నేర్వడమే కాకుండా భారతీయ వైద్యం, ఖగోళం, జ్యోతిషం, తర్కం, గ్రంథ వివరణ, వ్యాఖ్యాన రీతులలో ప్రావీణ్యం సంపాదించాడు. కాశ్మీర రాజు సమక్షంలో జరిగిన విద్వత్ గోష్టిలోగోష్ఠిలో పాల్గొన్న కుమారజీవుడు పిన్న వయసులోనే తన వాదనాపటిమతో అనేకమంది బౌద్దేతర గురువులను ఓడించడంతో అతని పేరు ప్రసిద్ధమైంది. 3 సంవత్సరాల తదనంతరం భారత దేశంలో విద్యను పూర్తి చేసుకొని తన తల్లితో కలసి కుమారజీవుడు తిరిగి కూచా రాజ్యానికి పయనమైనాడు.
 
===[[కాష్గర్]]లో విద్యాభ్యాసం===
పంక్తి 40:
==మహాయాన బౌద్దంలోనికి కుమారజీవుడు==
[[Image:Tarimbecken 3. Jahrhundert.png|thumb|300px|క్రీ.శ. 4 వ శతాబ్దంలో తారిమ్ బేసిన్ (చైనా) లో ఏర్పడిన కూచా, కాష్గర్, తుర్పాన్ తదితర మద్య ఆసియా రాజ్యాలు]]
కూచా రాజ్యానికి ఈశాన్య సరిహద్దులలో వున్న [[తుర్పాన్]] రాజ్యంలో 10 వేలకు పైగా బౌద్ధ సన్యాసులు వుండేవారు. కుమారజీవుడు దాదాపుగా ఇక్కడ ఉంటున్న సమయంలోనే కుమారజీవుని ధర్మపధం మహాయానం వైపు నడిచింది. ఒకప్పుడు యార్కండ్ (Yarkand) రాకుమారుడు తరువాత కాలంలో మహాయాన బౌద్ధసన్యాసిగా మారిన [[సుత్యసోమ]]ని ప్రభావం కుమారజీవునిపై గాడంగాగాఢంగా పడింది. అతని ప్రభావం వల్ల కుమారజీవుడు [[శూన్యవాదం]] వైపు ఆకర్షించబడ్డాడు. సుత్యసోముని ఉపదేశంతో కుమారజీవుడు మహాయాన బౌద్ధసూత్రాలని ఆకళింపు చేసుకొన్నాడు.
 
[[హీనయానం]] (స్థవిర వాదం) నుంచి మహాయాన బౌద్ధానికి మారిన తరువాత కుమారజీవుడు తన మనోవైఖిరిని వివరిస్తూ “బంగారాన్ని (మహాయానం) ఎరుగని వ్యక్తి, ఇత్తడిని (స్థవిరవాదం) చూసి అదే గొప్పదని భ్రమపడినట్టుగా, తానింతకాలం వున్నానని, చివరకు మహాయాన ప్రభావంతో తాను విముక్తుడు అయినట్లు” వెల్లడించాడు.
పంక్తి 59:
అప్పటికే టావోన్ (Tao-on) అనే బౌద్ద సన్యాసి కృషితో చాంగన్ నగరంలో ఒక అనువాద కేంద్రం నెలకొల్పబడింది. చక్రవర్తి ఆదరణ పుష్కలంగా ఉండడంతో, ఉత్సాహపరులైన బౌద్ద సన్యాసుల, అనువాదకుల సహకారంతో ఈ అనువాద కేంద్రంలో పని ప్రారంభించిన కుమారజీవుడు సంస్కృత భాషనుండి అనేక ప్రామాణిక బౌద్ద గ్రంథాలను చైనా భాషలోనికి అనువదించాడు. కొత్త అనువాదాలనే కాక పాత అనువాదాలను సమీక్షించి, పునః పరిష్కరించడం కూడా చేసాడు.
 
ఉత్తర చైనా రాజధాని చాంగాన్ లో అనువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు కుమారజీవుని ఖ్యాతి దక్షిణ చైనా రాజ్యానికి కూడా ప్రాకింది. దక్షిణ చైనా బౌద్దసంఘ నాయకుడైన ‘హ్యు యువాన్’ (Hui-Yuan) కుమారజీవునితో బౌద్ద తత్వంపై, ఆశ్రమ విషయాలపై చర్చిస్తూ కుమారజీవుని అనువాద కృషిని ప్రోత్సాహించేవాడు. ఇతని కోరికపై కుమారజీవుడు ధర్మ కాయానికి, ధర్మధాతుజ కాయానికి మద్య గల భేదాన్ని విశిదీకరించినట్లు తెలుస్తుంది. ఒకానొక దశలో కుమారజీవుడు తన స్వస్థలమైన కూచా రాజ్యానికి వెళ్లిపోదలుచుకొన్నాడన్న వార్త విని అతనిని చైనాలోనే వుండిపోవలసిందిగా హ్యు యువాన్ కుమారజీవుని తీవ్రంగా అభ్యర్ధించాడుఅభ్యర్థించాడు. హ్యు యువాన్ తో కుమారజీవుడు జరిపిన 18 ఉత్తర ప్రత్య్త్తత్తరాలు చారిత్రిక ప్రాధాన్యం కలిగివున్నాయి. అనువాదకుడుగా చాంగన్ లో స్థిరపడిన కుమారజీవుడు క్రీ.శ. 413 లో తను మరణించే వరకూ 12 సంవత్సరాల పాటు చైనా లోనే నివసించాడు.
 
==కుమారజీవునికి ముందు కాలంలో చైనీయుల అనువాదాల స్థితి==
కుమారజీవునికి ముందు నుంచి కూడా పాళీ, సంస్కృత భాషలలో వున్న బౌద్ద సూత్రాలు అనేక వందల సంఖ్యలో చైనా భాషలోనికి అనువదించబడి వున్నప్పటికీ, బౌద్ద సిద్దాంతాలు చైనా ప్రజలలో గాడంగాగాఢంగా చొచ్చుకోలేకపోయాయి. దీనికి కారణం చైనా అనువాదాల దుస్థితి. ఈ అనువాదాలు అప్పటికే స్థానికంగా వ్యాప్తిలోనున్న తావోమతం (Taoism) తత్వ భావాన్ని వుపయోగించి చేసినవై ఉన్నాయి. దీని వల్ల చైనా అనువాదకులు బుద్ధుని బోధనలను వాస్తవికంగా అర్ధం చేసుకోలేకపోయారు. బొద్ద తత్వం పట్ల సరైన అవగాహన లేని అనువాదాల వాళ్ళ చైనా భాషలోనికి తర్జుమా చేయబడ్డ బౌద్ద గ్రంథాలు చైనీయులలో బౌద్ధం పట్ల సరైన తాత్విక భూమికను కలిగించలేకపోయాయి. చైనీయులకు అసలైన బౌద్ధతత్వం పట్ల అవగాహన కల్పించడంలో పాత అనువాద క్రియలు విఫలం అయ్యాయి. కుమారజీవుడు చైనా భాషలో అనువాదాలు ప్రారంభించడంతో ఈ పరిస్థితులు మారిపోయాయి.
==కుమారజీవుని అనువాద శైలి==
కుమారజీవునికి ముందు చైనా భాషలోని బౌద్ద అనువాద గ్రంథాలలో ‘కోయ్’ (ko-i అనగా అర్ధంతో సరిపడటం) అనువాద విధానం వుండేది. దీని వలన పరిచయం లేని సంస్కృత సారస్వత పదాలకు బాగా తెలిసిన చైనా పదాలను వాడారు. దీని వలన మూలంలోని భావం విశిదీకరించడంలో రాజీ పడాల్సివచ్చేది. అయితే దీన్ని అధిగమించడానికి సంస్కృతపదాలకు సరిసమాన పదాలు చైనా భాషలో లేనిపోని కారణంగా సరి సమానార్ధక పదాలుగా నూతన పదాలను సృష్టించి అనువాదాలలో వాడడంతో ఆ అనువాదాలు గందరగోళంలా తయారయ్యేవి. కుమారజీవుడు ఈ అనువాదాలను చూసి అనువాదం అనేది మూల గ్రంథంలోని భావానికి భంగం వాటిల్లకుండా తెలియచేసే విధంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చాడు.
పంక్తి 130:
==అనువాదకునిగా కుమారజీవుని విశిష్టతలు==
* [[పాళీ]], [[సంస్కృత భాష]] లలో వున్న మూల బౌద్ద గ్రంథాలు క్రీ.శ. 2 వ శతాబ్దం నుండి 13 వ శతాబ్దం వరకూ గల మద్య కాలంలో సుమారు 6, 000కు పైగా చైనా దేశంలోనికి తరలించబడి వుంటాయని ఒక అంచనా. 200 మందికి పైగా ప్రముఖ అనువాదకులు ఈ వేలాది గ్రంథాలను పాళీ/సంస్కృత భాషలనుండి చైనా భాషలోనికి అనువదించారు. వీరందరిలో క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందిన కుమారజీవుడు, 7వ శతాబ్దానికి చెందిన [[హుయన్ త్సాంగ్]]లు అత్యంత ప్రముఖ అనువాదకులుగా చరిత్రలో పేరుపొందారు. వీరిలో కుమారజీవుడు జన్మతా భారతీయుడు కానప్పటికీ భారతీయ సంతతి (Indian Origion) కి చెందిన వ్యక్తి. ముఖ్యంగా ఒకవైపు బుద్ధుడు జన్మించిన దేశంలో బౌద్దమత ప్రాభవం క్షీణిస్తున్న కాలంలోనే (మలి [[గుప్తుల]] కాలంలో), మరొవైపు విదేశాలలో ముఖ్యంగా చైనాలో బౌద్దమత గ్రంథాల అనువాదం ద్వారా బౌద్ద మత వికాసానికి ఎనలేని కృషి చేసినవాడు కుమారజీవుడు.
* కుమారజీవుడు అనువాద శైలిలోను, ప్రక్రియా విధానంలోను సమూలమైన మార్పులు ప్రవేశపెట్టాడు. భావానికి ప్రాధాన్యం ఇస్తూ మృదుప్రవాహ శైలిలో అనువదించాడు. కుమారజీవుని అనువాదాలు ప్రస్తుత కాల పరిస్థితులలో సైతం అధ్యయనం చేయడానికి అనుకూలంగా వున్నాయంటే అతని అనువాదం ఎంత సరళంగా భావస్ఫురితంగా వుంటుందో అర్ధమవుతుంది. అనువాద ప్రక్రియలో కుమారజీవుడు ప్రవేశపెట్టిన బృహత్తర సామూహిక కృషి కూడా అంతకు ముందు అనువాదాల క్రియలో ఎన్నడూ లేదు. అనువాద ప్రక్రియను నిరంతరం కొనసాగించడం కోసం సంస్థాగత యంత్రాంగాన్ని (Institutional Mechanism) ఏర్పాటుచేయడం ద్వారా క్షేత్ర స్థాయిలో వందలాది స్వచ్చందస్వచ్ఛంద అనువాద సహాయకుల, సహకారాన్ని పొందగలిగాడు. అనువాద విధానాన్ని అనువాదకుల వ్యక్తిగత కృషి (individual effort) స్థాయి నుండి వ్యవస్థీకృత కృషి (organized effort) స్థాయికి తీర్చిదిద్ది తన తరువాతి అనువాదకులకు మార్గదర్శిగా నిలిచాడు.
* కుమారజీవుని చైనా అనువాదాలనుండే ఇంగ్లిష్ భాషతో పాటు ఇతర ప్రపంచ భాషలలోకి బౌద్ద గ్రంథాలు అనువదించబడ్డాయి. స్థవిరవాదుల, మహాయానుల సాహిత్యం మూల సంస్కృతంలో అలభ్యం అయినప్పటికీ ఇతని అనువాదాల నుండే అందలి విషయాలు బయటి ప్రపంచానికి తెలిసాయి. ఉదాహరణకు 'మాద్యమిక కారిక' అనువాద గ్రంథానికి అసలు సంస్కృత ప్రతి అలభ్యం అయినప్పటికీ కుమారజీవుని అనువాదం వల్లే అందలి విషయాలు బయటకి వెల్లడయ్యాయి. కుమారజీవుడు లేనట్లయితే కొన్ని గొప్ప మహాయాన గ్రంథాలు సంరక్షించబడకపోయి వుండవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/కుమారజీవుడు" నుండి వెలికితీశారు