గద్వాల కోట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినాడు → చాడు, ఉద్దేశ్యం → ఉద్దేశం, → (15), ) → ) , ( → ( using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వచ్చం → స్వచ్ఛం, యుద్దం → యుద్ధం using AWB |
||
పంక్తి 3:
[[File:Nala Somanadri.jpg|thumb|సోమనాద్రి]]
== కోటలోని నిర్మాణాలు ==
ఇది వలయాకారంలో ఉన్న మట్టికోట. కోట బయటి వైపు ఎత్తైన పెద్ద పెద్ద బురుజులతో మట్టితో నిర్మించబడింది. లోపలి వైపు కోట మొత్తానికి రాతి గోడ ఒక పొరగా నిర్మించబడింది. బయటి మట్టి గోడలు వర్షాకాలంలో తరుచుగా కూలిపోతున్నప్పటికీ, లోపలి వైపు రాతి గోడ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. కోటలోకి శత్రువులు ప్రవేశించకుండా కోట బయట చుట్టూరా నీటితో నింపడానికి కందకం నిర్మించారు. నేటికీ కందకం పట్టణంలోని మురికి నీటితో నిండి నాటి దృశ్యాన్ని తలపిస్తుంది. పశ్చిమాన కోట ప్రవేశద్వారం ఉంది. కోటలోనికి ప్రవేశించగానే, కుడివైపు శిథిలమైన అధికారుల, భటుల నివాస స్థావరాలు కనిపిస్తాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్తే, కుడివైపే ఎత్తైన ఆలయాల ప్రహరీ గోడ కనిపిస్తుంది. ప్రహరీలోపల ఆలయాల సముదాయం కనిపిస్తుంది. వీటిలో మూడు ఆలయాలు చెప్పుకోదగినవి. వాటిలో ప్రధానమైనది. గద్వాల సంస్థాన ప్రభువుల ఇలవేల్పైన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం. ఇది మిగిలిన ఆలయాలకు మధ్యలో ఉండి, ఎత్తైన వేదిక మీద నిర్మించబడి ఉంది. ఆలయం ముందు గాలి గోపురం పట్టణం మొత్తానికి కనిపించేంత ఎత్తుగా ఉండి, బహు ఆకర్షణీయంగా ఉంటుంది. గాలి గోపురం ద్వారా ఆలయంలోని వచ్చే దారిలో మెట్ల దగ్గర గంటా వేదిక ఉంది. రాతి స్తంభాలకు చాలా పెద్దదైన గంట వేలాడి ఉంటుంది. ఈ ఆలయానికి ఇరువైపుల మరో రెండు ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి శివాలయం. ఈ ఆలయాలలోని శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఈ మూడు అలయాలు ఒకే ఆవరణలో ఉన్నాయి. ఆలయాల ఆవరణలోకి ప్రవేశించడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. తూర్పు వైపు ఉన్న గాలి గోపురం ద్వారా, ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించవచ్చు. దక్షిణం వైపు కూడా మరో ద్వారం ఉండినప్పటికీ అది ప్రవేశ ద్వారం కాదు. ఆ ద్వారం గుండా వెళితే కోటలోపలి పురాతన బావి కనిపిస్తుంది. ఆలయాల ప్రహరీకి ఆనుకొని ఆగ్నేయాన రెండు వరుసలలో ఎదురెదురుగా రాజ భవనాలు ఉండేవి. ఈ భవనాలలో ఒకటైన దక్షిణం వైపు భవనంలో, కోటలో తర్వాత ఏర్పాటుచేసిన డిగ్రీ కళాశాలకు చెందిన భౌతిక, రసాయన శాస్త్ర ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. పాత భవనం శిథిలమయ్యే కొద్ది ప్రయోగశాలల నిమిత్తం తరుచుగా ఆధునీకీకరించబడి, పూర్తిగా రూపు రేఖలు మారిపోయింది. ఈ భవనానికి దక్షిణం వైపు కొన్ని శిథిలాలు మాత్రం మిగిలి గత చరిత్రకు ఆనవాళ్ళుగా కనిపిస్తాయి. ఈ భవనం దక్షిణం వైపు నుండి కోటలోని బావిలోకి దారి ఉంది. ఈ బావి నాడు తాగు నీటికి, ఈతకు ఉపయోగించినట్లు తెలుస్తుంది. నేటికీ ఈ బావిలోని నీరు
[[ఫైలు:Gadwal Chennakeshava Swamy Temple.JPG|400px|right|thumb|<center>కోట లోపల ఆలయ సముదాయం</center>]]
== కోట చారిత్రక నేపథ్యం ==
రాజా పెదసోమభూపాలుడు (నలసోమనాద్రి) పూడూరు రాజధానిగా పరిపాలించేవాడు. పూడూరు కోటను మరమ్మత్తు చేస్తుండగా గుప్తనిధి లభించగా, శత్రు ధుర్భేధ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గద్వాలలో మట్టి కోటను కట్టించాడు. కోట నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు రావడముతో కేశవాచారి అనే బ్రాహ్మణుడిని బలి ఇచ్చారని, ఆ పాప పరిహారానికి గాను గద్వాల కోటలో చెన్నకేశవ దేవాలయాన్ని నిర్మించారని కథ ప్రచారంలో ఉంది. చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించిన తరువాత రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చాడు. పూడూరును చాళుక్యులు పరిపాలించగా, చాళుక్యులకు, పల్లవులకు మధ్య జరిగిన
== కోటలో సినిమా చిత్రీకరణలు ==
గద్వాల కోటలో [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో మెగాస్టార్ [[చిరంజీవి]] నటించిన [[కొండవీటి రాజా]] అను తెలుగు చిత్రం షూటింగ్ జరిగింది. గద్వాల ప్రాంతానికి చెందిన సినీ ఫైనాన్సియర్, నిర్మాత బుర్రి వెంకట్రామిరెడ్డి నిర్మాణంలో ఈ చిత్రం వచ్చింది. దాదాపు నెలరోజులకు పైగా గద్వాల కోటలో సినిమా చిత్రీకరణ జరిగింది. కోట చుట్టూ ఉండిన కందకంలో, కోటలోపలి బావి దగ్గర ఫైటింగ్లు, కోటలోపల ఆలయ సముదాయంలో ''అంగాంగ వీరాంగమే '' పాట చిత్రీకరణ జరిగింది. దాదాపు సినిమా చివరి ఘట్టాలన్నీ కోటలో చిత్రీకరించబడినవే.
|