జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితం → కచ్చితం, శిధిలా → శిథిలా, భోధించా → బోధించా using AWB
చి →‎మహావీరుని బోధలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే using AWB
పంక్తి 71:
ఆత్మ సహజంగా కాంతివంతమైనది. సర్వజ్ఞాని, ఆనందమయి. ఈ [[విశ్వం]]లో అనంత సంఖ్యలో ఆత్మలున్నాయి. ప్రాథమికంగా అన్నీ సమానమే. కాని పరా పరమాణు పదార్థం అతుక్కోవడాన్ని బట్టి అవి వేరు వేరు అనిపిస్తాయి. అవి ఆత్మను కప్పడం వల్ల ఆత్మ కాంతి తగ్గిపోతుంది. ఆత్మలు జంతువులకు మనుషులకే కాక, రాయి రప్పకు, నీటికి కూడా ఉంటాయి.
 
పునర్జన్మ రాహిత్యం కావాలంటే మోహ వికారాదులను, ఇంద్రియానుభవాలను క్రమంగా తొలగించుకోవాలి. అందువలన, సన్యాసం, తపస్సులు అవసరమవుతాయి. చివరకు కర్మ శరీరాన్ని తొలగించుకొన్న సన్యాసి మహావీరునిలా, మరణం అంటే భయపడక, ఆహార త్యాగంతో మరణించాలి. తిరిగి పుట్టని ఆత్మ నిర్వాణాన్ని పొందుతుంది. నిర్వాణం అంటే ఏమిటో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వివిధ మతాలు, వివిధ వ్యక్తులు, దానిని వివిధంగా వర్ణించారు. కాని జైన మతంలో నిర్వాణం అంటే ఉన్నత [[స్వర్గం]] కంటెకంటే పైన నిషియాత్మకమైన సర్వజ్ఞానమయమైన శాశ్వతానుభవం.
 
పరివ్రాజకుడు, గృహస్తు - ఎలా నడుచుకోవాలో జైనం వివరించింది. నిర్వాణం లక్ష్యం కనుక, మనిషి దుష్కర్మలను పరిహరించాలి. అంతే కాక, క్రమంగా నూతన కర్మలు చేయకుండా ఉన్న కర్మలను వినాశం చేసుకోవాలి. ఇలాంటి ప్రవర్తన త్రిరత్నాల ఆధారంగా జరగాలి. అవి సమ్యగ్విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ప్రవర్తనలు, మంచి నడతకు ఐదు ప్రమాణాలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు