పొట్టి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 7:
| caption = [[సచివాలయం]] ఎదురుగా పొట్టి శ్రీరాములు విగ్రహం
| birth_name = పొట్టి శ్రీరాములు
| birth_date ={{birth date|1901|03|16}}<ref name=hindu1> [http://www.hindu.com/thehindu/mag/2003/03/30/stories/2003033000040300.htm హిందూ పత్రికలో వ్యాసం] </ref>
| birth_place ={{flagicon|India}} అణ్ణాపిళ్ళె, జార్జిటౌను, మద్రాసు.
| native_place =[[పడమటిపాలెం]]
| death_date =[[1952]] [[డిసెంబరు 15]] <ref name=hindu1> </ref>
| death_place =[[మద్రాసు]]
| death_cause = ఆమరణ నిరాహారదీక్ష
పంక్తి 60:
[[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్ర సాధన]] కొరకు [[ఆమరణ నిరాహారదీక్ష]] చేసి, ప్రాణాలర్పించి, '''అమరజీవి''' యైన మహాపురుషుడు, '''పొట్టి శ్రీరాములు''', ఆంధ్రులకు ప్రాత: స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. [[మహాత్మా గాంధీ]] బోధించిన [[సత్యము]], [[అహింస]], హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.
==జీవిత విశేషాలు==
పొట్టి శ్రీరాములు [[1901]] [[మార్చి 16]]న [[మద్రాసు]], జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]] లోని [[పడమటిపాలెం]] గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత [[ముంబై|బొంబాయి]]లో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం వెలకు 250 రూపాయలు.
 
1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా [[సబర్మతి ఆశ్రమం]] చేరాడు. [[స్వాతంత్ర్యోద్యమం]]లో పాల్గొన్నాడు.
 
==స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర==
పొట్టి శ్రీరాములు [[1930]]లో [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ [[1941]]-[[1942|42]] సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, [[క్విట్ ఇండియా ఉద్యమం|క్విట్ ఇండియా ఉద్యమాల్లో]] పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ (Committee for History of Andhra Movement) అధ్యయనంలో పొట్టి శ్రీరాములు - మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా వ్రాయబడింది. - "సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధత లు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. అతని గరువు ప్రపంచానికే గురువు, సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి. దరిద్ర నారాయణుల ఉద్ధతికి అంకితమైన మహానుభావుడు..... శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ, కులపతి (గాంధీ) ఆదరాన్నీ చూరగొన్నాడు." <ref name=hindu1> </ref>
[[గుజరాత్]] రాష్ట్రంలోని [[రాజ్‌కోట్|రాజ్‌కోట్‌]]లోను, ఆంధ్రలో [[కృష్ణా జిల్లా]]లోని [[కొమరవోలు]]లోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొమరవోలులో [[యెర్నేని సుబ్రహ్మణ్యం]] నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. [[1943]]-[[1944|44]]ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. [[1946]]లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.
 
గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు. 1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని [[ఆమరణ నిరాహారదీక్ష]] ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాంతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు. అప్పుడు మహాత్మా గాంధీ [[టంగుటూరి ప్రకాశం]]కు ఇలా వ్రాశాడు - "హమ్మయ్య. శ్రీరాములు దీక్ష నువ్వు చెప్పినట్లు విరమించుకోవడం నాకు సంతోషం. దీక్షను మానుకొన్నాక నాకు అతను టెలిగ్రామ్ పంపాడు. అతను ఎంతో దీక్షాపరుడైన ఉద్యమకారుడైనా గాని కాస్త తిక్కమనిషి (eccentric)". - 1952లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేడు. ఉన్నాగాని ఆంధ్రోద్యమంపై అతనికున్న దృఢత్వం అచంచలమైనది. <ref>[http://www.hindu.com/thehindu/mp/2002/11/11/stories/2002111101540200.htm హిందూ పత్రికలో ఈ వ్యాసం] --11/11/2002 - The martyr of Telugu statehood</ref>
 
 
జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసాడు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు.
Line 87 ⟶ 86:
 
* పొట్టి శ్రీరాములు కార్యదీక్షను చూసి గాంధీజీ ఇలా అన్నాడు: "శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధించవచ్చు"
* మద్రాసు మైలాపూరు, రాయపేట హైరోడ్డు లోహైరోడ్డులో శ్రీరాములు అమరజీవియైన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం కాపాడుతున్నది.
 
* మద్రాసు మైలాపూరు, రాయపేట హైరోడ్డు లో శ్రీరాములు అమరజీవియైన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం కాపాడుతున్నది.
 
*ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] స్థాపించింది.
 
* నెల్లూరు జిల్లా పేరును 2008లో [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]గా మార్చారు.
 
Line 99 ⟶ 95:
 
<!-- వర్గాలు -->
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]]
"https://te.wikipedia.org/wiki/పొట్టి_శ్రీరాములు" నుండి వెలికితీశారు