బి.వి.వి.ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ( → ( using AWB
పంక్తి 40:
| portaldisp =
}}
'''బి.వి.వి.ప్రసాద్''' ప్రసిద్ధి పొందుతున్న సమకాలీన కవి.
== వ్యక్తిగత జీవితం ==
బొల్లిన వీరవెంకట ప్రసాద్ 21 నవంబరు 1966న జన్మించారు. ఆయన బాల్యం మాతామహులు, నలుగురు మేనమామలు ఉన్న ఉమ్మడికుటుంబంలో గడిచింది. ఆ తరువాత తల్లిదండ్రుల వద్ద ఏడవతరగతి వరకూ చాగల్లులోనూ, బీకాం రెండవ సంవత్సరం వరకూ తణుకులోనూ, చివరి సంవత్సరం కాకినాడలోనూ గడిచాయి. 1991లో మాలతితో వివాహమైంది. గాయత్రి, భార్గవి వారి సంతానం. చదువు ముగించాకా చాలాకాలం పాటు తండ్రికి వ్యాపారంలో సహాయంగా ఉండి, 2003లో పాఠశాల ప్రారంభించారు. మూడేళ్ళపాటు నడచిన పాఠశాల నష్టాల వల్ల ముగించుకుని తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నారు.<ref>ఆకాశం:కవితాసంకలనంలో బి.వి.వి.ప్రసాద్ వివరాలు</ref>
పంక్తి 46:
 
== రచన రంగం ==
బి.వి.వి.ప్రసాద్ సాహిత్యం పట్ల ఆసక్తితో పలు కవిత్వ రచనలు చేశారు. స్కూలు చదువులో చిత్రకళతో ప్రారంభమైన సృజనాత్మక వ్యాసంగం, కళాశాల చదువుకు వచ్చేసరికి కవిత్వంగా మారింది. 1989లో తొలి పుస్తకం "ఆరాధన" (కవిత్వ సంకలనం) ప్రచురించేనాటికి కవిత్వం, కథలు, సాహిత్య తత్త్వచింతనలు రాసుకున్నారు. హైకూ ప్రక్రియలో రాసుకున్న కవితలతో 1995, 1997, 1999ల్లో వరుసగా దృశ్యాదృశ్యం, హైకూ, పూలురాలాయి సంపుటాలు ప్రచురించారు. వీరి వచన కవిత్వం 2006లో "నేనే ఈ క్షణం" 2011లో "ఆకాశం" 2015లో "నీలో కొన్నిసార్లు" పేర్లతో సంపుటాలుగా వచ్చింది. 2015లో హైకూలు, హైకూపై వ్యాసాలూ కలిపి "బివివి ప్రసాద్ హైకూలు"గా వచ్చింది.
 
== రచనల జాబితా ==
* [[ఆరాధన (కవిత్వం)|ఆరాధన]] (వచన కవిత్వం) - 1989
* [[దృశ్యాదృశ్యం (కవిత్వం)|దృశ్యాదృశ్యం]] (హైకూలు) - 1995
* [[హైకూ (బి.వి.వి.ప్రసాద్ పుస్తకం)|హైకూ]] (హైకూలు) - 1997
పంక్తి 55:
* [[నేనే ఈ క్షణం]] (వచన కవిత్వం) - 2006
* [[ఆకాశం (పుస్తకం)|ఆకాశం]] (వచన కవిత్వం) - 2011
* [[నీలో కొన్నిసార్లు ]] (వచన కవిత్వం ) - 2015
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/బి.వి.వి.ప్రసాద్" నుండి వెలికితీశారు