మూత్రపిండము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో , గా → గా , కూడ → కూడా , పటిష్ట → పటిష్ఠ, ర using AWB
పంక్తి 19:
DorlandsSuf = 12470097 |

'''మూత్రపిండాలు''' (Kidneys) చాల ముఖ్యమైన అవయవాలు. జీవి మనుగడకి [[మెదడు]] (brain), [[గుండె]] (heart), మూత్రపిండాలు మూలాధారాలు. జీవి చేసే కార్యకలాపాలన్నిటిని నియంత్రించేది మెదడు. శరీరం నాలుగు మూలలకీ రక్తాన్ని ప్రసరింపచెయ్యటానికి పంపు వంటి సాధనం గుండె. రక్తంలో చేరుతూన్న కల్మషాన్ని గాలించి, వడపోసి, శుభ్రం చేసే పని మూత్రపిండాలది. ఈ మూత్రపిండాలు విరామం లేకుండా పని చేసిపనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. [[రక్తం]]లో ఎక్కువున్న నీటినీ, విషతుల్యాలనూ ఎప్పటికప్పుడు వడకట్టేస్తూనే ఉంటాయి. ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని అంచనా. ఇవి ఒంట్లో నీరు-లవణాల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంటాయి. [[రక్తపు పోటు]] (blood pressure) ని నియంత్రించటంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి.

== మూత్రపిండాల స్థావరం ==
పంక్తి 27:
== మూత్రపిండాలు చేసే పని ==

మన మూత్రపిండాలు ప్రతి రోజూ దరిదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకట్టి అందులోంచి రదరిదాపురథరిదాపు 2 లీటర్ల కల్మషాలనీ, అధికంగా ఉన్న నీటినీ తోడెస్తాయి. ఇలా తోడెయ్యబడ్డ నీరే మూత్రం లేదా ఉచ్చ. ఈ మూత్రం, ప్రతి రోజూ, ఇరవైనాలుగు గంటలు, అహర్నిశలూ అలా బొట్లు బొట్లు గాబొట్లుగా మూత్రపిండాలలో ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఇలా తయారయున బొట్లు యూరెటర్‌ (ureter) అనే పేరు గల రెండు గొట్టాల ద్వారా మూత్రాశం ల (bladder) లో చేరతాయి. ఈ సంచీ నిండగానే ఉచ్చ పోసుకోవాలనే కోరిక మెదడులో కలుగుతుంది. ఈ యూరెటర్లు సుమారు 0.6 సెంటీమీటర్లు వ్యాసం గల గొట్టాలు. ఈ గొట్టాల గోడలలో ఉన్న కండరాలు తరంగాల మాదిరి ముకుళించుకుని వికసిస్తూ ఉంటే వీటిలో ఉన్న మూత్రపు బొట్లు మూత్రాశయం వైపు తొయ్యబడతాయి. మూత్రాశయంలోకి చేరుకున్న మూత్రం మళ్ళా వెనక్కి వెళ్ళకుండా ఈ కండరాలే అడ్డుకుంటాయి. కనుక మూత్రాశయం లోమూత్రాశయంలో పెరుగుతూన్న మూత్రానికి ఒకటే దారి - బయటకి. మూత్రాశయం నుండి బయటకి వెళ్ళే గొట్టం పేరు యూరెత్రా (urethra). ఇది పురుషాంగం మధ్య నుండి కాని, యోని ద్వారం దగ్గరకి కాని బయటకి వస్తుంది. ఇలా బయటకి వెళ్ళే మార్గాన్ని మూత్రమార్గం (urinary tract) అని కూడకూడా అంటారు.

== గలన యంత్రాంగం ==
పంక్తి 35:
== రక్తం లోకి మలినాలు ఎక్కడ నుండి వస్తాయి? ==

మనం తినే ఆహారం జీర్ణం అయి రక్త ప్రవాహంలో కలసినప్పుడు అనవసరమైన పదార్ధాలు కొన్ని రక్తంలో చేరతాయి. కట్టెలు కాలినప్పుడు నుసి మిగిలినట్లు శరీరం తన పనులు తాను చేసుకుంటూ పోయే సందర్భంలో కొన్ని మలిన పదార్ధాలు జీవకణాలలో తయారవుతాయి. ఇలా రక్తంలో చేరిన మలినాలని మూత్రపిండాలు సత్వరం శరీరం నుండి బహిష్కరించపోతే రక్తం విషపూరితం అవుతుంది. రక్తం చిట్టిగొట్టాలగుండా ప్రవహించేటప్పుడు శరీరానికి ఇంకా పనికి వచ్చేవీ, ఇహపనికి రానివీ రెండూ కలిసే ఉంటాయి. అప్పుడు ఆ ప్రవాహంలో ఉన్న సోడియం, పొటాసియం, భాస్వరం మొదలైన ద్రవ్యాలని తూకం వేసి, శరీరం అవసరాలకి సరిపడా రక్తంలో ఉండనిచ్చి, మిగిలిన వాటిని బయటకి తోడుతాయి మూత్రపిండాలలో ఉన్న గ్లోమెరూల్సు, చిట్టిగొట్టాలూ. ఈ పదార్ధాలు ఎక్కవైనా చిక్కే, తక్కువైనా చిక్కే.

[[దస్త్రం:Kidney_PioM.png|300px|thumb|right|1. [[:en:Renal pyramid|Renal pyramid]]
2. [[:en:Efferent artery|Efferent artery]]
3. [[వృక్క ధమని]]
4. [[వృక్క సిర]]
5. [[:en:Hilum of kidney|Renal hilum]]
6. [[:en:Renal pelvis|Renal pelvis]]
7. [[:en:Ureter|Ureter]]
8. [[:en:Minor calyx|Minor calyx]]
9. [[:en:Renal capsule|Renal capsule]]
10. [[:en:Inferior renal capsule|Inferior renal capsule]]
11. [[:en:Superior renal capsule|Superior renal capsule]]
12. [[:en:Afferent vein|Afferent vein]]
13. [[:en:Nephron|Nephron]]
14. [[:en:Minor calyx|Minor calyx]]
15. [[:en:Major calyx|Major calyx]]
16. [[:en:Renal papilla|Renal papilla]]
17. [[:en:Renal column|Renal column]]]]
పంక్తి 49:
* రక్తంలో ఉన్న విద్యుత్‌, రసాయన తుల్యతలని కాపాడటం (maintain electrolyte balance).
* రక్తంలో ఉన్న విషతుల్య పదార్ధాలని నాశనం చేసి విసర్జించటం.
* రక్తం లోకి హార్మోనుల్ని స్రవించి, తద్వారా శరీరం లోని ఖటికం (calcium) మట్టాన్ని నిర్ధిష్ట స్థాయిలో ఉంచటం. (తద్వారా ఎముకలని పటిష్టంగాపటిష్ఠంగా ఉంచటం.)
* శరీరానికి కావలసిన ఎర్ర కణాల ఉత్పత్తికి సహాయం చేసి రక్తహీనత (anemia) రాకుండా కాపాడటం.
* రక్తంలో ఉన్న నీటి మట్టాన్ని నియంత్రించి తద్వారా రక్తపు పోటు (blood pressure) ని నియంత్రించటం.

== మూత్రపిండాలకి హాని జరిగే పరిస్థితులు ==
దెబ్బలు తగలటం వినా, మూత్రపిండాల ఆరోగ్య భంగానికి ముఖ్య కారకులు మితిమీరిన [[రక్తపు పోటు]] (high blood pressure), అదుపు తప్పిన రక్తపు చక్కెర మట్టం (high blood sugar level), కొన్ని రోగాలను నయం చేసె క్రమంలొక్రమంలో వాడె మందుల వల్ల. కనుక మూత్రపిండాల ఆరోగ్యం పరిరక్షించుకోవాలంటే ముందు రక్తపు పోటుని అదుపులో పెట్టాలి. ఆ తరువాత [[డయబెటీస్‌]] (diabetes) రాకుండా జాగ్రత్త పడాలి. వీటి అవతరణకి వంశానుగత కారణాలు కొంతవరకు ప్రేరకాలు అయినా, మంచి అలవాట్లతో వీటిని నియంత్రించవచ్చు. ఈ మంచి అలవాట్లలో ముఖ్యమైనవి: ప్రతి దినం చలాకీ జీవితం గడపటం, శరీరం బరువుని అదుపులో పెట్టుకోవటం, పొగతాగుడు మానటం, ఆరోగ్యకరమైన తిండి తినటం.

== మూత్రపిండాల్లో రాళ్ళు ==
ఘట్‌కేసర్‌లో అవుశాపూర్‌ గ్రామానికి చెందిన హన్మంతు (49) మూత్రాశయం నుంచి 250 గ్రాముల రాయిని తీశారు.చిన్న చిన్న మోతాదులలో మూత్రాశయంలో రాళ్లు ఏర్పడటం సర్వ సాధారణం. ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న నీటిని తాగితే అది ఒక పొరగా ఏర్పడి క్రమేణ రాయిగా మారుతుంది.రోజుకు ఐదు నుంచి ఏడు లీటర్ల నీటిని తాగితే రాళ్లు ఏర్పడే అవకాశం ఉండదు.ఒక వేళ ఇది వరకే చిన్నచిన్న రాళ్లు<ref>[http://www.beautyepic.com/say-goodbye-to-your-kidney-stones-with-only-half-a-cup-of-this-drink/ మూత్రపిండాలలొ రాళ్ల నుంచి విముక్తి పొందె మార్గాలు ఈ సంచికలొ]</ref> ఏర్పడి ఉంటే మూత్రంతో పాటే బయటికి వచ్చే అవకాశం ఉంది. (సూర్య12.9.2009)

== వనరులు ==
"https://te.wikipedia.org/wiki/మూత్రపిండము" నుండి వెలికితీశారు