సాక్షి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (2), ప్రతిష్ట → ప్రతిష్ఠ using AWB
పంక్తి 18:
}}
బాపు దర్శకత్వంలో [[కృష్ణ]], [[విజయనిర్మల]] ప్రధానపాత్రలుగా 1967లో విడుదలైన సినిమా '''సాక్షి'''. సాక్షి బాపు దర్శకుడిగా తీసిన మొట్టమొదటి చిత్రం. ఈ చిత్రం తీసే సమయానికి కృష్ణగాని, విజయనిర్మల గాని ప్రేక్షకులకి అంతగా తెలియదు. ఈ సినిమాలో వీరిద్దరూ ఏవిధమైన మేకప్ లేకుండా నటించారు. రంగారావు అనే నటుడు ఈ చిత్రంలో కరణం పాత్రను పోషించి,ఈ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకుని [[సాక్షి రంగారావు]] గా ప్రసిద్ధికెక్కాడు.
 
== నిర్మాణం ==
పంక్తి 26:
 
=== చిత్రీకరణ ===
పులిదిండి గ్రామంలో [[సాక్షి (సినిమా)|సాక్షి]] చిత్రీకరణ సాగింది. ఈ సినిమా స్క్రిప్ట్ పని పూర్తిచేసి, ఫైనాన్సు చేసేందుకు నవయుగ వారిని ఒప్పించగానే బాపురమణలు ఓ మ్యాప్ గీసుకున్నారు. సినిమాలో అనుకున్న గ్రామం ఎలావుంటుంది అన్న మ్యాప్ అది. అందులో బల్లకట్టు ఉన్న ఓ కాలవ, కాలవ దగ్గర రేవులో ఓ పెద్ద మర్రిచెట్టు, రేవు నుంచి ఊరికి చిన్న బాట, ఊళ్ళో ఓ చిన్న గుడి, గుడికో మండపం.. ఇలా తమ సినిమా కథకు అవసరమైన పల్లెటూరిని మ్యాప్ గా గీశారు. గోదావరి పరిసరాల్లో ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్ మెంటులో పనిచేసి అప్పటికి సీలేరు ప్రాజెక్టు ఇంజనీరుగా పనిచేస్తున్న బాపు రమణల బాల్యమిత్రుడు, రచయిత [[బి.వి.ఎస్.రామారావు]]ను ఆ మ్యాప్ ని పోలిన ఊరు వెతకాల్సిందిగా కోరారు. రామారావు ఉద్యోగానికి సెలవుపెట్టి అలాంటి ఊరి కోసం రాజమండ్రి వచ్చేసి ఇరిగేషన్ కాంట్రాక్టర్ గా పరిచయస్తులైన కలిదిండి రామచంద్రరాజుకు అలాంటి ఊరిని వెతుకుదాం సాయపడమని అడిగారు. ఆ మ్యాప్ చూసినాకా మ్యాపును పోలినట్టుగా తమ ఊరు పులిదిండే ఉందని సూచించారు.<ref name="కొసరుకొమ్మచ్చి - సీతారాముడు">{{cite book|author1=బి.వి.ఎస్.రామారావు|authorlink1=బడి నుంచి బైస్కోపుల దాకా.. రమణతో నా ప్రయాణం|title=కొసరుకొమ్మచ్చి|date=అక్టోబర్ 2014|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=3}}</ref><br /> అయితే బాపురమణలు వచ్చి సినిమా చిత్రీకరించాల్సిన గ్రామం ఎంచుకోవాల్సివుంటుంది కనుక అందుకోసం వెతికేందుకు ఆయన గ్రామంలో స్వంత ఇంట్లోనే వారికి బస ఏర్పాటుచేశారు. కాలవరేవుల్లో [[బొబ్బర్లంక (ఆత్రేయపురం)|బొబ్బర్లంక]], పిచికలలంక, [[ఆత్రేయపురం]], [[ఆలమూరు (తూర్పుగోదావరిజిల్లా మండలం)|ఆలమూరు]], [[పులిదిండి]], కట్టుంగ వంటి గ్రామాలను చూశారు. చివరకి పులిదిండి గ్రామాన్నే ఎంచుకున్నారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి">{{cite book|last1=ముళ్ళపూడి|first1=వెంకటరమణ|title=(ఇం)కోతి కొమ్మచ్చి|date=జూలై 2013|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=6}}</ref><br />
సినిమాకు అవసరమైన కొన్ని సెట్లు [[బి.వి.ఎస్.రామారావు]] వేశారు. ఈ సెట్ ఎంత సహజంగా కుదిరేలా ప్రయత్నించారంటే సినిమాలో కథానాయకుడి గుడిసె సెట్ వేసినప్పుడు, దాన్ని పాతబడిన ఇల్లుగా చూపేందుకు గ్రామంలోని పాతబడిపోయిన పాడైన గుమ్మం ఆ ఇంటివారిని అడిగి తీసుకుని వినియోగించారు. అలానే ఆ గుమ్మాన్నిచ్చిన వారికి కొత్త గుమ్మాన్ని ఏర్పాటుచేశారు. ఈ సినిమా చిత్రీకరించేందుకు ముందు బాపుకు సినిమా దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవమేదీ లేదు. కేవలం సినిమా విద్యార్థిగా, ఔత్సాహికునిగా ప్రారంభమై ఎవరి వద్దా అసిస్టెంటుగా పనిచేయకుండానే సినిమాల్లో అడుగుపెట్టారు. ఆయనకు షాట్ తీసే విధానాల గురించి కొంత మౌలికమైన విషయాలను [[ఆదుర్తి సుబ్బారావు]] అసిస్టెంటుగా పనిచేసిన కబీర్ దాస్ నేర్పారు. సినిమాలో మొదట ''అమ్మకడుపు చల్లగా అత్తకడుపు చల్లగా'' పాట చిత్రీకరణతో ప్రారంభించి దాదాపు 19రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలైంది.<ref name="మా సినిమాలు-బాపు">{{cite web|first1=బాపు|title=మా సినిమాలు|url=http://navatarangam.com/2014/02/our-films-bapu-1/|website=నవతరంగం|accessdate=18 April 2015}}</ref>
 
పంక్తి 33:
 
== బడ్జెట్ ==
సినిమా బడ్జెట్ మొదట రూ.2లక్షల 50వేలుగా అంచనా వేసుకున్నారు. నిర్మాతలుగా బాపురమణలకు ఇదే మొదటి చిత్రం కావడంతో ఫైనాన్స్ చేసేందుకు నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ వారిని సంప్రదించారు. వారు అంగీకరించి బాపురమణలు రూ.25వేలు పెట్టుబడి పెట్టగానే రూ.50వేలు విడుదల చేశారు. అయితే మొట్టమొదట బాపురమణలు టెక్నీషియన్లకు, ఆర్టిస్టులకు ఎవరికైనా రూ.పదివేలు లోపే రెమ్యూనరేషన్ ఉండేలా ఎంచుకోవాలనుకున్నారు. దర్శకుడు బాపుకు రూ.10వేలు, సంగీత దర్శకుడు మహదేవన్ కు రూ.10వేలు, రచయిత రమణకు రూ.7వేలుగా అంచనా వేసుకున్నారు. అయితే నవయుగ వారు కొత్త దర్శకుడు కాబట్టి సీనియర్ని ఛాయాగ్రాహకుడిగా పెట్టుకోమనడం, అందుకు సెల్వరాజ్ ను అనుకోవడం జరిగింది. ఆయన అప్పటికే రూ.16వేలు తీసుకుంటున్న టెక్నీషియన్ కావడంతో అందుకు తగ్గట్టుగా బడ్జెట్ పెరిగింది. సినిమాలో కథానాయకునిగా పనిచేసిన రోజుల్లో కృష్ణ కొత్తనటుడు కావడంతో రూ.4వేలు, అప్పటికే బి.ఎన్.రెడ్డి వంటి ప్రతిష్టాత్మకప్రతిష్ఠాత్మక దర్శకుని వద్ద పనిచేసిన నటి కావడంతో విజయనిర్మలకు రూ.6వేలు పారితోషికం ఇచ్చారు. షూటింగ్ 16రోజులు గడిచేసరికి దాదాపు రూ.లక్ష లోపుగా ఖర్చయింది. 16వ రోజున ప్రింట్ అయ్యి, ఒక వరసలో అమర్చిన ఫిలం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా చేస్తున్న సెల్వరాజ్ సినిమా చిత్రీకరిస్తున్న పులిదిండికి రప్పించారు. చాలా అందంగా వచ్చినాయనిపించి, సౌండ్ ట్రాక్ 35 మీద కాకుండా సామాన్యమైన టేప్ రికార్డర్ పై రికార్డు చేసి జతచేసేశారు. దాన్ని నవయుగ డిస్ట్రిబ్యూషన్స్ మేనేజర్లు శర్మ, నర్సయ్యలకు టూరింగ్ టాకీసులో చూపించారు. సరైన సౌండ్ లేని ఆ సినిమా చూడడంతో వారికి అది నచ్చకపోగా, అప్పటివరకూ ఇచ్చిన డబ్బు మూడునెలల్లో తిరిగి ఇచ్చేయాలని మిగిలిన పెట్టుబడి కోసం వేరెవరినైనా చూసుకోమని తేల్చి చెప్పేశారు.<br />
వేరే ఫైనాన్షియర్లు ఎవరు దొరుకుతారన్న ఆక్రోశంతో ముళ్ళపూడి వెంకటరమణ నవయుగ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో వాటాదారు, వసూళ్ళ విభాగానికి ఇన్ ఛార్జి అయిన చంద్రశేఖరరావుతో "ముహూర్తాలు పెట్టుకుని, చివర్లో వేరే పెళ్ళికొడుకుని చూసుకోమన్నట్టు, సినిమా నవయుగ వారు ఫైనాన్సు చేస్తున్నారన్న పేరు వచ్చేసి ఈ దశలో మేము చెయ్యం అంటే ఎలా"గంటూ నిలదీశారు. ఆయన మాట మీద అప్పటికి రూ.75 వేలు నవయుగ వారు ఇవ్వాల్సి వుండగా, రావాల్సిన లక్షా పాతికవేల రూపాయల్లో రూ.50వేలు తగ్గించుకుని రూ.75వేలు విడుదల చేయాలని లెక్కవేసి అడిగారు నిర్మాతలు రమణ, సురేష్ కుమార్. సామాన్యంగా వసూళ్ళ విభాగమే చూసే చంద్రశేఖరరావు తప్పిపోయిన పెళ్ళి సంబంధంతో పోల్చడంతో మెత్తబడి, ఫైనాన్సు విభాగం చూసే వాసుకి ఆ దృష్టితోనే వివరించారు. దాంతో వాళ్ళు పాటల సౌండు జతచేసి, మాటలు చేర్చి డబ్బింగ్ జరిపి ఓ అయిదారు సీన్లు, పాటలు చూపించండి చూస్తామని చెప్పారు. అలాగే మద్రాసులో చేయగా, చూశారు. సినిమా వాళ్ళకు నచ్చడంతో మిగిలిన రూ.75వేలు విడుదల చేశారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి" />
== విడుదల ==
పంక్తి 43:
 
== కథ ==
గ్రామంలో పడవ నడిపేవాడు కృష్ణ. అతన్ని ప్రేమించే అమ్మాయి విజయ నిర్మల. ఊరి రౌడీ, లారీ డ్రైవరు జగ్గారావు. విజయ నిర్మల ఇతని చెల్లెలు. రౌడీ చేసిన హత్య చేస్తుండగా చూసిన కథానాయకుడు, న్యాయస్థానానికి వెళ్ళి సాక్ష్యం చెప్తాడు. రౌడీకి జైలు శిక్ష పడుతుంది. కాని, రౌడీ జైలు నుంచి తప్పించుకుని వస్తున్నాడని తెలిసిన జనం, అప్పటిదాకా మెచ్చుకున్నవారే, ప్రాణ భయంతొ ఉన్న పడవాడికి ఆశ్రయం ఇవ్వటానికి నిరాకరిస్తారు. ఇక రౌడీ చేతులో ఎట్టాగో చావు తప్పదని నిబ్బరం గానిబ్బరంగా ఉన్న పడవ వాడు, రౌడీ వచ్చి తన్నటం మొదలు పెట్టేసరికి, భయంలోంచి వచ్చిన తప్పనిసరి ధైర్యంతో తాగి ఉన్న రౌడీని తనకున్న శక్తి యావత్తూ వినియోగించి దెబ్బలు వేస్తాడు. ఆ రౌడీ చచ్చిపోతాడు.
== విశేషాలు ==
సాక్షి సినిమాలో తొలిసారి వెండితెరపై జంటగా నటించిన [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[విజయ నిర్మల]] తదనంతరం ప్రేమించి వివాహం చేసుకున్నారు. సాక్షి సినిమా కోసం సందర్భంగా పులిదిండి గ్రామంలో నాయికా నాయికల మధ్య వివాహాన్ని చిత్రీకరించిన ఆలయంలోనే దరిమిలా కృష్ణ, విజయనిర్మల నిజజీవితంలోనూ పెళ్ళిచేసుకోవడం విశేషం.<ref name="బాపు గురించి శ్రీరమణ సాక్షిలో">{{cite web|first1=శ్రీరమణ|title=బాపు గీతలు జాతికి చక్కిలిగింతలు!|url=http://www.sakshi.com/news/opinion/bapu-cartoons-makes-morality-of-life-194579|website=సాక్షి|publisher=జగతి పబ్లికేషన్స్|accessdate=24 October 2015|date=13 డిసెంబర్ 2014}}</ref>
"https://te.wikipedia.org/wiki/సాక్షి_(సినిమా)" నుండి వెలికితీశారు