శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట: కూర్పుల మధ్య తేడాలు

→‎శాలంకాయనులు: శీర్షక మార్పు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
గోకర్ణపురం శివాలయంలో శివ లింగం వెనుక ఒక శిలాశాసనం ఉంది. ఆ శాసనం స్పష్టముగా లేదు పేరు చెరిగిపోయి ఉంది. కాని ౧౧౩౪ అనే తెలుగు సంఖ్యలు స్పష్టముగా కనిపిస్తున్నాయి. తెలుగులో ౧౧౩౪ అంటే నేటి సంఖ్యలు ప్రకారము 1134. కాబట్టి ఈ దేవాలయం శాలివాహన శకం 1134 (క్రీస్తు శకం 1212) లో నిర్మించబడింది అని అర్ధంమవుతుంది కాని ఎ రాజు నిర్మించాడో స్పష్టముగా లేదు.ఈ కాలంలో కళింగ ప్రాంతాన్ని మరియు గోదావరి పరీవాహక ప్రాంతమైన వేంగి వరకు తూర్పు గంగా సామ్రాజ్యానికి చెందిన అనియంక్క భీమ లేదా ఆనంగ భీముడు(లంగుల్య గజపతి రాజు తండ్రి) పరిపాలించాడని ద్రాక్షారామం శిలాశాసనం భట్టి తెలుస్తుంది.ఇతడు గొప్ప శివ భక్తుడు కూడా.ద్రాక్షారామం శిలాశాసనం లో ఈ రకముగా తెలుగులో లిఖించబడింది.
 
<poem>"'-స్వస్తి .......................... భుజబలపరాక్రమ పరమవైష్ణువ పరమమహేశ్వర పరమభట్టారక దుర్గకాపుత్ర శ్రీపురుషోత్తమపుత్ర రుద్రపుత్ర త్రయి............... మహావరాహ............................పరమేశ్వర గంగా............స్వయా..........[భ]................త్రికలింగేశ్వర శ్రీరాజరాజదేవర ......... ""'అనియంక్క భీమదేవరావతు సంవత్సరంబులు.......శ్రాహి......................గురువారము నాందు శ్రీమద్ద్రాక్షారామమున శ్రీ భీమేశ్వర శ్రీమహదేవరకు.....................................మ..వుల......చ్చితిమి.'''</poem>
 
కాబట్టి ఈ కాలంలో ఒరిస్సాకు చెందిన అనియంక్క భీముడు ఈ ప్రాంతాన్ని పాలించాడని తెలుస్తుంది. ఎమైనప్పటికి గోకర్ణపురం శివాలయం లోని శిలాశాసనం లో పేరు స్పష్టముగా లేనందు వల్ల ఏ రాజు గోకర్ణపురం శివాలయం కట్టించాడో కచ్చితంగా చెప్పడం కష్టం.