బి.వి.ఎస్.రామారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''బి.వి.ఎస్.రామారావు''' ప్రముఖ కథారచయిత. [[గోదావరి కథలు|గోదావరి కథల]] ద్వారా ప్రసిద్ధుడయ్యాడు.
==విశేషాలు==
భావరాజు వెంకట సీతారామారావు [[రాజమండ్రి]]లో 1932లో జన్మించాడు<ref>{{cite web|last1=భావరాజు|first1=పద్మిని|title=బాపురమణల సీతారాముడు|url=http://acchamgatelugu.com/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%AE%E0%B0%A3%E0%B0%B2-%E0%B0%B8%E0%B1%80%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A1%E0%B1%81|website=అచ్చంగా తెలుగు|accessdate=14 December 2016}}</ref>. భావరాజు సత్యనారాయణ, సత్యవతి గారలు ఇతని తల్లిదండ్రులు. ప్రముఖ రచయిత [[బి.వి.రమణారావు]], ప్రముఖ ఇంద్రజాలికుడు [[బి.వి.పట్టాభిరామ్]], ప్రముఖ కార్టూనిస్ట్ [[సత్యమూర్తి]] ఇతని సోదరులు. ఇతడు మెకానికల్, సివిల్ విభాగాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. [[మద్రాసు]]లోని కేసరి స్కూలులో చదువుకునే సమయంలో ఇతనికి [[ముళ్ళపూడి వెంకటరమణ]], [[బాపు]]లతో స్నేహం ఏర్పడి అది చివరిదాకా కొనసాగింది.
 
==ఉద్యోగం==
ఇంజనీరింగ్ పూర్తి అయ్యాక ఇతడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా ఉద్యోగంలోనికి చేరాడు. గోదావరి ప్రాజెక్టులో 15 సంవత్సరాలు జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ తదితర హోదాలలో పనిచేశాడు. ఆ సమయంలో ఆనకట్టల రిపేర్లు, కొత్త ఆనకట్టల నిర్మాణం, బ్యారేజీ నిర్మాణం, హైడ్రాలిక్ గేట్ల నిర్మాణం వంటి పనులలో భాగస్వామ్యం వహించాడు. అనేక వర్క్‌షాపులను నిర్వహించాడు. తర్వాత [[హైదరాబాదు]]కు బదిలీ అయ్యి 4 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేశాడు. పిమ్మట ఒక ప్రయివేటు సంస్థలో పాతిక సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నాడు.
"https://te.wikipedia.org/wiki/బి.వి.ఎస్.రామారావు" నుండి వెలికితీశారు