పండ్ల తొక్క: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 10:
రోజుకో ఆపిల్ తింటే వైద్యుడిని కలవాల్సిన అవసరం లేదని చెబుతారు. అందుకేగా, యాపిల్‌తో చేసిన డ్రింక్‌లూ, జ్యూస్‌లూ తాగుతున్నాం అనకండి! అందరూ అనుకొనేట్టు యాపిల్ గుజ్జులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉండవు. గుజ్జులో కంటే తొక్కలో ఐదురెట్లు ఎక్కువ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని అధ్యయనాలు తెలిపాయి. జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ అధ్యయనం ప్రకారం, యాపిల్ తొక్కులో రొమ్ము, కాలేయం, పెద్ద పేగు క్యాన్సర్లను నయం చేసే శక్తి ఉంది. జ్యూస్ తాగడం కన్నా యాపిల్ని కొరుక్కు తినడం వల్లే ఎక్కువ మేలు. చర్మం నిగనిగకు, చిగుళ్ల సంరక్షణకు ఉపయోగపడే శక్తివంతమైన పాలీఫినాల్స్ ఎక్కువగా పొందగలం కూడా. ఇక, పుల్లని నల్ల ద్రాక్షల విషయానికొస్తే, చాలామంది యథాతథంగా తినకుండా చక్కెర కలిపిన జ్యూస్‌గా తాగుతారు. రుచి బాగుంటుంది. కానీ రసం తీసి వడ కట్టినప్పుడు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండే చెక్కులో పాతిక శాతం వినియోగించుకోలేకపోతాం. దాంతో కొలెస్ట్రాల్ నిరోధక గుణాలనీ కోల్పోతాం. జామకాయలు మరీ పచ్చిగా ఉన్నా, పూర్తిగా పండినా ఏం చేస్తాం... ముక్కలుగా కోసం మధ్యలో ఉండే మెత్తని గుజ్జుని తినేస్తాం. కానీ ఇది సరికాదు. దీనివల్ల యాంతోసియానిన్ అనే క్యాన్సర్ నియంత్రణ కారకాన్ని పొందలేము.
==కేక్‌లు, సలాడ్లలో నిమ్మపొడి..==
నోటికి ఏ రుచీ సహించనప్పుడూ నిమ్మకాయ, చింతకాయ పచ్చళ్లు తినాలనిపిస్తుంది. రుచికంటే వీటికుండే వాసనే సగం సాంత్వన కలిగిస్తుంది. నిమ్మ, నారింజ చెక్కులో ఉండే మోనోటెర్‌పాన్స్ నూనెలు ప్రత్యేక వాసనలని వెదజల్లుతాయి. వీటికి చర్మ, కాలేయ, గర్భాశయ, వూపిరితిత్తుల క్యాన్సర్లని నివారించే శక్తి ఉంది. పచ్చళ్ల రూపంలో ఇప్పటికే వీటిని తింటున్నాం. పచ్చళ్లు వద్దనుకునే వాళ్లు నిమ్మతొక్కలతో చేసిన చాయ్‌కి హాయ్ చెప్పేయచ్చు. కేకులు, సలాడ్లలో లెమన్ పీల్ పొడిని చల్లుకొన్నా రుచిగానే ఉంటుంది. పదార్థాలని బేక్ చేసేటప్పుడూ, [[మఫిన్|మఫిన్స్]], బిస్కట్లలో కూడా ఈ పౌడర్ని ఎక్కువగా వాడుతుంటారు.
==తెల్లని గుజ్జు==
పుచ్చకాయ ముక్కలు అంటే ఎర్రని గుజ్జే అనుకుంటాం. కానీ అడుగున ఉండే తెల్లని పదార్థంలో పోషకాలు పుష్కలం. దాన్లో సిట్రులిన్ అనే పోషక పదార్థం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే అమినోయాసిడ్లు, విటమిన్ సి, విటమిన్ 'ఎ', థయామిన్, రైబోఫ్లెవిన్... రక్తహీనత రాకుండా చూసే ఇనుము, మెగ్నీషియమ్, ఎముకల బలానికి తోడ్పడే క్యాల్షియం ఉంటాయి. పోషకాలు అపారం కాబట్టి జ్యూస్ తయారు చేసేప్పుడు కాస్త లోతుగా కట్ చేయడం వల్ల తెలుపు రంగు పదార్థాన్నీ మిక్సీలో వేయొచ్చు.
|