క్లాస్ట్రోఫోబియా: కూర్పుల మధ్య తేడాలు

-అనాథ మూసలు
+లింకులు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''క్లాస్ట్రోఫోబియా''' అంటే ఇరుకైన ప్రదేశాల్లో చిక్కుకున్నట్లు కలిగే భయం. ఈ మాట లాటిన్, గ్రీకు పదాల నుంచి పుట్టింది. లాటిన్‌లోని ''క్లస్ట్రోమ్'' ‌ అంటే ఏదైనా ఓ ప్రదేశంలో ఇరుక్కుపోవడం అని అర్థం. (వ్యతిరేక పదం: ''క్లాస్త్రోఫిలియా'') ''{{lang|el|φόβος}}'' ఇక గ్రీకుభాషలో ''[[ఫోబియా|ఫోబస్]]'' అంటే భయం అని అర్థం. అంటే ఎక్కడైనా ఓ చోట తప్పించుకోడానికి వీల్లేకుండా ఇరుక్కుపోయినట్టు భయపడటమే క్లాస్ట్రోఫోబియా. ఇది సాధారణంగా మానసిక వ్యాకులత, తీవ్ర ఆందోళనల రూపంలో ఉంటుంది. ఒక్కోసారి తీవ్రపరిణామాలకి కూడా దారితీయొచ్చు. ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐదు నుంచి ఏడు శాతం మంది తీవ్రమైన క్లాస్ట్రోఫోబియాతో బాధపడుతున్నవాళ్లు ఉన్నారు. వాళ్లలో చాలా కొద్దిశాతం మంది మాత్రమే చికిత్స తీసుకొని బయటపడగలుగుతున్నారు.<ref name="Phobias">ఫోబియాస్‌ : ఏ హ్యాండ్‌బుక్ ఆఫ్ థియరీ, రీసెర్చ్‌, అండ్‌ చికిత్స‌. చికిస్టర్‌ , న్యూయార్క్‌ : విలే, 1997.</ref>
 
== క్లాస్ట్రోఫోబియా యొక్క ప్రాధమికప్రాథమిక లక్షణాలు ==
క్లాస్ట్రోఫోబియాలో ప్రధానంగా రెండు రకాల లక్షణాలు‌ ఉంటాయి. ఒకటి ఏదైనా ఓ ప్రాంతంలో నిర్బంధించబడిపోయి, నియంత్రించబడినట్టు భావించటం. రెండోది ఊపిరాడనంత స్థాయిలో మానసిక ఆందోళన. మొదటగా నిర్బంధించినట్టుగా ఉండే భావన గురించి చెప్పుకుందాం. ఇది ఏదైనా ఓ ప్రదేశంలో ఉండొచ్చు. లేదంటే కొన్ని ప్రదేశాలు చూసినప్పుడు అలాంటి ఆందోళన కలగొచ్చు. ఉదాహరణకి చిన్నచిన్న గదులు, తాళంవేసిన గదులు, కార్లు, [[సొరంగం|సొరంగ మార్గాలు]], సెల్లార్లు, ఎలివేటర్లు, సబ్‌వేట్రైన్లుసబ్‌వే ట్రైన్లు, [[గుహ|గుహలు]], [[విమానం|విమానాలు]], విపరీతంగా రద్దీగా ఉండే ప్రాంతాలు లాంటి చోట్ల ఇలాంటి ఆందోళన కలుగుతుంది. ఇంతేకాదు, కొన్ని పనులు చేస్తున్నప్పుడు కూడా ప్రత్యేకించి ఇలాంటి ఆలోచనలు రావొచ్చు. ఆందోళనలు పెరగొచ్చు. ఉదాహరణకి సెలూన్‌లో బార్బర్‌ ఛైర్‌లో కూర్చున్నప్పుడో, రేషన్‌ షాపులోనో, కిరాణా దుకాణంలోనో నిలబడినప్పుడు కూడా ఇలాంటి భావన కుదిపేసే అవకాశం లేకపోలేదు.
 
క్లాస్ట్రోఫోబియా లక్షణాలు‌ ఉన్నవాళ్లు తమను వెంటాడుతున్న ప్రదేశాల గురించి భయపడడం మాత్రమే కాదు, దానికి సంబంధించిన ఆలోచనలు కూడా వాళ్లని వెంటాడుతాయి. మళ్లీ ఆ ప్రదేశాలకి వెళ్లాల్సి వస్తుందా, వెళితే ఏమవుతుంది లాంటి ఆలోచనలు వాళ్లని కుదురుగా ఉండనివ్వవు. ఏదైనా ఓ ప్రదేశంలో క్లాస్ట్రోఫోబియా ప్రభావం మొదలైనప్పుడు ఆ ప్రదేశంలో గాలి పీల్చుకోవడం కష్టమైపోతున్నట్టు, ఊపిరి ఆగిపోతున్నట్టు కూడా అనిపిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/క్లాస్ట్రోఫోబియా" నుండి వెలికితీశారు