సముద్ర ట్రెంచ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
రెండు సముద్ర పలకల అభిసరణ సరిహద్దు మండలంలో లేదా సముద్ర పలక – ఖండ పలకల అభిసరణ సరిహద్దు మండలంలో ఏర్పడిన ట్రెంచ్ లు ఆయా పలకల సరిహద్దులకు సమాంతరంగా వుంటాయి. కాబట్టి వీటిని అభిసరణం చెందుతున్న రెండు పలకల సహజ భౌగోళిక సరిహద్దులుగా పేర్కొంటారు. భూగోళం యొక్క ఆస్తినో ఆవరణ (asthenosphere) నుండి మాగ్మా పైకి ఉబికి రావడం వలన సముద్రాంతర్గత రిడ్జ్ ల వద్ద నూతనంగా సముద్ర పటలం (Oceanic crust) సృష్టించబడుతుంది. మరో వైపున ఈ ట్రెంచ్ ల వద్ద ఆశ్మావరణం (Lithosphere) తిరిగి ఆస్తినో ఆవరణ లోనికి చొచ్చుకొనిపోతుంది. ఈ విధంగా భూగోళ వ్యాప్తంగా ట్రెంచ్ ల వద్ద సముద్ర ఆశ్మావరణం (Oceanic lithosphere) సగటున ఏడాదికి 3 చదరపు కిలోమీటర్ల చొప్పున క్షయకరణం చెందుతున్నదిగా అంచనా వేయబడింది.
 
==ట్రెంచ్ లక్షణాలు==
* ట్రెంచ్ లు సముద్ర భూతలంపై సబ్ డక్షన్ మండలం ప్రారంభమయ్యే ప్రాంతాన్ని సూచిస్తాయి.
* సముద్ర భూతలం పైన ఏర్పడిన అత్యంత లోతైన ప్రాంతాలు ట్రెంచ్ లు. సగటును వీటి లోతు 6 కిలోమీటర్లు కాగా అత్యధిక లోతు 11 కిలోమీటర్ల వరకూ వుంటుంది. పసిఫిక్ మహా సముద్రం లోని మెరియానా ట్రెంచ్ వద్ద గల ఛాలెంజర్ డీప్ ప్రాంతం అత్యధికంగా 11,034 మీటర్లు లోతు కలిగి వుంది.
"https://te.wikipedia.org/wiki/సముద్ర_ట్రెంచ్" నుండి వెలికితీశారు