శిల్పం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==కళాత్మకత==
[[శిల్పకళ|శిల్ప కళ]]లో లేని విద్యలేదు. గతంలో శిల్పుల చేతిలో శిలలు వెన్న ముద్దలుగా మారాయి. ఆ శిల్పాల అందచందాలు వర్ణనాతీతం. సకల విద్యలు తెలిసిన వారే శిల్పులుగా రాణించ గలరు. లెక్కప్రకారం కొలతలు వేసి ఏ శిల్పానికి ఎంత పరిమాణం శిల కావాలో తెలియాలంటే [[గణిత శాస్త్రం]] తప్పక తెలిసి ఉండాలి. శిల్పాలు ఎక్కువగా నాట్యభంగిమలో ఉంటాయి. నాట్యశాస్త్రం తెలియని శిల్పులు, శిల్పంలోని హావ భావాలను కచ్చితంగా ప్రతిబింబించలేరు. చిత్ర కళ తెలియనిదే [[శిల్పకళ]] ప్రారంభించలేరు. శిలపై ముందుగా చిత్రాన్ని గీసి తర్వాతనే శిల్పంగా మారుస్తారు. ఇలా అన్ని శాస్త్రాలలో నిష్ణాతులైన వారే గొప్ప శిల్పులుగా రాణిస్తారు. గతంలో ఇలాంటి శిల్పులు కోకొల్లలుగా ఉండేవారు. అందుకే ఏ [[దేవాలయం]] చూసినా శిల్పకళా శోభితమైనదే. హిందూ దేవాలయాలలో వివిధ విధాలుగా శిల్పాలను చేక్కుతారు. అందులోశిల్పకళా స్తంభాలు, శిల్పకళా మండపాలు, నాట్య శిల్పాలు, దేవతా మూర్తులు, పశు, పక్ష్యాదులు, లతలు, తీగలు, [[వృక్షాలు]], శృంగార శిల్పాలు, గోపురాలలో శిల్పకళ, గోడలపై శిల్పకళ వంటివి ముఖ్యమైనవి.
 
== ఆలయాలు శిల్పాలు ==
ఆలయాలలో శిల్పాలు శాస్త్రీయమైన పద్ధతిలోనే స్థాపిస్తారు. ఆయా మతాలను అనుసరించి శిల్పాలూ విభిన్నంగా ఊంటాయి. హిందూ ఆలయాలలో శిలలను చెక్కాడానికి ఆగమశాస్త్రాన్ని అనుసరించి చేస్తారు. శాత్రీయరీతిలో చెక్కిన శిపాలే పూజకు అర్హమని హిందువుల విశ్వాసం. హిందూ ఆలయాలలో చెక్కిన శిల్పాలను
"https://te.wikipedia.org/wiki/శిల్పం" నుండి వెలికితీశారు