కాకాని చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లింకులు చేర్చాను
పంక్తి 1:
'''కాకాని చక్రపాణి''' తెలుగు కథా రచయిత. మానవ జీవన సంఘర్షణలను, అక్రోశాలను,అత్మేయతానుబందాలను హృద్యమైన శైలిలో రుపుదిద్దగల శిల్పి అయన. అవిశ్రాంతంగా సాగుతున్న అయన [[సాహిత్య వ్యవసాయంలోవ్యవసాయం]]లో ఇప్పటివరకు పన్నెండు నవలలు, ఎన్నో కధలు లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు పండించారు.<ref>[http://kathanilayam.com/writer/552 కథానిలయంలో రచయిత: కాకాని చక్రపాణి]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[హైదరాబాద్]] లో ఆంధ్రసారస్వత పరిషత్త ప్రాచ్య కళాశాలలో సుమారు 30 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేశారు. ఆంగ్ల బోధన ఆయన వృత్తి తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఆయన వ్యావృత్తి మనిషి మృదుభాషి. తను విభేదించే విషయంలో సైతం ఎదుటివారిని నొప్పించని తత్త్వం ఆయనది. స్నేహితులతో కబర్లంటే ఇష్టపడతారు. తెలుగు నవలా సాహిత్యంపై సోమర్సెట్ మామ్ ప్రభావం అన్న అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టం పొందారు. ఆ పరిశోధనలో భాగంగానే మామ్ రాసిన ఆఫ్ హ్యూమన్ బాండేజ్ నవలను అనువదించారు. ఇటీవలే ద్రావిడ విశ్వవిద్యాలయంకోసం రాజశేఖర చరిత్ర, మైదానం, చివరకు మిగిలేది. అల్పజీవినవలలను ఫోర్క్లాసిక్స్ ఆఫ్ తెలుగు ఫిక్షన్ పేరిట ఆంగ్లంలోకి అనువదించారు.<ref>[http://m.dailyhunt.in/Ebooks/telugu/kaakaani-chakrapaani-navalalu-1-book-121948 Kaakaani Chakrapaani Navalalu- 1 ( కాకాని చక్రపాణి నవలలు-1 )]</ref>
 
డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనాత్మకత రచనలు. <ref>[http://www.pustakam.org/telugu-books/kakani-chakrapani-navalalu-2.html కాకాని చక్రపాణి నవలలు -2 - Kakani Chakrapani Navalalu-2]</ref>
==కథలు==
కాకాని మూడు కథా సంపుటాలను ప్రచురించారు. అవి [[థ్రిల్లింత]], [[నివురు]], [[పతితపావని]]. అందులో ఒకదానికి డాక్టర్‌ కేతు విశ్వనాథరెడ్డి ముందుమాట రాస్తూ ‘చిత్తవృత్తుల్ని ఆడించే శక్తుల్ని ఈ రచయిత తన కథల్లో ఒక అన్వేషకుడిగా పట్టుకో డానికి ప్రయత్నించాడు. మనిషిని మనిషిగా, ఒక సామాజిక సాంస్కృతిక మూర్త పదార్థంగా పరిశీలించాడు. మనుష్యులు కోల్పోతున్న ఆపేక్షలను గుర్తిం చాడు. పోగొట్టుకుంటున్న విలువల్ని చర్చించాడు’ అంటారు. అసలు మనిషికి స్వేచ్ఛ వున్నదా, వుంటే ఆ మేరకు ఏ వ్యక్తి అయి నా జీవించగలడా, ఆ గీతలు గీచే సమాజ ప్రభావం ఎలాం టిది అన్న అతి గహనమైన విషయాన్ని చక్కటి శిల్పంతో దిద్దిన కథ ‘నిస్వార్థం’. మెరుపు తీగలాటి వివేకవతి అయిన భార్య వుండి కూడా వీధుల వెంబడి కుక్కల్లాగా తిరిగే భర్తను, సంయమనం నిండిన ఛీత్కారంతో చిత్రించింది ‘చుక్కల్లో చంద్రుడు’ కథ. ‘మరమరాలు బఠాణీలు అందులో సామ్యవాదం’లోని నారా యణరావు, ‘రెండు ముఖాల చంద్రుడు’లోని రామచంద్రం, ‘మహా పర్వతంా మరుగుజ్జు’లోని రామం నేటి కాలంలోని పురుషకు సం స్కారానికి ప్రతినిధులు.స్త్రీ పురుష సంబంధాలను వేర్వేరు కోణాలనుండి ‘భార్యంటే’, ‘తాకట్టు’, ‘ఛీ! ఏం మగాడు’ కథలు పరిశీలించగా ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ మనసుకు శరీరానికి మధ్యగల శక్తివంతమైన సం బంధాన్ని చిత్రీకరిస్తుంది. ఆయన రచనలో వ్యక్తీకరించిన కొన్ని యదార్థ వాదాలు ఇలా వుంటాయి. <ref>[https://promotetelugu.wordpress.com/2010/12/22/%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF-%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C-%E0%B0%95%E0%B0%BE%E0%B0%95%E0%B0%BE/ కథాశిల్పి …డాక్టర్‌ కాకాని చక్రపాణి]</ref>
===వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలు===
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/కాకాని_చక్రపాణి" నుండి వెలికితీశారు