కన్యాకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58:
చెన్నై నగరానికి 743 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారి ఎలా వెళ్లాలంటే.. విమాన మార్గంలో అయితే, [[మధురై]] నుంచి 250 కిలోమీటర్లు, [[తిరువనంతపురం]] నుంచి 90 కిలో మీటర్ల దూరం ప్రయాణించి వెళ్లవచ్చు. [[చెన్నై]] నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన [[ఢిల్లీ]], [[ముంబయి]], [[కోల్‌కతా]]ల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే.. కన్యాకుమారిలో పలు చిన్న, పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్‌, దేవస్థానంవారి కాటేజీలు, ట్రావెలర్స్‌ బంగళా, అతిథి గృహాలు.. పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి.
==కన్యాకుమారి ఆలయం==
[[File:Kanyakumari from vivekananda rock memorial.jpg|thumb|సముద్రం నుంచి కన్యాకుమారి పట్టణం వ్యూ]]
ఇది దక్షిణ భారత దేశాగ్రమున వెలసిన పవిత్ర క్షేత్రం. మూడు సముద్రాలైన బంగాళా ఖతము, హిందూ మహా సముద్రము, అరేబియా సముద్రము కలిసే చోట నిర్మితమైన ఈ ఆలయము అతి పవిత్రమైనది. ఈ ఆలయంలోని విగ్రహాన్ని [[పరశురాముడు]] ప్రతిష్టించాడని ప్రతీతి. ఇక్కడ అమ్మ వారు కన్యా కుమారి రూపంలో భక్తులకు దర్శన మిస్తుంది.
[[దస్త్రం:Vivekananda Rock Memorial at Sunrise.JPG|thumb|right|కన్యాకుమారిలో వివేకానంద స్మారక మందిరం]]
"https://te.wikipedia.org/wiki/కన్యాకుమారి" నుండి వెలికితీశారు