తిక్కన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
==మహాకవి తిక్కన రుద్రాక్షమాల లభ్యం==
మహాకవి తిక్కన 12వ శతాబ్దంలో ఉపయోగించిన రుద్రాక్షమాల బయటపడింది. [[నెల్లూరు]]లో నివసిస్తున్న ఆయన వంశస్థురాలు లక్ష్మీప్రసన్నకు ఆ మాల వంశపారంపర్యంగా సంక్రమించింది. నెల్లూరులోని [[పెన్నానది]] ఒడ్డున తిక్కన పార్కులో రుద్రాక్షమాల, పగడాన్ని ప్రదర్శించారు.
[[మహాభారతము]]లో [[నన్నయ్య]] రచించిన [[పర్వాలు]] కాకుండా మిగిలిన 15 పర్వాలను తిక్కన రచించాడు. ఆదికవి [[నన్నయ]] [[ఆది పర్వము]], [[సభాపర్వము]], [[అరణ్యపర్వము]]లో కొంతభాగము రచించి గతించెను. అరణ్యపర్వములో మిగిలిన భాగమును [[ఎఱ్ఱన]] రచించాడు. అరణ్యపర్వము వరకును [[నన్నయ]] వ్రాసి మరణించగా, తరువాత ఈ మహాకవి, తిక్కన అరణ్యపర్వశేషమును మాత్రము విడిచిపెట్టి, విరాటపర్వము మొదలుకొని 15 పర్వములను వ్రాసాడు.అరణ్యపర్వమును ఆంధ్రీకరించుటచేతనే నన్నయ మృతిచెందాడని, అందుకే నేనుకూడా మృతిచెందుతాననే భయంతో అరణ్యపర్వమును తిక్కన విడిచిపెట్టినాడు అని కొందరు అంటారు. గ్రంథరచనకు పూర్వము మనుమసిద్ది తిక్కనచే యజ్ఞము చేయించి భారతమును సంపూర్ణముగా తిక్కనచే రచింపజేసినట్లు చెప్పుదురు. కాని ఈ మనుమసిద్దిరాజు తనని రాజరాజ నరేంద్రుని ఆస్థానమునకి పొమ్మనగా తిక్కన పోనని మారాం చేయడంతో, ఈ విషయాన్ని ఎరిగిన రాజరాజనరేంద్రుడు తిక్కనకి నీవు ఎక్కడనుండైనా రచనచేయవచ్చని సమాచారం పంపగా, అప్పుడు తిక్కనచే మనుమసిద్ది నెల్లూరులో [[యజ్ఞము]] చేయించెను. అయిననూ తిక్కన మనుమసిద్ధిపై కోపంతో, భారతముని మనుమసిద్దికి అంకితం ఇవ్వక, హరిహరనాథునికి అంకితం చేసెను అని కొందరి వాదన.
 
తిక్కన మొదట రచించిన పర్వములను చూసి వానియందు విశేషవృత్తములు లేకపోగా పండితులు, అతడు సామాన్య వృత్తములుతో కాలము గడుపుతున్నాడే కాని అపూర్వవృత్తరచనా కుశలుడు కాడని ఆక్షేపించిన మీదట తిక్కన స్త్రీ పర్వమునందు బహువిధ వృత్తములను రచించాడని చెప్పుదురు. తిక్కన రచించిన 15 పర్వములలో 45 ఆశ్వాసములు కంటే ఎక్కువ గ్రంథము లేదు. ఒక్కొక్క ఆశ్వాసమునకు 445 పద్యములు చొప్పున లెక్క చూసిననూ, భారతంలో తిక్కన 25000 పద్యములు కంటే అధికముండవు. దినమునకు 10 పద్యములు చొప్పున రచించినచో ఇంత మహాభారత గ్రంథము 5 లేదా 6 సంవత్సరములలో రచించవచ్చును. కాబట్టి ఇట్టి గ్రంథము ఒకరివల్ల రచించడం అసాధ్యము కాదు. సాధ్యమయ్యే అవకాశం ఉంది. కాని తిక్కన శైలితో సమానముగా వ్రాయుట మాత్రము ఎవ్వరికి సాధ్యముకాదు. తెలుగుభాష యందు ఎన్నిగ్రంథములు ఉన్నానూ, తిక్కన కవిత్వముతో సమానముగా కాని దానిని మించియున్నట్లుగాని కవిత్వము చెప్పగలిగిన వారు నేటివరకు ఒక్కరును కనబడలేదు. తిక్కన కవిత్వము ద్రాక్షాపాకము మిక్కిలి రసవంతముగా ఉండును. ఇతని కవిత్వమునందు పాదపూరణము కొరకు వాడిన వ్యర్థపదములు అంతగా కనిపించవు. ఈయన [[కవిత్వము]] లోలోక్తులతో కూడి జాతీయముగా ఉండును. ఇతని కవిత్వములో ఒకవంతు [[సంస్కృతము]], రెండువంతుల తెలుగుపదములు కనిపిస్తాయి. నన్నయవలె తన గ్రంథమును మూలమునకు సరిగా వ్రాయలేదు. విరాటపర్వమునందు కథ కొంత పెంచెను. తక్కిన పర్వములందు మిక్కిలిగా కథను సంగ్రహపరిచెను. ఉద్యోగపర్వములోని సనత్కుమార ఉపదేశమును మూలమున పదిపండ్రిపత్రములున్నా, తెలుగున 2లేదా 3పద్యములతో సరిపెట్టెను. భగవద్గీతలు, ఉత్తరగీతలు మొదలైనవానిని వ్రాయనేలేదు.
 
భగవద్గీతలోని కొన్నిశ్లోకములకు దగ్గరగా కొన్ని పద్యములను వ్రాసాడు. ఉదాహరణకు ఈ క్రింది శ్లోకమును చూడుము.
పంక్తి 85:
పద్యము ;;
<poem>
క;;......................మానుగమ్మానుగ ధర్మక్షేత్రం
........................బైన కురుక్షేత్రమున మహాహవ మునకున్
........................బూని మనబలమున్ బాండవ
.........................సేనయు నిటు సన్నీ యేమి చేసెంజె పుమా!
</poem>
 
పంక్తి 95:
ఈయన సంస్కృతమును తెనిగించినరీతిని తెలుపుటకై మూలగ్రంథములోని కొన్ని శ్లోకములను వాని అర్థమును తెలుపు పద్యములును కొన్నింటిని వివరించడం చూడవచ్చును.
 
''విరాటపర్వం ''శ్లోకము <poem> ''ఆలో కయసి కిం వృక్షం సూద దారుక్రుతేనవై !
 
................................... యది తే దారుభిః కృత్యం బహిర్వ్రుక్షాన్ని గృహ్యతామ్ !!
 
అనువాద పద్యము ''వలలుం డేక్కడన్ జూచె ?నొండెడ నపెవ్యక్ష్మాజముల్ పుట్టవే?
 
అనువాద పద్యము ''వలలుం డేక్కడన్ జూచె ?నొండెడ నపెవ్యక్ష్మాజముల్ పుట్టవే?
............................. ఫలితంబై వరశాఖ లోప్పన్ గ ననల్పప్రీతి సంధించుచున్
 
.............................. విలసచ్చాయ నుపాశ్రిత ప్రతతికి న్విశ్రాంతిన్ గావింపన్ గాన్
 
............................... గల యీ భుజము వంట కట్టయలకై ఖండింపన్ గా నేటికిన్ ? </poem>
 
==తిక్కన పద్యములు:==
"https://te.wikipedia.org/wiki/తిక్కన" నుండి వెలికితీశారు