బి.నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 83:
===విజయా సంస్థలో ముఖ్యులు===
'''నటీనటులు:'''
విజయాసంస్థ ఏర్పడిన నాటి నుంచి 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ' వరకు వారి ప్రతి సినిమాలోనూ హీరో రామారావే. ఆయనతో బాటు విజయావారి ఆస్థాన నటులుగా ఉన్నవాళ్ళు [[ఎస్వీరంగారావుఎస్వీ.రంగారావు]], [[సూర్యకాంతం]], [[రేలంగి]], [[రమణారెడ్డి]] తదితరులు. వీరి నటనాప్రతిభ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ కాలంలో నటులు ఇతర సంస్థలు తీసే సినిమాల్లో హీరో వేషం వేయడం కంటే విజయావారి సినిమాల్లో ఎక్స్‌ట్రా వేషం వేయడమే మిన్నగా భావించేవారు. చాలా మంది నటులకు విజయావారి సినిమాల్లో నటించాలనే కోరిక [[మాయాబజార్]]తో తీరింది. ఆ సినిమాలో నాటి చిత్రరంగంలోని నటులందరూ కనిపిస్తారు. [[అక్కినేని నాగేశ్వరరావు]]కు విజయావారి సినిమాల్లో నటించే అవకాశం మొదట [[మిస్సమ్మ]] సినిమాతో వచ్చింది. చిత్రరంగంలో అడుగుపెట్టడమే హీరోగా అడుగుపెట్టిన ఆయన ఆ సినిమాలో పూర్తిస్థాయి హాస్యపాత్ర పోషించాడు. మాయాబజార్ తర్వాత ఆయనకు గుండమ్మకథలో సహనాయకుడి పాత్ర వేసే అవకాశం వచ్చింది. అది ఆయనకు నూరవ సినిమా కూడా. అది గొప్ప అదృష్టంగా భావించిన ఆయన ఆ సినిమాకు పారితోషికం తీసుకోలేదు. కానీ [[నాగిరెడ్డి]] ఆయనకు ఇవ్వవలసిన మొత్తాన్ని ఒక విద్యాసంస్థకు విరాళంగా ఇచ్చేశాడు.
 
'''తెరవెనుక నిపుణులు:'''
''దర్శకులు:'' [[ఎల్వీ ప్రసాద్]] ([[షావుకారు]], [[పెళ్ళిచేసిచూడు]], [[మిస్సమ్మ]]) ; కె.వి.రెడ్డి (పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరునికథ, మొ), [[కమలాకర కామేశ్వరరావు]] (చంద్రహారం, గుండమ్మకథ)
 
[[కె.వి.రెడ్డి]], [[కమలాకర కామేశ్వరరావు]] లిద్దరూ మొదట్నుంచి విజయ-వాహినీ సంస్థల్లోనే పనిచేస్తున్నారు. ఇద్దరికీ ఒకరిమీద ఇంకొకరికి అచంచలమైన విశ్వాసముండేది. ఇద్దరిలో ఎవరికి దర్శకుడిగా అవకాశమొచ్చినా ఇంకొకరిని సహాయదర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు. ఆ అవకాశం మొదట కె.వి.రెడ్డికే వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/బి.నాగిరెడ్డి" నుండి వెలికితీశారు