బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
వేశ్యావ్యామోహాన్ని గర్హిస్తూ బి.ఎన్. [[1945]]లో తీసిన [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]] తొలి సారిగా భారతదేశపు ఎల్లలు దాటి [[వియత్నామ్]] ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని ఒక విదేశీ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న తొలి తెలుగు సినిమాగా గణుతికెక్కింది. [[ఘంటసాల]] గాయకుడుగానూ, సంగీతదర్శకుడుగానూ పరిచయమైన సినిమా, నటిగా, గాయనిగా [[భానుమతి]]కి గుర్తింపు తెచ్చిన సినిమా, సినీరచయితగా [[చక్రపాణి]] పరిచయమైన సినిమా కూడా ఇదే.
 
భక్త పోతన తర్వాత బి.ఎన్., కె.వి.రెడ్డి ల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం వాహినీ బ్యానర్ మీద నిర్మించే సినిమాలలో ఒకదానికి బి.ఎన్. దర్శకత్వం వహిస్తే రెండవదానికి కె.వి. వహించాలి. బి.ఎన్. స్వర్గసీమ తీశాక కె.వి. [[యోగివేమన]] తీశాడు. తర్వాత సినిమా తీయవలసిన బి.ఎన్. వాహినీ స్టూడియో నిర్మించే పనిలో తీరిక లేకుండా నిమగ్నమవడం వల్ల తిరిగి కె.వి.యే సినిమా తీయడానికి సిద్ధ పడ్డాడు. మాంత్రికుల కథల మీద మోజున్న కె.వి. [[బాలనాగమ్మ]] తీద్దామన్నాడు. కానీ బి.ఎన్. ససేమిరా ఒప్పుకోలేదు. సవతి తల్లిని కౄరంగా చూపే ఆ కథ సమాజానికి తప్పుడు సంకేతమిస్తుందని ఆయన భావన. "మంచి సందేశమివ్వక పోతే మాను. అంతే కానీ తప్పుడు సందేశమివ్వకు." అని ఆయన కె.వి.కి గట్టిగా చెప్పారు.కె.వి.కి ఆయన గురు తుల్యులాయె.దాంతో ఆయన ఆ కథ పక్కన పెట్టి బి.ఎన్. సూచన మేరకు షేక్స్పియర్ విషాదాంత నాటకం ''కింగ్ లియర్''ను [[గుణసుందరి కథ]]గా తీశారు-[[1949]]లో.(తర్వాత [[1951]]లో చక్రపాణి-[[నాగిరెడ్డి]] ద్వయం కె.వి.రెడ్డికి [[పాతాళ భైరవి]]ని అప్పగించి మాంత్రికుల కథల మీద ఆయనకున్న మోజును తీర్చారు).
 
===మల్లీశ్వరి===