బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 151:
 
==విశిష్టతలు==
*ఎవరిచేతైనా తనకు నచ్చే విధంగా వచ్చేవరకూ పని చేయించడం బి.ఎన్. ప్రత్యేకత. 'మల్లీశ్వరి' లో [[శ్రీకృష్ణదేవరాయలు|రాయలవారి]]తో కలిసి మారువేషంలో వచ్చిన [[అల్లసాని పెద్దన]] (పాత్రధారి రేడియో అన్నయ్య [[న్యాయపతి రాఘవరావు]] గారు)మల్లీశ్వరి నృత్యం చూసి ఆశువుగా చెప్పవలసిన పద్యం కోసం కృష్ణశాస్త్రి గారి చేత ఒకటి కాదు రెండు కాదు అక్షరాలా నూట ఎనిమిది [[పద్యాలు]] వ్రాయించి వాటిలోంచి ఒక్ఖ పద్యాన్ని ఏరుకున్న పర్ఫెక్షనిస్టు బి.ఎన్.
*చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ క్వాలిటీ విషయంలో అంత కచ్చితంగానూ ఉంటారు బి.ఎన్. మాటల్లోనూ, పాటల్లోనూ ప్రతి అక్షరాన్నీ తరచితరచి చూస్తాడు. [[పూజాఫలం]]లో సినారె వ్రాసిన "పగలే వెన్నెల..." పాటను తనకు నచ్చేటట్లు వచ్చేదాకా తిరగరాయించాడు. ఆ పాటకు స్వరాలు కూర్చింది [[సాలూరు రాజేశ్వరరావు]]. ఆయన మాల్కోస్ రాగంలో ఆలపించారు ఆ పాటను. అయితే బి.ఎన్. ఆ పాటలో [[పల్లవి]] చివర 'కన్నులుంటే' అనే పదాన్ని 'టే' తర్వాత కాస్త సాగదీసి పాడించారు. ఆ పాటకు ఆ సాగతీత నెమలికి పింఛం అమరినంత అందంగా అమరింది. ఆ సాగతీత లేకుండా ఆ పాటను ఇప్పుడు మనం ఊహించుకోనైనా లేం.
*ఎక్‌స్టసీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి యోగసాధన అక్ఖర్లేదు. [[రాజమకుటం]] లోని 'సడి చేయకో గాలి...' పాట వింటే చాలు. అదీ బి.ఎన్. మార్కు పాట! తాననుకున్న ఎఫెక్టు వచ్చేవరకూ ఆయన అంత పట్టుదలగా పని చేయిస్తారు కాబట్టే ఆయన సినిమాలకు పనిచేసిన వారెవరూ తాము "చేశామని" చెప్పుకోరు. బి.ఎన్. తమ చేత "చేయించారని" మాత్రమే చెప్పుకుంటారు. ఆవిధంగా తానై శాసించక పోయినా పని 'రాబట్టుకోగలిగిన' ఒకేఒక్క దర్శకుడాయన.
*ఆయనలోని మరో ప్రత్యేకత తన సినిమాలకు స్క్రిప్టు దశలో నే ఆయన చేసే సెన్సారింగ్. ఆయన తీసిన చివరి సినిమా [[బంగారుపంజరం]]([[1969]]) స్క్రిప్ట్ లో హీరో తలుపు తట్టుతూ, అది తెరుచుకోవడం ఆలస్యమైతే "ఏం చేస్తున్నావ్?" అని అడిగే దృశ్యముంది. అప్పుడు అవతల్నించి హీరోయిన్ గొంతు "బట్టలు మార్చుకుంటున్నాను" అని వినిపించాలి. అయితే ఆ మాటలు విన్న ప్రేక్షకులు ఏం ఊహించుకుంటారోనని ఆ దృశ్యాన్ని తొలగించారాయన. అదీ, విలువల పట్ల ఆయనకున్న నిబద్ధత!