మారేడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
 
== ఉపయోగాలు ==
* మారేడు పండ్లు, కాయలు, బెరడు, [[వేళ్ళు]], ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. [[అతిసార వ్యాధి]]కి దీని పండ్ల రసాయనం చాలా మంచి మందు. [[ఆయుర్వేదము]]లో వాడు దశమూలము లలో దీని వేరు ఒకటి. మొలలకు ఇది మంచి ఔషధము. దీని ఆకుల రసము [[చక్కెర వ్యాధి]] నివారణకు చాలా మంచిది.
* మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.
* సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
* మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే వేసవి పానీయంగా కూడా బావుంటుంది. ప్రేవులను శుభ్రపరచడమే కాకుండా, వాటిని శక్తివంతంగా కూడా తయారుచేస్తుంది.
* మారేడులో ఉన్న [[విచిత్రం]] ఏమిటంటే బాగా పండిన [[పండు]] విరేచనకారిగా ఉపయోగపడితే, సగంపండిన పండు విరేచనాలు ఆగటానికి ఉపయోగపడుతుంది.
* జిగురు విరేచనాలవుతున్నా సగం పండిన మారేడు పండు ఎంతో ఉపకరిస్తుంది.
* విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుముగా చేసినది బాగా ఉపకరిస్తుంది.
* మారేడు ఆకుల కషాయాన్ని కాచుకుని తాగితే హైపవర్ ఎసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి.
* మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత [[జలుబు]], తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది.
;ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
* 1.మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.
* 2.సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
* 3.విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుముగా చేసినది బాగా ఉపకరిస్తుంది.
 
==హిందూమతంలో మారేడు==
మారేడు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం. మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు.
"https://te.wikipedia.org/wiki/మారేడు" నుండి వెలికితీశారు