తళ్ళికోట యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
== యుద్ధ నేపథ్యం ==
ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఒక్కసారిగా ఉత్పన్నమైనవి కావు. దశాబ్దాలుగా విజయనగరానికి, సుల్తానులకు మధ్యగల వైరం తరచూ యుద్ధాలకు కారణభూతమవుతూనే ఉండేది. దాదాపు ప్రతి దశాబ్దంలోనూ ఒక పెద్ద యుద్ధం సంభవించింది. ముఖ్యంగా సంపదలతో తులతూగే కృష్ణా, [[తుంగభద్ర]] నదుల మధ్యన ఉన్న [[రాయచూరు అంతర్వేది]] ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది. [[1509]] నుండి [[1565]] వరకు విజయనగరంపై[[విజయనగరం]]పై విజయం సుల్తానులకు అందని పండే అయింది. అంచేత, సహజంగానే విజయనగరాన్ని ఓడించాలనే కాంక్ష వారిలో బలపడింది.
 
శ్రీకృష్ణదేవరాయలు [[1520]] [[మే 19]]న బీజాపూరు సుల్తాను [[ఇస్మాయిల్ ఆదిల్షా]]ను చిత్తుగా ఓడించి రాయిచూరును[[రాయిచూరు]]ను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత [[సుల్తాను]] విజయనగరాన్ని గెలుచుకోవాలనే కలను మర్చిపోయి, తన పొరుగున ఉన్న [[ముస్లిం]] రాజ్యాలతో స్నేహ సంబంధాల కొరకు ప్రయత్నించాడు. [[రాయచూరు]] ఓటమి దక్కను సుల్తానుల ఆలోచనలలో మార్పుతో పాటు సమైక్యంగా ఉండాలనే తలంపును తీసుకువచ్చింది.<ref name=robert>[ftp://ftp.archive.org/pub/etext/etext02/fevch10.txt విస్మృత సామ్రాజ్యం - రాబర్ట్ సెవెల్ రచన]</ref>
 
ఈ సుల్తానులు ఒకరంటే ఒకరికి పడేది కాదు. [[అహ్మద్‌నగర్]], [[బీజాపూర్]] సుల్తానుల మధ్య పచ్చగడ్డి చేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. తమ తగాదాల పరిష్కారం కోసం వారు రామరాయల సహాయం అడగడం, రామరాయలు ఎవరో ఒకరి పక్షం వహించడం జరుగుతూ వచ్చింది. మొదట్లో నిజాంషాతో కలిసి ఆలీ ఆదిల్‌షాను ఓడించాడు. కొంతకాలానికే ఆదిల్‌షా రామరాయలుతో మైత్రి నెరపి నిజాంషాపై యుద్ధం చేసాడు. మరో సమయంలో [[హుసేన్‌ నిజాంషా]], [[ఇబ్రాహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కుతుబ్‌షా]] కలిసి [[అలీ ఆదిల్‌షా]] పైకి దండెత్తినపుడు, అతడు రామరాయల సాయం కోరాడు. ఆదిల్‌షా, రామరాయల సంయుక్త సైన్యాన్ని [[కళ్యాణి]] వద్ద ఎదుర్కోడానికి సిద్ధపడ్డాక, సరిగ్గా యుద్ధం మొదలు పెట్టబోయే ముందు, కుతుబ్‌షా నిజాంషాను ఏకాకిని చేసి, తాను రామరాయలుతో చేరిపోయాడు. చేసేది లేక హుసేన్‌షా అహ్మద్‌నగర్‌కు పారిపోయాడు. ఒక పరస్పర నమ్మకంతో కూడిన, కాలపరీక్షకు నిలిచిన స్నేహాలు ఎవరి మధ్యనా లేవు.
 
సైనికపరంగా సుల్తానులపై తనది పైచేయిగా ఉండడంతో రామరాయలు వారితో చులకనగా వ్యవహరించేవాడు. తన సభలో వారి రాయబారులకు తగు గౌరవం ఇచ్చేవాడు కాదని చరిత్రకారులు చెబుతారు. ఐతే, ఈ విషయం మీద చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు చరిత్రకారుల ప్రకారం రామరాయలు ముస్లిములు నివసించే ప్రాంతాలను ఆక్రమించుకున్నపుడు ముస్లిము మతాచారాలను అవమానించేవాడని చెబుతారు. కాని కొందరు ఇది సరికాదనీ, రామరాయల వద్ద అనేక మంది [[ముస్లిములు]] పనిచేసేవారనీ, రామరాయలు వారి కొరకు ప్రత్యేకంగా నివాసస్థలాలు, ప్రార్థనా స్థలాలు కట్టించి ఇచ్చేవాడనీ అంటారు.
 
విజయనగర సామ్రాజ్యం చాలా విశాలంగా ఉండేది. అంతేకాకుండా సిరి సంపదలతో తులతూగుతూ అపారమైన సైనిక సంపత్తి కలిగి ఉండేది. ఇంతటి బృహత్తరమైన సామ్రాజ్యాన్ని జయించగలిగే శక్తి ఏ ఒక్క ముస్లిము రాజ్యానికీ అప్పట్లో లేదు. దక్కన్ సుల్తానులందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే విజయనగరాన్ని జయించే అవకాశం ఉంది. విజయనగరాన్ని జయించడానికి కూటమి ఏర్పాటుకు పూనుకోవాలని ఆదిల్‌షా సన్నిహితులు, సలహాదారులు ఆదిల్‌షాకు చెప్పారు. ఇంకో గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ సమయంలో ఆలీ ఆదిల్‌షాకు, రామరాయలకు మధ్య మైత్రి ఉండేది. అయినప్పటికీ అతడు [[గోల్కొండ]] సుల్తాను [[ఇబ్రాహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కుతుబ్‌షా]]తో మంతనాలు చేశాడు. ఇబ్రహీం దానికి ఒప్పుకోవడమే కాక, ఆదిల్‌షా బద్ధ విరోధియైన అహ్మద్‌నగర్ సుల్తానుకు రాయబారం పంపి, ఆలీ ఆదిల్‌షా, హుస్సేన్‌షా లకు సంధి కుదిర్చాడు. ఈ సంధిలో భాగంగా హుసేన్‌షా కూతురు, చాంద్ బీబీ సుల్తానును ఆలీ ఆదిల్‌షా పెళ్ళి చేసుకోగా, ఆలీ ఆదిల్‌షా చెల్లెలు, బీబీ హదియా సుల్తానును హుసేన్‌షా కొడుకు, మూర్తజా పెళ్ళి చేసుకున్నాడు.<ref>Vijayanagara: History and Legacy S. Krishnaswami Aiyangar (ed.) Aryan Books International (2000) పేజీ.248</ref><ref>యుద్ధ సమయములో అలీ ఆదిల్‌షా వద్ద మంత్రిగా పనిచేసిన రఫీయుద్దీన్ షిరాజీ చెప్పిన వృత్తాంతము. మీర్జా ఇబ్రహీం జుబిరీ రాసిన ''బసతిన్-ఉస్-సలాతీన్'' నుండి అనువదించబడినది</ref>
"https://te.wikipedia.org/wiki/తళ్ళికోట_యుద్ధం" నుండి వెలికితీశారు