ఉమర్జీ అనూరాధ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:తెలుగు రచయిత్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 10:
}}
'''ఉమర్జీ అనూరాధ''' [[తెలుగు సినిమా]] మరియు జర్నలిజం యొక్క భారతీయ రచయిత్రి. ఆమె
== ప్రారంభ జీవితం ==
ఆమె మరాఠీ మాట్లాడే మాధ్వా కుటుంబంలో జన్మించింది. ఆమె మామయ్య రైల్వే స్టేషన్ మాస్టరుగా ఉన్నందున [[కృష్ణా జిల్లా]] లోని [[విజయవాడ]] మరియు [[గుంటూరు]] జిల్లాలోని [[మంగళగిరి]] ప్రాంతాలలో విద్యాభ్యాసం చేసారు. ఆమె పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పటి నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే వరకు ఆమెకు ఆసక్తి ఉన్న నాటకాలను రచన కొనసాగించారు. ఆమె తల్లిదండ్రులు వేమగంటి సుశీల మరియు జి.నాగరాజన్. ఆమె కొంతకాలం కుప్పురావు శ్రీనివాసరావు అనే రైల్వే స్టేషన్ మాస్టర్ ఇంట్లో పెరిగారు. ఆమె తల్లి వేమగంటి సుశీల కూడా రచయిత్రి మరియు ఆలిండియా రేడియో మద్రాసులో నటి. <ref name=":0"/>
==జీవితం==
===జర్నలిజం===
ఆమె తన భర్త శ్రీధర్ కుమార్ తో పాటు [[ఈనాడు]] దినపత్రికలో రచనలు చేస్తూ ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆమె భర్త యొక్క స్క్రీన్ పేరు గౌతం కశ్యప్. ఆయన ఈనాడులో ఫోటో జర్నలిస్టుగా పనిచేసేవాడు. తరువాత ఆయన పి.హెచ్.డి కొరకు సినీ నిర్మాత [[భారతీరాజా]] వద్ద చేరాడు. అనూరాధ ఈనాడు దినపత్రికకు మొట్టమొదటి మహిళా స్టాఫ్ రిపోర్టరుగా గుర్తింపబడ్డారు. ఆమె ఈనాడు, [[తమిళనాడు]] ఎడిసన్ కు ఇన్చార్జ్ భాద్యతలు నిర్వహించారు. తరువాత ఆమె భర్త గౌతం కశ్యప్ రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉషాకిరణ్ మువీస్ కొరకు స్క్రిప్ట్ రచయితగా చేరినందున ఆమె [[హైదరాబాదు]] బదిలీపై వచ్చారు. ఆమె అనేక ఆర్టికల్స్, కాలమ్స్, వివిధ సినిమా ప్రముఖుల యొక్క చరిత్రలను ఈనాడు సినిమా పేజీలో ప్రచురించడానికి మరియు సితార సినీ పత్రికకు వ్రాసారు. తరువాత ఆమె [[మహారాష్ట్ర]] కు డెస్క్ ఇన్ఛార్జ్ గా పదోన్నతి పొందారు. ఆమె [[ముంబై]] లో ఈనాడు పత్రిక స్థాపించడానికి కృషిచేసారు. ఆమె ఈనాడు ముంబై ఎడిసన్ ప్రారంభ వేడుకలను పర్యవేక్షించారు. ఆమె ఈనాడు పత్రికకు స్టాఫ్ రిపోర్టరుగానూ, సినిమా డెస్క్ ఇన్ఛార్జ్ గానూ మరియు మహారాష్ట్ర డెస్క్ ఇన్ఛార్జ్ గాను తన సేవలనందించారు.<ref name=":0"/>
==మూలాలు==
|