గుడిపాటి వెంకట చలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
 
===మహా ప్రస్థానానికి ముందుమాట===
చలం, [[శ్రీ శ్రీ]] వ్రాసిన [[మహాప్రస్థానం]]కు ముందుమాట వ్రాసాడు. [[మహాప్రస్థానం]] లోని రచనలకు దీటుగా ఈ ఉపోద్ఘాతం తెలుగు సాహిత్యంలో[[సాహిత్యం]]లో ప్రసిద్ధమైంది. <!-- చలం వ్రాసిన ముందుమాటకు అంత కంటె గొప్పపేరు వచ్చింది అని చెప్పటంలో అతిశయోక్తి ఎంతమాత్రంలేదు. (ఇది అభిప్రాయం గనుక తొలగించబడింది) --> "[[యోగ్యతా పత్రం]]" అన్న శీర్షికతో వ్రాయబడిన ఈ ముందుమాట తెలుగు రచనలలో అత్యంత ప్రసిద్ధమైన ముందుమాటలలో ఒకటి. చలం మాటల్లో అంత శక్తి, వాడి(పదును) ఆలోచింపజేయగల శక్తి ఉన్నాయి. అందులో కొన్ని వాక్యాలు క్రింద ఉదహరింపబడినాయి-
 
*ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) [[శ్రీ శ్రీ]] అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాధంలోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరిబిక్కిరై తుఫానుహోరు చెవుల గింగురుమని, నమ్మిన కాళ్ళకింది భూమి తొలుచుకుపోతోవుంటే, ఆ చెలమే నయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.
*శ్రీ శ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆరెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి కిర్రుమనేట్టు ఇద్దరూ అరుస్తారు. ఏమీ రసం లేకుండా flat గా ఎక్కడికో, ఏమీ చేతగానివాళ్ళమల్లే జారిపోతారు. కాని ఆ అరుపుల్లో, చీకట్లో మొహాలూ, తోకలూ కనపడక వెతుక్కునే ప్రజల రొద, గాలిదెబ్బలకింద ఎగిరిపడే సముద్రపు [[తుఫాను]] గర్జనం, మరఫిరంగుల మరణధ్వానం, గింగురుమంటాయి. కంఠం తగ్గించి వినపడకండా తగ్గుస్థాయిలో మూలిగారా, దిక్కులేని దీనుల మూగవేదన, కాలికింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్ళులేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం వినిపింపజేస్తారు. బుద్ధి వున్నవాడెవ్వడూ అతనిది సంగీతమని కాని, ఇతనిది కవిత్వమని కాని వొప్పుకోడు; వొప్పుకోటమూ లేదు. ఎందుకంటే ఈ ఇద్దరి Appeal బుద్ధిని, వివేకాన్ని, కళాబంధనల్ని మించిన ఏ అంతరాళానికో తగులుతుంది -ఆ అంతరాళం అనేది వున్న వాళ్ళకి.
*...శ్రీ శ్రీ "ఆకలేసి" [[నక్షత్రాలు]] అదిరిచూసే "కేకలేశాడు." ఈ కవికి ఆకలివేస్తే రా- గారి యింటికెళ్ళి శ్లాఘించి భత్యఖర్చు తెచ్చుకుని, [[భోజనం]] చేసి ప్రియురాలిమీద గీతం వ్రాశాడు.
 
మచ్చుకి, చలం శైలి ఈ కింద ఉదహరించిన వ్యాసం/కథలో చూడవచ్చు. ఈ రెండూ కూడా, ఈ పక్కన ఇచ్చిన లింకుల ద్వారా చదువవచ్చు.
"https://te.wikipedia.org/wiki/గుడిపాటి_వెంకట_చలం" నుండి వెలికితీశారు