అమరసింహుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
'''అమరసింహుడు''' నాల్గవ శతాబ్దమునాటి [[బౌద్ధమతస్తుడు]], పురాతనుడు. [[సంస్కృత]], భాషాభ్యాసమునకు మహోపకారియగు ఒక నిఘంటువును రచించాడు. దానిపేరు ''నామలింగాను శాసనము''. వాడుకలో దానిని [[అమరకోశం]] అని కూడా అంటారు. తెలుగు వారికోసం దాని వ్యాఖ్యానమును [[లింగాభట్టు]] రచించాడు. ఇతని కాలమునాటికి చాలా నిఘంటువులుండేవి. [[త్రికొండి]], [[ఉప్తలిని]] మొదలగు గ్రంథములూ, వాడి, వరరుచి, వాగురి, [[వామనుడు]], మొదలగు గ్రంథకర్తలను ఇందులో పేర్కొన్నారు.
 
ఇతడు బౌద్ధుడయినను, భారతీయ సాంప్రదాయములకు, ఆచారవ్యవహారములకూ విరుద్ధుడు కాడు. భాషాసేవయే ముఖ్యమని భావించి స్వాభిప్రాయముల జొప్పించక [[సంస్కృతము]]నకు మేలు చేకూర్చాడు. [[నిఘంటువు]] శబ్దములప్రోగు. ఈ శబ్దములు మానవ మనోభావసూచితములు. దేశముయొక్క నాగరితాభివృద్ధిని గమనింపదలచువారు కీశబ్దశాస్త్ర పరిగ్ఞానము సహకారియగును. కొన్ని కొన్ని శబ్దములు[[శబ్దము]]లు మొదటి అర్ధమును విడనాడి నూత్నాశయములకొరకు సృజింపబడును. అమరకోశమును పరిశోధించిన కొన్ని సంగతులు బయల్వెడలును.
 
[[పరిష్యా]] దేశమున పూర్వకాలమున నివసించువారు మన యార్యసంతతివారై మతాభిప్రాయములచే భిన్నులయిరని మనకు చరిత్ర తెల్యిపరచుచున్నది. దాని కొంకింత బలము ఈ అమరకోశము కనబడుచున్నది. ఆహిర్, బుద్న్యుడు పారశీక దేవ బృందమునందువాడు. ఆతనినే భారతీయులు లోకాదశరుద్రులలో చేర్చిరి. సురను నిషేధించినవారు పారశీకువారసులయిరి. దానిని గ్రహించిన మన పూర్వేకులు సురలయిరి. అసురులకును, సురలకును మొదటి నివాస స్థలము ఒక్కటియే. కనుకనే వారలకు పూర్వ దేవతలని నానుది. అమరకోశములో కొన్ని పదాలకు అర్ధము ఈ వరవడిని తెలియపరచుచున్నది.దేవతలందరూ సదా 25 ఏండ్లవారు. ఈ బృందారకులయందు 49 విధములుగా గణదేవతలు ముఖ్యులు. ఇక్కాలమున గనదేవతల నామరూపములు గానరావు. రాక్షసులు గూడా దేవయోనిజ్లులలో జేరినవారే. వీరలనుండి ఆర్యులు తమ పశువులను రక్షించు కొనుచుండిరిట. వీరిలో దైత్యులు దానవులని ఇరుతెరగులు.మాంసాహారమునందసూయ భావము గనపడుచున్నది. పిశాచులు మాంసాభుక్కులు [[రాక్షసులు]] రాత్రియందు భోజనము జేయువారట.
"https://te.wikipedia.org/wiki/అమరసింహుడు" నుండి వెలికితీశారు