బనగానపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (10), కు → కు (5), గా → గా (4), ఆర్ధిక → ఆర్థిక, కలదు. → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 108:
 
==చరిత్ర==
[[1601]]లో [[బీజాపూర్|బీజాపూరు]] సుల్తాను [[ఇస్మాయిల్ ఆదిల్‌షా|ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా]] బనగానపల్లె కోటను[[కోట]]ను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్‌ ఆధీనంలో [[1665]] వరకు ఉన్నాయి. మహమ్మద్‌ బేగ్‌ ఖాన్‌-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన [[ఫైజ్‌ ఆలీ ఖాన్‌ బహదూరు]]కు ధారాదత్తమైంది. [[మొగలు]] చక్రవర్తి[[ఔరంగజేబు]] [[1686]]లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్‌ ఆలీ మేనమామ, [[ముబారిజ్‌ ఖాన్‌]] దయవల్ల ఫైజ్‌ ఆలీ ఖాన్‌ స్థానం పదిలంగానే ఉంది.
[[బొమ్మ:Banaganapalle samsthanam.jpg|left|frame|బనగానపల్లె సంస్థాన పటము]]
 
పంక్తి 115:
[[1800]] తొలినాళ్ళలో బనగానపల్లె [[బ్రిటిషు ఇండియా]]లో ఒక సంస్థానంగా మారిపోయింది. ఆర్థిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా [[1832]] నుండి [[1848]] వరకు ఒకసారి, [[1905]]లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను [[మద్రాసు ప్రెసిడెన్సీ]] గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. [[1901]]లో బనగానపల్లె సంస్థానం 660 చకి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది, మిగిలినవన్నీ జమీందారీల హోదాలోనే ఉండేవి.<ref name="ఆంధ్ర సంస్థానములు సాహిత్యపోషణ">{{cite book|last1=తూమాటి|first1=దొణప్ప|title=ఆంధ్రసంస్థానములు - సాహిత్యపోషణ|date=ఆగస్టు 1969|publisher=ఆంధ్రా యూనివర్శిటీ|location=విశాఖపట్టణం|page=12|edition=1}}</ref>
 
[[1948]]లో కొత్తగా ఏర్పడిన భారత దేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; [[మద్రాసు]] రాష్ట్రం లోని [[కర్నూలు జిల్లా]]లో భాగమయింది. [[1953]]లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి [[ఆంధ్ర రాష్ట్రం]]గా ఏర్పడ్డాయి.
 
==పట్టణం స్వరూపం==
"https://te.wikipedia.org/wiki/బనగానపల్లె" నుండి వెలికితీశారు