అంగ్ సాన్ సూకీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అభ్యర్ధి → అభ్యర్థి, ఐఖ్య → ఐక్య (6) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''ఆంగ్ సాన్ సూకీ''' 1945 [[జూన్]] మాసంలో జన్మించింది. ఆమె బర్మాదేశ ప్రతిపక్షనాయకురాలు. ఆమె [[బర్మా]]లో ప్రముఖ రాజకీయవాది మరియు "నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ " (ఎన్ ఎల్ డి)చైర్ పర్సన్. 1990 జనరల్ ఎన్నికలలో ఎన్ ఎల్ డి 59% ఓట్లను, 81% (మొత్తం 485 స్థానాలలో 382 స్థానాలు) పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ ఆమెను ఎన్నికలకు ముందే బర్మా ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఆమె 1987 నుండి 2010లో విడుదల అయ్యేవరకూ దాదాపు 15 సంవత్సరాలకాలం గృహనిర్బంధంలోనే ఉంచబడింది. ఆమె ప్రపంచంలో ప్రముఖ రాజకీయఖైదీగా గుర్తించబడింది.
 
సూకీ 1990లో స్వతంత్ర భావాల కొరకు రాఫ్టో మరియు షాఖ్రోవ్ పురస్కారం అందుకున్నది. 1991లో [[నోబుల్ బహుమతి]] అందుకున్నది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ అవగాహన కొరకు ఆమెకు [[జవహర్ లాల్ పురస్కారం]] ఇచ్చింది.[[వెనుజులా]] ప్రభుత్వం ఆమెకు " సైమన్ బోలీవర్ " పురస్కారం ఇచ్చి గౌరవించింది. 2007 లో [[కెనడా]]
ప్రభుత్వం ఆమెకు గౌరవ పౌరసత్వం ఇచ్చి గౌరవించింది. [[కెనడా]] నుండి ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో ఆమె నాలుగవది. 2011లో ఆమె వాలెన్ బర్గ్ పతకం అందుకున్నది. 2012 సెప్టెంబర్ 19 తేదీన ఆంగ్ కై సూకీ కాంగ్రెస్ బంగరు పతకం అధ్యక్షుని స్వాతంత్ర్య పతకంతో చేర్చి అందుకున్నది.ఇది సంయుక్తరాష్ట్రాల పురస్కారాలలో అత్యుత్తమమైనది.
 
2012 ఏప్రెల్ 1 ఆమె పార్టీ అయిన నేషనల్ కాంగ్రెస్ లీగ్ ఫర్ డెమక్రసీ ఆమె బర్మా దిగువ సభ కొరకు ఎన్నికైనట్లు ప్రకటించింది. ఆమె పార్టీ బర్మా దిగువ సభ 45 ఖాళీ స్థానాలలో 43 స్థానాలను ఎన్నికలలో గెలుచుకుంది. తరువాత రోజు అధికారికంగా ఎన్నికల కమీషన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. రాఖిన్ రాష్ట్రం లోని యాంటీ-రోహింగ్యా దౌర్జన్య కారుల విషయంలో మౌనం వహించినందుకు అదే సంవత్సరం కొంతమంది ఉద్యమకారుల చేత ఆమె విమర్శించబడింది. సూకీ ఫాదర్ ఆఫ్ బర్మాగా కీర్తించబడిన అంగ్ సాన్ యొక్క ఏకైక పుత్రిక.
పంక్తి 49:
 
== వ్యక్తిగత జీవితం ==
ఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ 19 తారీఖున రంగూన్ (ప్రస్తుతం యాంగన్) లో పుట్టింది. ఆమె తండ్రి అయిన ఆంగ్ సాన్ 1947 లో బర్మా సైన్య స్థాపకుడే కాక బర్మీయుల స్వాతంత్ర్యం కొరకు ఆంగ్లేయులతో దౌత్యం నడిపాడు. అదే సంవత్సరం ఆయన తన రాజకీయ శత్రువుల చేత కాల్చి చంపబడ్డాడు. ఆమె తన తమ్ములైన సాన్ లిన్ మరియు ఆంగ్ సాన్ ఊ తల్లి పోషణలో బర్మాలో నివసించారు. ఆంగ్ సాన్ ఊ తమ ఇంటి వద్ద ఉన్న అలంకార సరస్సులో పడి తన ఎనిమిదవ సంవత్సరంలో మరణించాడు. పెద్ద సహోదరుడైన సాన్ లిన్ [[కాలిఫోర్నియా]] లోని [[శాన్ డియోగో]]కు వలస వెళ్ళి తరువాత సంయుక్తరాష్ట్రాల పౌరుడు అయ్యాడు. ఆంగ్ సాన్ మరణించిన తరువాత కుటుంబం ఇన్యా లేక్ ప్రాంతానికి నివాసం మార్చుకున్నది. అక్కడ సూకీకి వైవిధ్యమైన నేపథ్యం కలిగిన ప్రజల పరిచయం అయింది. రాజకీయ నేపథ్యం మరియు మతం వాటిలో ప్రధానమైనవి. సూకీ " మెథడిస్ట్ ఇంగ్లీషు ఉన్నత పాఠశాల"లో విద్యాభ్యాసం సాగించింది. ఆమె తరువాత [[బౌద్ధ]] మతానికి చెందినది.
 
సూకీ తల్లి ఖిన్‌కీ కొత్తగా రూపొందించబడిన బర్మా ప్రభుత్వంలో రాజకీయ ప్రాముఖ్యత సంపాదించింది. 1960లో ఆమె భారతదేశప్రభుత్వానికి మరియు నేపాల్ ప్రభుత్వానికి రాజకీయ ప్రతినిధులను నియమించింది. ఆమెను అనుసరించిన ఆంగ్ సాన్ సుకీ [[ఢిల్లీ]] లోని జీసెస్ అండ్ మేరీ స్కూల్ కాన్వెంటులో విద్యాభ్యాసం పూర్తిచేసి న్యూఢిల్లీ శ్రీ రాం కాలేజ్‌లో పట్టభద్రురాలైంది. ఆమె 1964లో పొలిటికల్ పట్టభద్రురాలైంది. సూకీ తన విద్యాభ్యాసం కొనసాగించి 1969లో ఆక్స్‌ఫర్డ్ హాస్ కాలేజ్ నుండి ఫిలాసఫీ, పాలిటిక్స్ మరియు ఎకనమిక్స్ మాస్టర్ డిగ్రీ పొందింది. విద్యాభ్యాసం తరువాత ఆమె కుటుంబ మిత్రుడూ ఒకప్పుడు బర్మా పాప్ గాయకుడు అయిన మా తాన్ ఈతో [[న్యూయార్క్]] నగరంలో నివసించింది. ఆమె సంయుక్త రాష్ట్రాలలో మూడు సంవత్సరాలు ప్రణాళిక వ్యవహారాల శాఖలో పని చేసింది. 1971లో సూకీ టిబెటన్ సంస్కృతి స్కాలర్" డాక్టర్ మైకేల్ ఆరిస్"ను వివాహం చేసుకుని భూటాన్‌లో నివసించసాగింది. తరువాత సంవత్సరంలో ఆమె [[లండన్]] నగరంలో తన మొదటి సంతానమైన అలెగ్జాండర్ ఆరిస్‌కు జన్మనిచ్చింది. 1977లో ఆమె రెండవ కుమారుడైన కింకు జన్మనిచ్చింది. 1985-1987 మధ్య కాలంలో బర్మీస్ సాహిత్యంలో రీసెర్చ్ స్టూడెంటుగా లండన్ లోని " ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ " అనే పాఠశాలలో పనిచేసింది. 1990లో ఆమె ఆనరరీ ఫెలోగా ఎన్నిక చెయ్యబడింది. తరువాత రెండు సంవత్సరాలు ఆమె సిమ్లాలోని " ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాంస్డ్ స్టడీస్ "లో ఫెలోగా ఉన్నది. ఆమె గవర్నమెంట్ ఆఫ్ యూనియన్‌లో కూడా పనిచేసింది.
 
1988లో బర్మాకు తిరిగి వచ్చిన సూకీ ప్రారంభంలో రోగగ్రస్థురాలైన తల్లి కొరకు అక్కడే ఉండి పోయింది. తరువాత మెల్లగా ప్రజాస్వామ్య ఉద్యమానికి నాయకత్వం వహించింది.
"https://te.wikipedia.org/wiki/అంగ్_సాన్_సూకీ" నుండి వెలికితీశారు