గోపరాజు సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, మహ → మహా, → using AWB
పంక్తి 1:
'''సరస్వతి గోరా''' (1912–2006) భారతీయ సామాజిక ఉద్యమకారిణి. ఆమె సంఘసేవిక, మతాతీత మానవతావాది. ఆమె నాస్తిక కేంద్రానికి అనేక సంవత్సరాలపాటు ప్రసిద్ధ నాయకురాలిగా యున్నారు.ఆమె అస్పృస్యత మరియు కుల వ్యవస్థ పై అనెక కార్యక్రమాలను, ఉద్యమాలను చేసారు.
==జీవిత విశేషాలు==
ఆమె విజయనగరంలో[[విజయనగరం]]లో 1912లో జన్మించింది. పదేళ్ల వయసులో [[గోరా]]తో పెళ్ళయ్యింది. గోరాతో పాటు ఆమె [[నాస్తిక]] కేంద్రాన్ని స్థాపించింది.ఈ కేంద్రంలో నాస్తికవాదం, హేతువాదం మరియు గాంధేయవాదం వంటి వాటిపై మానవతా విలువలు పెంపొందించేవారు. గోరాతో పాటు సరస్వతీ గోరా 1928 ప్రాంతాల్లో శ్రీలంకలో ఉన్నారు. మతాచారాల్ని ధిక్కంచారు. పైగా ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కావాలని గ్రహణం చూశారు. [[రాహువు]], [[కేతువులు]] మానవ సమాజంలోనే ఉన్నారన్నారు. నిప్పులమీద నడవడమనేది దేవతల మహాత్మ్యం కాదని ఎవరైనా నడవవచ్చని ఆమె స్వయంగా నిప్పుల మీద నడచి ఋజువు చేసింది. [[దేవదాసీ]] వ్యవస్థ భ్రష్టాచారమంటూ దేవదాసీలకు స్వయంగా వివాహం జరిపించారు. కుల నిర్మూలన, నాస్తిక వాదాల్ని విస్తృతంగా ప్రచారం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కొన్నాళ్లు జైలుశిక్ష అనుభవించారు. అస్పృశ్యతా నివారణ ఉద్యమం చేపట్టారు. [[మహాత్మా గాంధీజీ]] ఆమె సేవల్ని గుర్తించి సేవాగ్రామ్ ఆహ్వానించారు. ఆహార కొరత ఉన్న రోజుల్లో [[కూరగాయలు]] పండించాలని ఉద్యమించారు. ఈనాం భూముల్ని పొలాలు లేని రైతులకు పంచాలని సత్యాగ్రహం చేపట్టారు. ఆచార్య [[వినోబాభావే]] చేపట్టిన సర్వోదయ ఉద్యమాన్ని చేపట్టి దేశమంతా పర్యటించి వినోబాభావే ఆశయాలకు వ్యాప్తి కల్పించారు.మతాన్ని సూచించే ఏ ఆభరణాలు, చిహ్నాలు ఆమె ధరించే వారు కాదు. పుణ్యవతిగా [[బొట్టు]], [[కాటుక]], [[గాజులు]], [[మంగళసూత్రాలు]] వంటివి ధరించలేదు. 1975 జూలై 26న గోరా మరణించినప్పుడు ఆమె అభిమతానికి అనుగుణంగా ఏ మత సంప్రదాయాన్ని పాటించకుండా సంస్కారాలు జరిపించారు.
 
ఆమె [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో పాల్గొన్నారు. రెండున్నర సంవత్సరాల వయస్సు గల కుమారుడు "నియంత"తో పాటు జైలు జీవితం గదిపారు
 
ఆమె కుమార్తె "మనోరమ" వివాహం అర్జునరావుతో జరిగింది. ఈ వివాహం 1060 లో [[జవహర్ లాల్ నెహ్రూ]] అధ్వర్యంలో జరిగింది.
 
== అవార్డులు,గుర్తింపు ==
"https://te.wikipedia.org/wiki/గోపరాజు_సరస్వతి" నుండి వెలికితీశారు