తెల్కపల్లి రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
ఇతడు బహుముఖీన ప్రతిభావంతుడు. కేవలం సంస్కృత రచనలేకాక ఆయుర్వేదంలో ఇతడు దిట్ట. ఇతని ఆయుర్వేద చిట్కాలు, ప్రసంగాలు ఆకాశవాణిలో ఎన్నో ప్రసారమైనాయి. ఎంతో మంది రోగులకు స్వయంగా ఆయుర్వేద మందులను తయారు చేసి ఇచ్చి స్వస్థత చేకూర్చాడు. అంతేగాక వడ్రంగి, కంసలి వంటి వృత్తులలో కూడా ఇతనికి ప్రవేశం ఉంది. తన ఇంటి తలుపులకు తానే స్వయంగా చెక్కిన వాణీ విలాస నిలయః అన్న అందమైన అక్షరాలు, తన ఇంటిలో స్వయంగా తయారు చేసుకున్న కర్ర స్టాండ్లకు చెక్కిన మామిడి పిందెల అలంకరణ ఇతడి ప్రతిభకు నిదర్శనాలు.
==సాహిత్య రంగం==
1922- 23 సంవత్సరం నుంచి ఇతని సాహిత్య ప్రస్థానం ప్రారంభమైనది. ఇతని మొదటి రచన 27 ఆర్యావృత్తాలతో కూడిన భారతీ తారామాల అనే శారదాస్తుతి. దీనిని ఇతడు బందరులో[[బందరు]]లో ఉన్నప్పుడే రచించాడు. మాణిక్యప్రభు పీఠాన్ని దర్శించి ఆశువుగా కవితా కాంతా స్వయంవరము అను ఖండకావ్యాన్ని చెప్పాడు. ఇది 1926లో ముద్రించబడినది.
 
శృంగేరీ పీఠానికి వెళ్లి అక్కడ శారదాదేవిని చూడగానే ఇతడూ శారదా నవరత్నమాలికను ఆశువుగా చెప్పడమే కాకుండా లలితాస్తవఝరి అనే పేరుతో మరో 50 శ్లోకాలను చెప్పాడు. మైసూరులోని పరకాల మఠాన్ని దర్శించి అక్కడి హయగ్రీవస్వామిపై హయగ్రీవ శతకాన్ని రచించి పండితుల మెప్పును పొందాడు. తర్వాత కాలంలో శారదానవరత్నమాలికను పొడిగించి శారదాస్తుతి శతకాన్ని రచించాడు. ఇవేకాక ఉమామహేశ్వర సుప్రభాతం, శ్రీహనుమత్సుప్రభాతం, మామిళ్లపల్లి లక్ష్మీనరసింహ సుప్రభాతం, గురుపీఠతత్త్వదర్శనం, శివానందాష్టకం, గణేశ పంచరత్నాలు, అయ్యప్పస్తుతి వంటి ముద్రిత రచనలతోపాటు కలిశతకం, రవీంద్రతపఃఫలము, ధూమశకట ప్రమాదం, చ్యవనోపాఖ్యానం, సుకన్యాస్తవం, మృత్యుశకటం వంటి అముద్రిత రచనలను చేశాడు. ఇతని కావ్యలక్ష్మి రచనను గోలకొండ కవుల సంచికలో చోటుచేసుకుంది.